BigTV English

Athiradhi Maharadhi: అతిరథ మహారథులంటే ఎవరో తెలుసా..? వారికున్న శక్తి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు  

Athiradhi Maharadhi: అతిరథ మహారథులంటే ఎవరో తెలుసా..? వారికున్న శక్తి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు  

Athiradhi Maharadhi: అతిరథ మహారథులంటే ఎవరో తెలుసా..? వారికున్న శక్తిసామర్థ్యాలు ఏంటో తెలుసా..? ఒకేసారి వంద మందిని కొడితే వీరుడంటారు. మరి ఎంత మందిని కొడితే వాళ్లను అతిరథ మహారథులు అంటారో తెలుసా..? యుద్దంలో ఒంటిచేత్తో ఎంత మందిని ఓడిస్తే అతిరథ మహారథులు అవుతారో తెలుసా..? మన చరిత్రలో అతిరథ మహారథులు ఎంత మంది ఉన్నారో తెలుసా..? వారిని అతిరథ మహారథులుగా ఎలా గుర్తిస్తారో తెలుసా..? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ కథనంలో తెలుసుకుందాం.


పొలిటికల్‌ మీటింగ్‌ల్లోనూ.. సినిమా ఫంక్షన్స్‌ లోనూ వేదిక ఏదైనా మన యాంకర్లు మాత్రం అతిరథ మహారథులందరూ వచ్చారు అనే పదాలను వాడుతుంటారు. అయితే వాళ్ల పరిభాషలో వాళ్లు గొప్పవాళ్లందరూ వచ్చారని చెప్పడానికి ఆ పదాలు వాడుతుంటారు. ఇక మన సినిమాల్లో హీరో వంద మందిని ఒకేసారి కొడితే వీరుడు అంటారు. అదే హీరోను జనాలు నెత్తిక పెట్టుకుని అభిమానిస్తుంటారు. అయితే మన చరిత్రలో వందలు కాదు వేలు కాదు ఏకంగా లక్షల మందిని ఒకేసారి ఓడించగల యోధులున్నారు. ఒంటి చేత్తో శత్రువులను మట్టి కరిపించిన మహామహులు ఉన్నారు.  అటువంటి వారినే అతిరథ, మహారథులు అంటారు. అయితే ఇందులో కూడా వారి శక్తి సామర్థ్యాలను బట్టి ఐదు రకాలుగా విభజిస్తారు.

 


ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

 రథి: ఓకేసారి ఐదు వేల మందితో యుద్దం చేయగల వీరులను రథి అంటారు. వీరు ఏకకాలంలో 5వేల మందిని నిలువరించే శక్తి సామర్థ్యం కలిగి ఉంటారు. ఇలా ఐదు వేల మందితో యుద్దం చేసే వాళ్లలో దుర్యోదనుడి కొడుకు ఉత్తర కుమారుడు, దుర్యోదనుడి మేనమాన శకుని, శిశుపాలుడు, 96 మంది కౌరవులు, ద్రౌపది కొడుకులు. వీరంతా రథులు.

అతి రథి: అతిరథులు.. రథులకంటే 12 రెట్లు అధిక శక్తి సామర్థ్యం కలవారు. వీరు 60వేల మందితో ఏకకాలంలో యుద్దం చేయగల నేర్పరులు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా అతిరథులు 60 వేల మందిని యుద్దంలో నిలువరించే సామర్థ్యం కలిగి ఉంటారు. శ్రీరాముని కుమారులైన లవకుశులు, ద్రుపదుడు, విరాటరాజు, ఘటోత్కచుడు, దుర్యోదనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, ధర్మరాజు, సహదేవుడు అతిరథుల కోవలోకే వస్తారు.

 

ALSO READ: జన్మజన్మల్లో వెంటాడే కర్మలు అవేనట – మీరు ఏ కర్మలు చేశారో తెలుసా..?

 

మహా రథి: అతిరథుల కంటే 12 రెట్లు ఎక్కువ శక్తి సామర్థ్యాలను కలిగి ఉండే వారినే.. మహారథులు అంటారు.   మహారథులు ఒకేసారి 7 లక్షల 20 వేల మందితో  యుద్దం చేయగల వీరులు. కదన రంగంలో మహారథులు ఉన్నారంటే శత్రువులు భయంతో వణికిపోయేవారట. హిందువుల ఆరాధ్య దైవాలైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అభిమన్యుడు, వాలి, అంగదుడు, అశ్వత్థామ, భీముడు, కర్ణుడు, అర్జునుడు, భీష్ముడు, ద్రోణాచార్యులు, కుంభకర్ణుడు, రావణుడు, లక్ష్మణుడు, బలరాముడు, జరాసంధుడు.. లాంటి గొప్ప వారందరూ చరిత్రలో మహారథులుగా ప్రసిద్ది చెందారు.

అతి మహారథి: మహారథికి పన్నెండు రెట్లు బలమైన వారినే అతి మహారథు అంటారు. వీళ్లు ఒకేసారి 86 లక్షల 40వేల మందితో యుద్దం చేయగలరు.  ఇంద్రజిత్తు, పరశురాముడు, ఆంజనేయుడు, వీరభద్రుడు, కాల భైరవుడు అతి మహారథులుగా గుర్తింపు పొందారు. రామరావణ యుద్దంలో ఇద్దరూ అతి మహారథులు పాల్గొన్నారు.

మహా మహారథి: అతిరథ మహారథుల్లో మొదటి వారు మహా మహారథులు. వీళ్లు అతి మహారథి కన్నా 24 రెట్లు ఎక్కువ బలమైన యోధులు. వీరు ఒకేసారి 20 కోట్ల 73 లక్షల 60 వేల మందితో యుద్దం చేసే సామర్థ్యం కలిగి ఉంటారు. త్రిమూర్తులైన   విష్ణు, ఈశ్వర, బ్రహ్మ, దుర్గా దేవి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి మొదలైన దేవీ దేవతలు అందరూ మహా మహారథులుగా గుర్తింపు పొందారు.

 

ALSO READ : మీన రాశి జాతకులకు 2025లో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం

 

Related News

Bathukamma 2025: అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Big Stories

×