Horoscope Pisces 2025 : గ్రహాల సంచారం ప్రకారం రాశి ఫలాలను అంచనా వేస్తారు. మీన రాశి జాతకులకు ఈ సంవత్సరం 2025లో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సవరం మీన రాశి జాతకులకు ఆదాయం -5, వ్యయం-5గా ఉంది. అంటే ఎంత సంపాదిస్తారో అంతే ఖర్చు చేస్తారన్న మాట. ధన పరంగా మీన రాశి జాతకులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ఇక రాజ్యపూజ్యం-3, అవమానం -1 గా ఉంది. అంటే ముగ్గురు మీకు గౌరవం ఇస్తే.. ఒక్కరు మిమ్మల్ని అవమానిస్తారు. ఇక ఈ సంవత్సరం నెలల వారీగా ఈ రాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఎదురు కాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి : మీన రాశి జాతకులకు ఈ నెలలో అన్ని వృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. పండ్లు, పూలు, పాలు, పెరుగు, పాలకేంద్రములు, మహిళా సంఘాలకు అభివృద్ది ఏర్పడుతుంది. ఈ రాశి మహిళలు నిర్వహించే సంస్థలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయి.
ఫిబ్రవరి : మీన రాశి జాతకులకు ఈ నెలలో రియల్ ఎస్టేటు, బిల్డర్స్ రంగముల వారికి అధిక లాభాలు ఉంటాయి. పోలీసు శాఖలో ఉన్న వారికి కోరుకున్న స్థాన మార్పులు ఉంటాయి. శ్రమకు తగిన లాభం ఉంటుంది.
మార్చి: మీన రాశి జాతకులకు ఈ నెలలో ఆదాయం బాగుంటుంది. అయితే ఎదుటి వ్యక్తులతో మాట్లాడే సమయంలో జాగ్రత్త వహించాలి. పోలీసు, విద్యుత్ శాఖ ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే సూచనలున్నాయి. ధనలాభము, వ్యాపార, గుమస్తా, వ్రాత పనుల వారికి ఆదాయం బాగుంటుంది.
ఏప్రిల్ : మీన రాశి జాతకులకు ఈ నెలలో ప్రయాణంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కోంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం.
మే : మీన రాశి జాతకులకు ఈ నెలలో బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పుత్రుని వలన విశేష శుభం కలుగుతుంది. వ్యాపారంలో ఊహించని అభివృద్ది సాధిస్తారు.
జూన్ : మీన రాశి జాతకులకు ఈ నెలలో బంధు మిత్రుల కలయిక వలన సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చేయు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి చెందుతారు. సోదరుల వలన లాభము కలుగును.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్
జూలై : మీన రాశి జాతకులకు ఈ నెలలో ధైర్య సాహసములు ప్రదర్శించి నాయకత్వ లక్షణములను పెంపొందింపజేయును. తల్లికి సంతోషం కలిగిస్తారు. శుభకార్యములు చేయుట వలన ధనవ్యయము అవుతుంది. శుభవార్తలు వింటారు. సుఖ భోజనం చేస్తారు.
ఆగష్టు : మీన రాశి జాతకులకు ఈ నెలలో మీ సమస్యలు అన్నీ తీరును. ఉన్నత అధికారుల మన్ననలు పొందుతారు. శత్రువుల వల్ల తగు జాగ్రత్తలు అవసరం. రియల్ ఎస్టేట్ రంగం వారికి కాస్త ఊరట కలుగుతుంది.
సెప్టెంబర్ : మీన రాశి జాతకులకు ఈ నెలలో వ్యాపార పెట్టుబడులు అధికం అవుతాయి. పై అధికారుల వలన చింత కలిగే అవకాశం ఉంది. నటులు, గాయకులు, కళాకారులకు తగిన గుర్తింపు లభిస్తుంది. ధనలాభము, సన్మానములను పొందుతారు.
అక్టోబర్ : మీన రాశి జాతకులకు ఈ నెలలో రాజ సందర్శనము జరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి సూచనలున్నాయి. అలాగే అనారోగ్యం వలన డబ్బు ఖర్చు అవుతుంది. చేతివృత్తుల వారికి జీవితం ఆనందంగా ఉంటుంది.
నవంబర్ : మీన రాశి జాతకులకు ఈ నెలలో శారీరిక శ్రమ యోగా లాంటిటది అవసరమని గుర్తిస్తారు. తండ్రి తరపు బంధువులకు హాని తలపెట్టడం వలన ప్రయోజనం ఉండదు. ధైర్య సాహసములు ప్రదర్శించి నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తారు.
డిసెంబర్ : మీన రాశి జాతకులకు ఈ నెలలో ఇష్ట కార్యములు సిద్ధిస్తాయి. తప్పు చేయకున్న గొడవలు అయ్యే సూచనలున్నాయి. నెల చివరలో సంఘంలో కీర్తి పెరుగుతుంది
ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు – ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?