E-Paper
Advertisement

Horoscope  Today January 4th:  ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది

Horoscope  Today January 4th:  ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జనవరి 4న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు భాగస్వామ్య వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి. దూరప్రయాణాల వలన తగిన విశ్రాంతి ఉండదు. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో చిన్నపాటి వివాదాలు జరగొచ్చు.

Advertisement

వృషభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు నూతన వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.  ఆర్థిక వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు, వినోదాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయలేరు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మీ కష్టం ఫలించదు.

Advertisement

కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ముఖ్యమైన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

సింహ రాశి : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు పదోన్నతులు పెరుగుతాయి. నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు.

న్యా రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు భారంగా మారతాయి. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఏర్పడతాయి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులా రాశి : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. బంధువర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. కొన్ని పనులలో రెండు రకములైన ఆలోచనలతో నష్టాలు తప్పవు.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈరోజు  వృత్తి వ్యాపారాలలో అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

ధనస్సు రాశి : ఈ రాశి వారు ఈరోజు నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

మకర రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో ఆస్థి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఒక విషయంలో బంధువర్గం నుండి విమర్శలు తప్పవు. ఇతరుల పై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. కొన్ని వ్యవహారాలలో మీ అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. ప్రయాణాలు వాయిదా పడతాయి.

మీన రాశి : ఈ రాశి వారు ఈరోజు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే..  మంచి లాభాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో ఇంట్లో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉంటాయి.  దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీ సేవలకు గుర్తింపు పొందుతారు. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×