BigTV English

Ashada Amavasya: ఆషాడ అమావాస్యనాడు ఈ రెండు మొక్కలు నాటారంటే మీ కుటుంబంలోని ఏడు తరాలు సంతోషంగా జీవిస్తాయి

Ashada Amavasya: ఆషాడ అమావాస్యనాడు ఈ రెండు మొక్కలు నాటారంటే మీ కుటుంబంలోని ఏడు తరాలు సంతోషంగా జీవిస్తాయి

ఆషాడ అమావాస్య ముఖ్యమైన రోజుల్లో ఒకటి. ఆరోజు ప్రజలంతా గంగానదిలో లేదా ఇతర పవిత్రమైన నదుల్లో స్నానం చేస్తారు. తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీనివల్ల వారికి మోక్షం లభిస్తుందని అంటారు.


అలాగే ఆషాడ అమావాస్యనాడు కొన్ని మొక్కలు నాటడం వల్ల మీ కుటుంబంలో పై ఉన్న గ్రహ దోషాలను తొలగించుకోవచ్చు. అంతేకాదు మీ పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెందేలా చేయొచ్చు. వారి ఆశీర్వాదాలతో మీ కుటుంబంలోని రాబోయే ఏడు తరాలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇంతకీ ఎలాంటి మొక్కలను నాటాలో తెలుసుకోండి.

వేప చెట్టు
ఆషాడ అమావాస్యనాడు చిన్న వేప మొక్కను కొని ఎక్కడైనా నాటేందుకు ప్రయత్నించండి. జ్యోతిష్య శాస్త్రంలో, వాస్తు శాస్త్రంలో కూడా వేప చెట్టు ఎంతో ప్రముఖమైనది. ఇంట్లో వేప చెట్టు ఉండడం కూడా మంచిదే. రాహువు, శని గ్రహం వల్ల కలిగే ఇబ్బందులు నుండి వేప చెట్టు కాపాడుతుందని చెబుతారు. దుష్ట గ్రహమైన రాహువు వల్ల ఉద్యోగం, డబ్బు పొందడంలో ఎన్నో అడ్డంకులు ఏర్పడతాయి. కాబట్టి ఆషాడ అమావాస్యనాడు వేప మొక్కను కొని ఇంట్లో ఏదో ఒక మూల నాటేందుకు ప్రయత్నించండి. లేదా కుండీలో నాటినా మంచిదే.


ఆషాడ అమావాస్యనాడు ఇంటికి దక్షిణం వైపు లేదా వాయువ్య మూలలో వేప చెట్టును నాటండి. అలాగే ఆషాడ అమావాస్యనాడు స్నానం చేసేటప్పుడు బకెట్ నీళ్లలో వేప ఆకులను వేసుకొని ఆ తర్వాత స్నానం చేయండి. లేదా వేప ఆకుల నుండి కాస్త రసాన్ని తీసి ఆ రసాన్ని బకెట్ నీళ్లలో కలిపి స్నానం చేసేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న కేతు గ్రహం శాంతి పొందుతుందని చెబుతారు. కేతు గ్రహం వల్ల జరిగే చెడు ప్రభావాలు మీపై పడకుండా ఉంటాయని కూడా అంటారు.

రావి చెట్టు
రావి చెట్టు మహావృక్షంగా ఎదిగిపోతుంది. దీన్ని ఎక్కడ నాటాలా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. మీరు చిన్న కుండీలో రావి మొక్కను నాటిన చాలు పితృ దోషం కారణంగా ఇంట్లో జరిగే అనర్ధాలకు రావి చెట్టును నాటడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. పితృ దోషం వల్ల ఇంటి ప్రజల గౌరవం చాలా వరకు తగ్గిపోతుంది. ధన నష్టం కలుగుతుంది. పిల్లలు కూడా సంతోషంగా జీవించలేరు. అలాగే జాతకంలో పితృ దోషం ఉన్నా కూడా ఆషాడ అమావాస్యనాడు ఆలయంలో రావి చెట్టును నాటితే మంచిది. ఇది పూర్వీకుల ఆశీస్సులను మీకు అందిస్తుంది. అలాగే మీపై ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. మీ ఇంట్లో సానుకూల ప్రభావం పడేలా చేస్తుంది.

మొక్క నాటిన వెంటనే ఇలా చేయండి
ఆషాడ అమావాస్యనాడు మొక్క నాటాలి అనుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా నాటకూడదు. కేవలం మొక్క నాటితే మాత్రమే సరిపోదు.. దాన్ని పూజించాలి కూడా. మీరు ఆ రోజున బ్రహ్మం ముహూర్త సమయంలో అలాగే సాయంత్రం సమయంలో వేప, రావి చెట్లను నాటి పూజించాలి.

దీని కోసం ముందుగానే ఆ మొక్కను గంగాజలంతో శుద్ధి చేయండి. తర్వాత మొక్క కాండం మీద కుంకుమను పెట్టండి. ఆ తర్వాత నాటండి. సాయంత్రం వేళ మల్లెపూల నూనె వేసి వేప మొక్క ముందు దీపం వెలిగించండి. ఇక రావి మొక్క ముందు ఆవ నూనెతో దీపం వెలిగించండి. ఇవన్నీ కూడా మీకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.

ఆషాడ అమావాస్య ఎప్పుడు?
పంచాంగం ప్రకారం ఆషాడ అమావాస్య జూన్ 24, 2025 సాయంత్రం 6:59 గంటలకు మొదలవుతుంది. మరుసటి రోజు అంటే జూన్ 25 సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఆషాడ అమావాస్యను జూన్ 25వ తేదీనే నిర్వహించుకుంటాము.

Related News

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఇలా దీపారాధన చేస్తే.. అష్టకష్టాలు తొలగిపోతాయ్

Dhantrayodashi 2025: ధన త్రయోదశి రోజు ఈ ఒక్కటి ఇంటికి తెచ్చుకుంటే.. సంపద వర్షం

Karthika Masam 2025: కార్తీక మాసంలో చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటి ?

Bhagavad Gita Shlok: కోపం గురించి భగవద్గీతలో ఏం చెప్పారు ? 5 ముఖ్యమైన శ్లోకాలు..

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఈ పరిహారాలు చేస్తే.. డబ్బే డబ్బు !

Atla Taddi 2025: ఆడపడుచుల పండుగ అట్లతద్ది.. రాకుమారి కథ తెలుసా?

Vastu Tips: ఇంట్లో డబ్బు, బంగారం ఈ దిశలో ఉంచితే.. సంపద రెట్టింపు !

Karthika Masam 2025: కార్తీక మాసంలో.. తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఇవే !

Big Stories

×