Madha Gaja Raja: అందాల ముద్దుగుమ్మ సదా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందమైన మనసులో అంత అలజడెందుకో అంటూ జయం సినిమాలో లంగావోణీలో కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది సదా. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ భామ తరువాత స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్, సిద్దార్థ్, బాలకృష్ణ, నితిన్, విక్రమ్.. ఇలా కుర్ర హీరోలతోనే కాకుండా సీనియర్ హీరోలతో కూడా జతకట్టి స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.
ఇక కొత్త హీరోయిన్లు రావడంతో ఈ ముద్దుగుమ్మ వెండితెర నుంచి బుల్లితెరకు షిఫ్ట్ అయ్యింది. డ్యాన్స్ షోలకు జడ్జిగా మారి అక్కడ కూడా అభిమానులను సంపాదించుకుంది. ఎప్పుడు హోమ్లీ పాత్రలు ఉండే సదా.. ఒక ఐటెంసాంగ్ చేసిందన్న విషయం తెలుసా.. ? ఆ సాంగ్ లో అమ్మడి అందాల ఆరబోత చూస్తే కుర్రకారు మతులు చెడడం ఖాయమని కూడా చెప్పొచ్చు. ఇంతకు సదా ఐటెంసాంగ్ చేసిన సినిమా ఏంటో తెలుసా.. మదగజరాజా.
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ హీరోగా నటించిన చిత్రం మదగజరాజా. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఇక ఎప్పుడో 2012 లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా తమిళ్ లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.50 కోట్లు కలెక్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. ఇక ఈ సినిమా జనవరి 31 న తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా మరీ అంత దారుణమైన రిజల్ట్ కాకపోయినా.. ఒక మోస్తరుగా ప్రేక్షకులను నవ్వించిందని చెప్పుకోవచ్చు.
RC16: సెట్ లో లిటిల్ గెస్ట్.. తండ్రితో క్లింకార.. జాతర సీన్ లీక్
ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కానుంది. అందుకే ఈ సినిమా నుంచి వీడియో సాంగ్స్ ను మేకర్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు అన్ని పాటలను రిలీజ్ చేసిన మేకర్స్ .. తాజాగా ఇందులోని ఐటెంసాంగ్ ను రిలీజ్ చేశారు. తొంబకు తుంబా అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హీరో, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
ఇక ఈ సాంగ్ లో అందాల భామ సదా .. విశాల్ తో కలిసి ఆడిపాడింది. ఇప్పటివరకు సదాను ఇంత గ్లామర్ డ్రెస్ లో చూసింది లేదు అని చెప్పొచ్చు. ఈ సాంగ్ కు వోకల్స్ కూడా విజయ్ ఆంటోనినే అందించడం విశేషం. ఇక ఈ సాంగ్ చూసిన అభిమానులు సదా ఐటెంసాంగ్ చూస్తుంటే.. సమంత, శ్రీలీల కూడా సరిపోయేలా లేరు.. అంత అందంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.