E-Paper
Advertisement

Horoscope  Today January 13th: ఆ రాశి వారికి ఈరోజు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి

Horoscope  Today January 13th: ఆ రాశి వారికి ఈరోజు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జనవరి 13న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. పాత రుణాలు తీర్చగలుగుతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు.

Advertisement

వృషభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి.

 మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు. మాతృ సంభంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. బంధువర్గంతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

Advertisement

కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈరోజు విలువైన గృహోపకరణాలు బహుమతులుగా పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి.

సింహ రాశి : ఈ రాశి వారు ఈరోజు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

కన్యా రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులా రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కలసిరావు.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానానికి విద్యా ఉద్యోగ అవకాశములు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరువుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

మకర రాశి : ఈ రాశి వారికి ఈరోజు దూరప్రయాణాలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.

కుంభ రాశి : ఈ రాశి వారు ఈరోజు కుటుంబసభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

మీన రాశి : ఈ రాశి వారు ఈరోజు ఆలయ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇతరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×