BigTV English

Thandel Movie : ‘తండేల్ ‘ కు కనీస ఓపెనింగ్స్ కూడా కష్టమేనా..?

Thandel Movie : ‘తండేల్ ‘ కు కనీస ఓపెనింగ్స్ కూడా కష్టమేనా..?

Thandel Movie : ఇటీవల కాలంలో సినిమాలు వందకోట్లు రాబట్టడం సర్వ సాధారణమైపోయింది.. చిన్న సినిమాలో వచ్చిన సినిమాలు కూడా 100 కోట్లను క్రాస్ చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు కూడా 100 కోట్లనే రాబట్టడం విశేషం.. అందరి హీరోల విషయమేమో గాని అక్కినేని ఫ్యామిలీకి అలాంటి అదృష్టం ఇంతవరకు కలగలేదనే చెప్పాలి.. అక్కినేని హీరో నాకు ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకులు ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు.. అయితే ఈ మూవీ పైనే అక్కినేని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వంద కోట్ల సంగతి అటుంచితే, కనీస ఓపెనింగ్స్ వస్తాయా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. మరి సినిమా ఓపెనింగ్ ఇప్పటివరకు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం…


అక్కినేని నాగచైతన్య లైఫ్ బిజినెస్ చేసిన మూవీ తండేల్.. అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ‘తండేల్’ సినిమా ఫిబ్రవరి 7న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. శ్రీకాకుళం జనరల్ అనుకొని విధంగా పాకిస్తాన్ వాళ్ళు దొరికితే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది.? వాళ్లని ఎలాంటి చిత్రహింసలకు గురి చేస్తారు? అనే అంశాల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. దానికి తోడు ‘కార్తికేయ-2’ వంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత, చందు మొండేటి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో ‘తండేల్’పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండాలి. అందుకు తగ్గట్టే అనౌన్స్ మెంట్ సమయంలో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బాగానే ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఆ ఆసక్తిని, అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడంలో టీమ్ సక్సెస్ కాలేక పోతున్నారు..

ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్రం ట్రైలర్ అంతగా ఆకట్టుకోలేదనే టాక్ ఓ వైపు వర్గాల్లో వినిపిస్తుంది. నిజానికి ఒక పాన్ ఇండియా సినిమా వస్తుందంటే ఎంతో బజ్ క్రియేట్ అవ్వాలి. అలాగే ఆ హీరో కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టే స్థాయిలో అంచనాలు ఉండాలి.. కానీ నాగచైతన్య మూవీ విషయంలో మాత్రం అలాంటి అంచనాలు ఎక్కడ కనిపించలేదు.. పాన్ ఇండియా మూవీకి ఉన్నంత బజ్ఈ మూవీకి రాలేదని తెలుస్తుంది. ‘తండేల్’ మొదటి రోజు రూ.16 నుంచి రూ.20 కోట్ల దాకా గ్రాస్ అందుకోవాలి  . అప్పుడే పాన్ ఇండియా సినిమాకి తగ్గ కనీస ఓపెనింగ్స్ వచ్చాయి అని పించుకుంటుంది. అలాగే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ అందుకోవడానికి రూట్ క్లియర్ అవుతుంది. చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ రాకపోయినా, సినిమాకి అదిరిపోయే పాజిటివ్ టాక్ రాకపోయినా.. రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ కోసం మళ్ళీ ఎదురుచూడక తప్పదు.. చూడాలి మరి ఈ మూవీ ఎలాంటి ఓపెనింగ్స్ ని రాబోతుందో ఎన్ని కోట్లను కొల్లగొడుతుందో.. ఇప్పటివరకు అయితే నాగచైతన్య పర్ఫామెన్స్ తేలిపోయిందని టాక్ వినిపిస్తుంది. కేవలం సాయి పల్లవి ఒక్కటే ఈ సినిమాని నడిపిస్తుందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×