OTT Movie : యాక్షన్-ప్యాక్డ్ సూపర్‌హీరో సినిమాలు చూడటానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు మూవీ లవర్స్. చిన్నపిల్లలు అయితే ఈ సినిమాలను వదలకుండా చూస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ సన్కాక అనే ఒక సామాన్య వ్యక్తి, సూపర్‌హీరోగా ఎదిగే ప్రయాణాన్ని చూపిస్తుంది. అతను తన భయాలను అధిగమించి, సమాజంలోని అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడతాడు. ఈ మూవీ ఇండోనేషియాలోని అవినీతి, పేదరికం, సామాజిక అసమానతల చుట్టూ తిరుగుతుంది. ఒక వ్యక్తి తన శక్తిని ఉపయోగించి సమాజాన్ని మార్చగలడనే సందేశాన్ని ఇస్తుంది. ఈ ఇండోనేషియన్ సినిమా బలమైన యాక్షన్ సన్నివేశాలు, మార్షల్ ఆర్ట్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) లో
ఈ ఇండోనేషియన్ యాక్షన్ మూవీ పేరు ‘గుండాల’ (Gundala). 1969లో హర్యా సురమినాటచే రచించిన కామిక్స్ పాత్ర ‘గుండాల’ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇండోనేషియాలో ఆగస్టు 29, 2019 న ఈ సూపర్ హీరో మూవీ విడుదలైంది. ఈ మూవీకి జోకో అన్వర్ దర్శకత్వం అందించారు. ఇది ఒక యాక్షన్-ప్యాక్డ్ సూపర్‌హీరో మూవీ. ఆర్యసత్య, తారా బస్రో, బ్రోంట్ పలారే, ఆరియో బయు, సెసెప్ ఆరిఫ్ రెహమాన్, రియో డెవాంటో ముజక్కి రాంధన్‌లతో ఇందులో నటించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
సన్కాక అనే వ్యక్తి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు. అతని తండ్రి ఒక ఫ్యాక్టరీ కార్మికుడిగా పని చేస్తుంటాడు. కార్మిక సమస్యల కోసం సమ్మెలో కూడా పాల్గొంటాడు. ఆ సమయంలో జరిగిన ఘర్షణలో అతని తండ్రిని హత్య చేస్తారు. దీనితో సన్కాక ఒంటరిగా మిగిలిపోతాడు. తర్వాత అతని తల్లి కూడా ఉద్యోగం కోసం వేరే ఊరికి వెళ్లి తిరిగి రాకపోవడంతో, సన్కాక జకార్తా వీధుల్లో నివసించడం ప్రారంభిస్తాడు. అక్కడ అతను అవాంగ్ అనే మరో వీధి బాలుడిని కలుస్తాడు, అతను సన్కాకకు స్వీయ మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తాడు. అయితే వారు కలిసి ప్రయాణించాలని ప్లాన్ చేసినప్పటికీ, అవాంగ్ ఒక రైలులో ఎక్కగలిగినా సన్కాక మాత్రం వెనుకబడిపోతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, పెద్దయ్యాక సన్కాక ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ, తన గురించి తాను మాత్రమే ఆలోచించుకుంటూ జీవితాన్ని గడుపుతుంటాడు.
కానీ జకార్తాలో అన్యాయం, అవినీతి, నేరాలు పెరిగిపోతాయి. ఈ పరిస్థితుల్లో పెంగ్కోర్ అనే క్రిమినల్, తన దుష్ట ఆలోచనలతో దేశంలోని పిల్లలను విషపూరితం చేసే ప్రణాళికను రూపొందిస్తాడు. అతను ఒక సీరమ్‌ను రైస్ సప్లైలో కలపాలని చూస్తాడు. దీనివల్ల పుట్టబోయే పిల్లలు మానసిక ఎదుగుదల లేకుండా పెరుగుతారు. ఈ సమయంలో సన్కాక జీవితం ఒక మలుపు తిరుగుతుంది. అతను ఒక రాత్రి పిడుగుపాటుకు గురై, అతీంద్రియ శక్తులను పొందుతాడు. అతను పిడుగుల నుండి శక్తిని గ్రహించి, దాన్ని ఉపయోగించగలడు. అలాగే అతని శరీరం చాలా బలంతో నిండిపోతుంది. ఈ శక్తులతో అతను గుండాలగా మారి, అన్యాయాన్ని ఎదిరించే సూపర్‌హీరోగా అవతరిస్తాడు. వులాన్ అనే మహిళ సన్కాకను ప్రోత్సహిస్తూ, అతనిలోని హీరోను బయటకు తీసుకొస్తుంది. చివరగా, సన్కాక తన శక్తులను ఉపయోగించి పెంగ్కోర్ అతని గ్యాంగ్‌ను ఎదుర్కొంటాడు. ఈ పోరాటంలో అతను అనేక అడ్డంకులను అధిగమించి, ప్రజలకు ఆశాకిరణంగా నిలుస్తాడు.