BigTV English

Lakshmi Devi Idol: మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉందా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

Lakshmi Devi Idol: మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉందా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

Goddess Lakshmi Devi Idols: ప్రతి ఇంటి పూజగదిలో లక్ష్మీదేవి విగ్రహం తప్పకుండా ఉంటుంది. ఇంట్లో సానుకూల శక్తిని పెంచేందుకు, ప్రతికూల శక్తిని తొలగించేందుకు లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకుంటారు. కొందరు దేవుళ్ల, దేవతల విగ్రహాలను సరైన దిశలో పెట్టుకోరు. దీని ద్వారా ప్రతికూల శక్తి రావడానికి అవకాశం ఉంటుంది.


ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహాలను పెట్టుకునే ముందు అసలు ఒక ఇంట్లో ఎన్ని విగ్రహాలు పెట్టుకోవాలి ?.. విగ్రహాన్ని ఏ దిశలో ఉంచాలి ? అనే విషయాల గురించి తప్పక తెలుసుకోవాలి. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏ దిశలో ఉంచుకుంటే మంచి కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో ఎన్ని విగ్రహాలు పెట్టుకోవచ్చు:
లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ ఉంచుకోకూడదు. అలా ఉంటే నెగెటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. సాధారణంగా చాలా ఇళ్లలో లక్ష్మీదేవి విగ్రహాన్ని వినాయకుడి వద్ద పెట్టుకుంటారు. కానీ వినాయకుడి దగ్గర మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు. విష్ణుమూర్తికి ఎడమవైపు లక్ష్మీదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చు.


Also Read: Nirjala Ekadashi 2024: చాలా కష్టమైన ఉపవాస వ్రతం.. కానీ పాటిస్తే ధనవంతులు అవడం ఖాయం..

ఏ దిశలో ఉంచాలి:
లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎప్పుడు ఇంటి పూజ గదిలోనే పెట్టుకోవాలి. అమ్మవారి విగ్రహాన్ని నేలపై ఉంచకూడదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇంట్లో పూజ గది లేకపోతే టేబుల్ ఏర్పాటు చేసి దాని మీద అమ్మవారి విగ్రహాన్నిపెట్టుకోవచ్చు. వాస్తు ప్రకారం ఇంటికి ఈశాన్య దిశలో లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఉంచడం వల్ల ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. వాయువ్య దిశలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇలాంటిది చేయకూడదు:
లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకునే ముందు తప్పకుండా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ కమలంపై కూర్చున్న లక్ష్మీదేవి విగ్రహాన్ని మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి. నిలబడి ఉన్న లక్ష్మీదేవి  విగ్రహాన్ని తీసుకోకూడదు. అలాగే పగిలిపోయిన విగ్రహాలను కూడా ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు.

Also Read: గాయత్రీ మంత్రాన్ని ఇలా జపిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి

లక్ష్మీదేవి చంచలమైనది అని చెబుతారు. లక్ష్మీ దేవి ఇంట్లో ఉండేందుకు కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చిపెట్టుకోవడం, వాటిని పూజించడం కూడా హిందూ సాంప్రదాయంలో ఉంటుంది. మొదటిది కమలం. లక్ష్మీదేవి కమలంలో నివసిస్తుందని చెబుతారు. అందుకే లక్ష్మీదేవి పూజలో తామర పూలను వాడతారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలో తామర పూలను ఉపయోగిస్తారు.

లక్ష్మీదేవి ఆవు వీపుపై నివసిస్తుందని చెబుతారు. హిందూ మతంలో గోమాతను ప్రత్యేకంగా పూజిస్తారు. గోవులకు ఆహారం పెట్టి వాటిని సేవించే వారికి లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. అంతే కాకుండా  లక్ష్మీదేవి ఏనుగు తలపై కూర్చుంటుందని అంటారు. గజలక్ష్మి కూడా లక్ష్మీ దేవి స్వరూపమే ఉదయాన్నే లేచి అరచేతులను చూసి నుదుటిపై పెట్టుకుంటే లక్ష్మీదేవి సంతోషిస్తుందని చెబుతారు.

Tags

Related News

Ganesh Chaturthi 2025: వినాయకుడిని ఇలా పూజిస్తే.. సంపద, శ్రేయస్సు !

Khairatabad Ganesh 2025: ఖైరతాబాద్ గణేశుడి లీలలు తెలుసుకుందాం రండి!

Tirumala Special: ఏరువాడ పంచెల రహస్యం ఇదే.. శ్రీవారి భక్తులు తప్పక తెలుసుకోండి!

TTD: తిరుమల భక్తులు అలర్ట్.. శ్రీవారి దర్శనానికి బ్రేక్

Gold ganesh idol: ఒకే అంగుళంలో అద్భుతం.. మెరిసే బంగారు వినాయకుడు.. మీరు చూశారా?

Hanuman darshan: భక్తుల మనసు దోచుకుంటున్న హనుమంతుడు.. లైఫ్ లో ఒక్కసారైనా చూసేయండి!

Big Stories

×