BigTV English

Evil Eye: ఇతరుల చెడు దృష్టి మీపై పడకుండా ఉండాలంటే.. మీతో పాటు ఈ వస్తువులు ఉండాల్సిందే

Evil Eye: ఇతరుల చెడు దృష్టి మీపై పడకుండా ఉండాలంటే.. మీతో పాటు ఈ వస్తువులు ఉండాల్సిందే
దిష్టి తగలడం అని స్థానికంగా చెప్పుకుంటారు. దీన్నే చెడు కన్ను అని కూడా అంటారు. ఈ చెడు కన్ను పడడం వల్ల ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని చెప్పుకుంటారు. అందుకే చిన్న పిల్లలకు ప్రతిరోజూ దిష్టి తీస్తూ ఉంటారు. ఈ నమ్మకం భారతదేశానికి మాత్రమే పరిమితం అయిపోలేదు. ప్రపంచం అంతా కూడా దిష్టి అనే కాన్సెప్ట్ ఉంది. ఇది చెడు చేసే శక్తిని మన వైపు తీసుకొస్తుంది అని నమ్ముతారు. అందుకే మీకు దిష్టి తగలకుండా ఇతరుల చెడు చూపు మీ మీద పడకుండా ఉండాలంటే కొన్ని రకాల వస్తువులను మీతో పాటు ఉంచుకోవాలి. వీటన్నింటినీ మీ పాకెట్ లో పెట్టుకోవడం కష్టం అవ్వచ్చు. అందుకే వీటిలో ఏదో ఒకటి మీతో పాటు ఉంచుకోండి. అది దిష్టి నుండి మిమ్మల్ని కాపాడుతుంది.


ఆరాధించే దేవత
మీరు ఇష్టంగా ఆరాధించే దేవత లేదా దేవుడి ఫోటోను మీతో పాటు ఉంచుకోండి. అది మీ వాలెట్లో పెట్టుకున్న మీ పాకెట్ లో పెట్టుకున్నా మంచిదే. ఇది చెడు కన్ను నుండి మిమ్మల్ని రక్షిస్తుందని నమ్ముతారు. గణేశుడు, హనుమంతుడు, దుర్గాదేవి చిత్రాలను ఉంచుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. వారు మనకు శక్తివంతమైన రక్షకులుగా నిలుస్తారు. వారు మిమ్మల్ని చెడు చూపు నుండి కాపాడతారు. దీన్ని మీ వాలెట్లో హ్యాండ్ బ్యాగ్ లో లేదా ఆఫీస్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు.

నలుపు దారం
నల్ల దారాన్ని కట్టుకోవడం ద్వారా దిష్టి తగలకుండా జాగ్రత్త పడొచ్చని నమ్మకం తరతరాలుగా ఉంది. అందుకే చేతికి, కాలుకి నల్ల దారాన్ని కట్టుకుంటూ ఉంటారు. అలాగే ఇంటికి కూడా నల్లదారాన్ని కడతారు. వాహనాలకు కూడా కడుతూ ఉంటారు. ఇలా మీరు కట్టుకోవడం వల్ల ప్రతికూల శక్తులను ఆ నల్ల దారం గ్రహిస్తుందని నమ్ముతారు. అలాగే చెడు మంత్రాలు ఈ నల్ల దారం ముందు పని చేయవని చెబుతారు. కాబట్టి నలుపు తాడును లేదా నలుపు దారాన్ని మందంగా చుట్టుకొని మీ మణికట్టుకో లేదా కాలికి కట్టుకోండి అంతా మేలే జరుగుతుంది.


పంచముఖి హనుమంతుడు
పంచముఖాలు కలిగిన హనుమంతుడి చిత్రాలు మార్కెట్లో దొరుకుతాయి. ఇది ఇంట్లోని కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించడంలో శక్తివంతంగా పనిచేస్తుందని ఎంతోమంది నమ్ముతారు. పంచముఖ ఆంజనేయుడి ఫోటోను మీ వాకిట్లో పెట్టుకోండి లేదా పర్సుల్లో ఉంచుకోండి. లేదా లాకెట్ల రూపంలో చేయించుకున్న బ్రాస్లెట్లకు అతని రూపం ఉన్న పెండెంట్‌ను పెట్టుకున్నా మంచిదే. ఇవి ప్రతికూల శక్తుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు.

లవంగాలు
ప్రతి ఇంట్లోనూ లవంగాలు ఉంటాయి. ఇవి ప్రజలకు రక్షణ కల్పించడంలో ముందుంటాయి. మీరు ఒక లవంగాన్ని నోట్లో పెట్టుకుని నమలడం వల్ల మీపై దిష్టి, చెడు కన్ను పడదు. ముఖ్యంగా ఏదైనా పనిమీద బయటికి వెళ్తున్నప్పుడు ఆ లవంగాన్ని నోట్లో పెట్టుకుని నములుతూ వెళ్ళండి. మీకు అంతా మంచే జరుగుతుంది. అలాగే ఇంట్లో అప్పుడప్పుడు లవంగాలను కాల్చడం వల్ల కూడా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు బయటకు వెళ్లిపోతాయి. రెండు లవంగాలను మీ జేబులో లేదా పర్సులో ఉంచుకుంటే ఎవరి చూపు మీ మీద పడదు.

యాలకులు
యాలకులను కూడా లవంగాల మాదిరిగానే ఉపయోగించుకోవచ్చు. యాలకులు గాలిని కూడా శుభ్రపరుస్తాయి. మీ చుట్టూ రక్షణాత్మక ప్రకాశాన్ని సృష్టిస్తాయని  ప్రాచీన కాలం నుంచి నమ్ముతారు. మీ జేబులో పర్సులో రెండు మూడు యాలకులను వేసుకోండి. వాటి వాసన వీచే వరకు ఉంచండి. ఎప్పుడైతే వాటి వాసన పోతుందో అప్పుడు తీసి మళ్ళీ కొత్తవి పెట్టుకోండి. యాలకులు మంచి సువాసన వేసే వరకు అవి శక్తివంతంగా పనిచేస్తాయి. అలాగే మీ ఇంట్లో అప్పుడప్పుడు యాలకులను కాల్చి ఆ పొగను ఇంట్లో వ్యాపించేలా చూడండి. ఇంట్లో ఉన్న చెడు శక్తులు బయటికి పోతాయి.

Also Read: తులసి మొక్క ఎండిపోతుందా ? ఇది దేనికి సంకేతమో తెలుసుకోండి

కర్పూరం
కర్పూరానికి ఉన్న శక్తి  అంతా ఇంతా కాదు. వారానికి ఒకసారైనా ఇంట్లో కర్పూరాన్ని కాల్చి ఆ పొగను ఇల్లంతా వ్యాపించేలా చేయడం చాలా అవసరం. ఇది ప్రతికూల శక్తులను బయటకు పంపిస్తుంది. దీని నుంచి వచ్చే బలమైన సువాసన శాంతియుత వాతావరణాన్ని సృష్టిస్తుంది. రోజూ పూజ చేసేవారు రెండు మూడు కర్పూరాలను కాల్చి ఇంట్లోనే ఇంటి మొత్తానికి హారతినివ్వండి. ఇది ఇంట్లోని గాలిని శుద్ధి చేస్తుంది. ఇంట్లోనే కుటుంబ సభ్యుల మనస్సును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×