Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం..మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది ? అనే విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.
మేషం:
మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో సకాలంలో విజయం సాధిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఊహించని లాభాలు పొందుతారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదిత్య హృదయ స్తోత్రం చదవడం మంచిది.
వృషభం:
ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఉద్యోగులు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా లాభాలు పొందుతారు. దైవారాధన మానవద్దు.
మిథునం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో ఇబ్బందులు ఎదురైనా చివరికి విజయం పొందుతారు. సమాజంలో గొప్ప వ్యక్తులను కలుస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.
కర్కాటకం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారంలో ఒత్తిడితో కూడిన విజయం పొందుతారు. ఉద్యోగుల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. ఉన్నతాధికారుల నుంచి అసంతృప్తి లోపిస్తుంది. కలహాలకు దూరంగా ఉండడం మంచిది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. నవగ్రాహశ్లోకాలు పఠిస్తే మంచిది.
సింహం:
సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆత్మశుద్ధితో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉంటుంది. పెద్దల సలహాలు ఫలిస్తాయి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యమైన విషయాల్లో అనుభవం ఉన్న వారితో సలహాలు తీసుకుంటారు. బంధుమిత్రుల సహకారం అవసరం. శ్రీలక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.
కన్య:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన విజయాలు పొందుతారు. ఉత్సాహంతో పనిచేస్తారు. కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు. ముఖ్యమైన పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు పెరగవచ్చు. తోటి వారితో ఆచితూచి వ్యవహరించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం క్షీణించవచ్చు. దుర్గాధ్యానం చేస్తే మేలు జరుగుతుంది.
తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో లాభాలు ఉంటాయి. ప్రారంభించిన ముఖ్యమైన పనుల్లో ఆటంకం కలగకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారులకు పెట్టిన పెట్టుబడులకు డబుల్ ఆదాయం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇష్టదేవతారాధన శుభకరం.
వృశ్చికం:
ఈ రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా సలువుగా పూర్తిచేస్తారు. అన్ని రంగాల వారికి అదృష్టం వరిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ సందర్భన శుభప్రదం.
ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో అవాంతరాలు ఎదురుకావొచ్చు.ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. తోటి వారి సహకారం లోపిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి.హనుమాన్ చాలీసా చదవడం ఉత్తమం.
మకరం:
మకర రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం మాములుగానే ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. శివారాధన శ్రేయస్కరం.
కుంభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి విజయం, కీర్తి వరిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో పెద్దల సలహాలు ఉంటాయి. ఉద్యోగులు తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబంతో ఆనందంగా ఉంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అవసరానికి ఆదాయం అందుతుంది. శ్రీ ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.
మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఆశించిన లాభాలు పొందుతారు. పెండింగ్ డబ్బులు చేతికి అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అవివాహితులకు వివాహం నిశ్చయం కావొవచ్చు. శని శ్లోకం చదివితే మంచిది.