E-Paper
Advertisement

Horoscope  Today March 22nd: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – ఉద్యోగులకు శుభవార్తలు

Horoscope  Today March 22nd: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – ఉద్యోగులకు శుభవార్తలు

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మార్చి 22న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్థులకు ఆశించిన స్థాన చలనాలున్నవి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఇంటా బయట బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు.

వృషభం: బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. దూరప్రయాణాలలో మార్గ అవరోదాలు కలుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఇంటాబయట సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

మిధునం: చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

కర్కాటకం: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. సన్నిహితుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి.

సింహం: ఉద్యోగస్తులకు విధుల్లో సమస్యలు తప్పవు. కీలక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు అమలు చెయ్యడం మంచిది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. బంధు వర్గంతో విభేదాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

కన్య: నిరుద్యోగ ప్రయత్నాలు అంతగా ఫలించవు. దూర ప్రయాణ సూచనలున్నవి. స్థిరాస్తి ఒప్పందాలలో అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన మందగిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

తుల: ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి.

వృశ్చికం: వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. సమాజంలో ప్రముఖుల నుండి వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి వివాహ శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

ధనస్సు: కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు కొంత నిరుత్సాహ పరుస్తాయి. ముఖ్యమైన పనులు మందగిస్తాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాలి. వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి.

మకరం: ఇతరులపై వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు అదనపు పనిభారం పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

కుంభం: ఉద్యోగంలో సమస్యలు అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. ధనాదయ మార్గాలు పెరుగుతాయి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగవకాశాలు లభిస్తాయి.

మీనం: నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. వ్యాపారాలలో భాగస్థులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. నూతన ప్రయత్నాలు చెయ్యకపోవడం మంచిది. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×