E-Paper
Advertisement

Horoscope  Today March 2nd: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు – వ్యాపారంలో అఖండ లాభాలు

Horoscope  Today March 2nd: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు – వ్యాపారంలో అఖండ లాభాలు

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మార్చి 2న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు అదుపుచేయడం కష్టంగా మారుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మాటలు వివాదాస్పదంగా మారుతాయి.

వృషభం: ధనాదాయ విషయాలలో లోటుపాట్లు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు దర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకోని సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు ట్రాన్స్‌ఫర్లు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది.

మిధునం: నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఆదరణ పెరుగుతుంది. శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగంలో హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం: చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. సంతాన ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాల వలన ధనవ్యయం కలుగుతుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంటాబయట ప్రతికూల వాతావరణం ఉంటుంది.

సింహం: ఉద్యోగాలలో అధికారులతో ఉన్న సమస్యలు రాజీ చేసుకుంటారు. ఇంట్లో  శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది.

కన్య: నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. ధన పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబమున అనిశ్చిత కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారములలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యలేరు.

తుల: వ్యాపారంలో ఆశించిన ఫలితాలుంటాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్య సిద్ది కలుగుతుంది. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో   అనుకున్న సమయానికి పనులు పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. మొండి బాకీలు వసూలు అవుతాయి.

వృశ్చికం: వ్యాపార పరంగా అభివృద్ధి సాధిస్తారు. దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది.  చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ధనస్సు: ఉద్యోగస్థులకు ఊహించని స్థాన చలనాలుంటాయి. ఇతరులతో నిదానంగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి.

మకరం: బంధుమిత్రులతో శుభకార్య విషయమై చర్చలు చేస్తారు. కుటుంబ సభ్యుల మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారపరంగా ఆశించిన ఫలితాలు ఉండవు. ఉద్యోగంలో సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

కుంభం: సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుండి అనుకూలత పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తికి సంభందిత వివాదాలలో విజయం సాధిస్తారు.

మీనం: కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో దీర్ఘకాలిక వివాదాలను రాజి చేసుకుంటారు. ధనాదాయం బాగుంటుంది. వ్యాపారాలను విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×