Illu Illalu Pillalu Today Episode june 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ డ్యాన్స్ క్లాసుల గురించి శ్రీవల్లి నర్మదా, ప్రేమను అడ్డంగా ఇరికిస్తుంది. నర్మద మాత్రం ఈరోజుల్లో కాలేజీలు జాబులు అంటూ అమ్మాయిలు ముందుకు వెళ్తున్నారు మామయ్య అని నర్మద అంటుంది. ఈ ప్రేమ ఇలా డాన్స్ క్లాసులకు వెళ్లి డాన్సులు చెప్పడానికి కారణం ఈ నర్మదనే. ప్రేమకి అంత ధైర్యం లేదు మొత్తం ఈ నర్మదనే చేసింది అంటూ రామరాజు సీరియస్ అవుతాడు.. ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక గొడవ మొదలవుతుంది. ఈ అమ్మాయి వల్లే ఇంట్లో ప్రతి ఒక్క గొడవలు అనర్ధాలు జరుగుతున్నాయి. మీ సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఆడవాళ్ళు ఎప్పుడు ఎదిగారు అంటూ చులకనగా మాట్లాడుతాడు రామరాజు. శ్రీవల్లి వాళ్ళిద్దరిని రామరాజు తిడుతుంటే సంతోషంగా నవ్వుకుంటూ ఉంటుంది.. నర్మద ఎంత చెప్పినా కూడా రామరాజు వినకపోవడంతో నర్మదా కన్నీళ్లు పెట్టుకుంటుంది.. వేదవతికి ఎంత చెప్పిన వినకపోవడంతో నర్మద కన్నీళ్లు పెట్టుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నర్మదా ప్రేమ ఇద్దరూ కలిసి శ్రీవల్లి దగ్గర కూర్చొని మా ఇద్దరి గురించి ఎవరు మామయ్యకి చెప్పారు అని ఆలోచిస్తూ ఉంటారు.. ఎవరో తెలియదు కానీ మావయ్యకి లేనిపోనివి చెప్పారు అని ప్రేమ అంటుంది… మా గురించి ఎవరో లేనిపోనివన్నీ మావయ్యకి చెప్తున్నారు ఇంతకీ నువ్వు మీ పుట్టింటికి వెళ్ళావు కదా అక్క నువ్వు అటు నుంచి వచ్చావంటే కదా అనేసి నర్మదాలు అడుగుతారు.
ఖచ్చితంగా శ్రీవల్లే ఊదేసి ఉంటుందని పసిగట్టేసిన ప్రేమ, నర్మదలు కూపీ లాగడానికి శ్రీవల్లి దగ్గరకు వెళ్తారు. నేను డాన్స్ క్లాస్‌కి వెళ్లిన విషయం నాకు నర్మద అక్కకి తప్ప మూడో కంటికి తెలియదు.. మరి ఈ విషయం మావయ్య గారికి ఎలా తెలిసి ఉంటుంది. మామయ్య గారికి ఎవరు చెప్పి ఉండొచ్చు అని గుచ్చి గుచ్చి అడుగుతుంది ప్రేమ. దాంతో శ్రీవల్లి.. అయ్యబాబోయ్.. వీళ్లకి నా మీద డౌట్ వచ్చేసింది అని అనుకుని.. ఏమో నాకేం తెలుసు.. నన్నెందుకు అడుగుతున్నారు? ఒకవేళ అత్తయ్య గారు చెప్పారేమో అని అంటుంది..
మేము డాన్స్ క్లాస్ కి వెళ్ళిన విషయం అత్తయ్య కూడా తెలీదు నీకు ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఉంటారు. నేను రామరాజు గారి కోడల్ని అని ఈ ఊరిలో ఎవరికీ తెలియదు. పైగా వెళ్లేటప్పుడు చూసుకుంటూనే వెళ్లాం. ఇదంతా చూస్తుంటే మేమిద్దరం బాగా తెలిసిన వాళ్లూ.. మేమంటే పడని వాళ్లూ చేసిన పనే అని అనిపిస్తుంది. మేమిద్దరం అంత బాగా తెలిసిన వ్యక్తి.. మా గురించి మామయ్య గారికి చెప్పాల్సిన అవసరం ఉన్న వ్యక్తి ఎవరో ఎంత ఆలోచించినా అంతుచిక్కడం లేదు అక్కా అని అంటారు ప్రేమ, నర్మదలు..
మొత్తానికి శ్రీవల్లినే అక్కడికి వెళ్లి ఊదేసిందని నర్మదా ప్రేమలు పసిగట్టేస్తారు.. నేను వచ్చింది లైబ్రరీ రోడ్ నుంచి.. నేను ఏమైనా బ్యాంక్ వీధిలో నుంచి వచ్చానా ఏంటీ.. ఈ ఇంటి దగ్గర మిమ్మల్ని చూడ్డానికి అని నోరు జారేస్తుంది శ్రీవల్లి. దాంతో ప్రేమ, నర్మదలు ఒకరి మొహం ఒకరు చూసుకుని.. ఇది మనల్ని చూసేసింది. ఇదే చెప్పేసింది అని ఫిక్స్ అయిపోతారు. నేను డాన్స్ క్లాస్ చెప్పడానికి వెళ్లింది బ్యాంక్ స్ట్రీట్ అని నీకు ఎలా తెలుసు అక్కా? అని అడుగుతుంది ప్రేమ. దాంతో శ్రీవల్లి పెద్దంతరం చిన్నతరం లేకుండా నన్ను ఇన్ని మాటలు అంటారని బాధపడుతుంది.. దొంగ ఏడుపు ఏడుస్తుందని ప్రేమ అరుస్తుంది.
Also Read : తప్పును అవని మీదకు తోసేసిన అక్షయ్.. రాజేంద్ర ప్రసాద్ పై పార్వతి సీరియస్..
నువ్వు ఎంత కుళ్లుబోతు గయ్యాళి గంపవో’ అని తిట్టిపారేస్తుంది ప్రేమ శ్రీవల్లి..బాబోయ్.. బాబోయ్.. నన్ను అంత మాట అంటావా? అంటూ ఏడుపు మొదలుపెడుతుంది. ఎహే ఫస్ట్ ఆపు నీ దొంగ ఏడుపూ.. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి మా విషయాల్లో వేలు పెట్టావ్ అంటే మర్యాదగా ఉండదు అంటూ వార్నింగ్ ఇస్తుంది
ప్రేమ అన్నమాట ఖచ్చితంగా చందుకి చెప్పాలని శ్రీవల్లి భోజనం తీసుకెళ్లి అంటుంది. అయితే చందు ప్రేమను వెనకేసుకోవడంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. అయితే శ్రీవల్లి మాట విన్న చందు నువ్వు ఖాళీగా ఉండడం వల్లే నీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేమో నువ్వు ఏంఎ ఇంగ్లీష్ చేసావు కదా నీ సర్టిఫికెట్ తీసుకురా నేను జాబ్ చేస్తానని చెప్తాడు.. ఆ మాట వినగానే శ్రీవల్లి ఒకింత షాక్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాలి…