BigTV English

OTT Movie : ఈ అమ్మాయితో ఊరంతా అలా… ఒక్కడు మాత్రం ప్రాణంగా ప్రేమిస్తాడు

OTT Movie : ఈ అమ్మాయితో ఊరంతా అలా… ఒక్కడు మాత్రం ప్రాణంగా ప్రేమిస్తాడు

OTT Movie : ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎలా పుడుతుందో చెప్పలేము. నిజమైన ప్రేమను పొందడం చాలా కష్టం. స్వార్థం లేని ప్రేమను పొందగలగడం ఒక వరం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో హీరో ఒక వేశ్యను ప్రేమిస్తాడు. ఆమె ప్రేమ కోసం తపించి పోతాడు. వీళ్లిద్దరి మధ్య స్టొరీ చాలా చక్కగా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


హాట్ స్టార్ (Hotstar) లో

ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ పేరు ‘రిడీమింగ్ లవ్’ (Redeeming Love). 2022 లో వచ్చిన ఈ మూవీకి D.J దర్శకత్వం వహించారు. ఇందులో అబిగైల్ కోవెన్, టామ్ లూయిస్, లోగాన్ మార్షల్-గ్రీన్ నటించారు. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో ఈ మూవీ షూటింగ్ జరిగింది. ఇది జనవరి 21, 2022న యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా థియేటర్‌లలో విడుదల చేయబడింది. ఈ మూవీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ‘రిడీమింగ్ లవ్’ 2022 GMA డోవ్ అవార్డ్స్‌లో ఇన్‌స్పిరేషనల్ ఫిల్మ్, సిరీస్ ఆఫ్ ది ఇయర్ కోసం నామినేట్ చేయబడింది. ఈ మూవీ హాట్ స్టార్ (Hotstar) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

మైఖేల్ కి దైవభక్తి ఎక్కువగానే ఉంటుంది. ఇతడు తన జీవితంలోకి మంచి భార్యను ప్రసాదించమని కోరుకుంటూ ఉంటాడు. అయితే మైఖేల్ ఒక ఏంజెల్ అనే  అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి నిజానికి ఒక వేశ్యగా ఉంటుంది. ఈ విషయం తెలిసినా కూడా హీరో ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. ఆమెతో గడపాలంటే ఎక్కువ డబ్బులకు ఎవరైతే పాడుకుంటారో, వాళ్ళే ఆమెతో రాత్రి పండగ చేసుకుంటూ ఉంటారు. అలా హీరో ఏంజెల్ ని ఎక్కువ డబ్బులు కి పాడుకుంటాడు. ఆమెతో గడపడానికి వచ్చాడనుకున్న ఏంజెల్, తొందరగా పని కానివ్వమని అడుగుతుంది. అందుకు మైఖేల్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. చిన్నప్పటి నుంచి మోసాలు చూస్తూ విసిగిపోయిన ఏంజెల్, మొదట అతని మాటలను పట్టించుకోదు. దానికోసం అతడు చేసే ప్రయత్నాలను చూసి ఇంప్రెస్ అవుతుంది. ఈ వృత్తి చేయనని ఆమె తన యజమానికి చెప్తుంది. ఆమెను తీవ్రంగా గాయపరుస్తుంది యజమాని. ఇంతలో అక్కడికి వచ్చిన మైకేల్ యజమానికి డబ్బులు ఇచ్చి ఆమెను తీసుకొని వెళ్ళిపోతాడు.

ఆమెను చాలా మంచిగా చూసుకుంటాడు మైఖేల్. కొద్దిరోజుల్లోనే వీళ్లిద్దరూ బాగా క్లోజ్ అవుతారు. నిజానికి గతంలో ఒక బాగా డబ్బున్న వ్యక్తి ఏంజెల్ తల్లిని పెళ్లి చేసుకోకుండా ఉంచుకుంటాడు. ఆమెకు పుట్టిన బిడ్డ ఈ ఏంజెల్. ఒకరోజు వీళ్లిద్దరిని బయటకు తరిమేస్తాడు ఆ వ్యక్తి. కొద్ది రోజులకి తల్లి వేశ్యగా మారి చనిపోతుంది. చిన్న పిల్లగా ఉన్న ఏంజెల్ ని వేశ్య గృహానికి అమ్మేస్తారు కొంతమంది. ఆ చోటికి ఏంజెల్ తండ్రి ఒకసారి వచ్చి కూతురుతోనే గడుపుతాడు. చివరికి ఆమె ఎవరో తెలుసుకొని, చేసిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటాడు. ఇప్పుడు తన జీవితంలోకి ఒక మంచి వ్యక్తి వస్తాడు. అయితే నావల్ల మైకేల్ కి చెడ్డ పేరు వస్తుందని, ఒకసారి ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోతుంది. చివరికి వీళ్ళిద్దరూ కలుస్తారా? మళ్లీ అదే వృత్తిలో ఏంజెల్ కొనసాగుతుందా? అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడాల్సిందే.

Tags

Related News

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

Big Stories

×