Good Signs: ఉదయం నిద్ర లేవగానే వాటిని చూస్తే అ రోజంతా శుభం జరుగుతుందట. ఎటువంటి నెగటివ్ ఎనర్జీ మీ దరికి చేరదట. ఇంతకీ అవేంటో తెలుసా..?అయితే ఈ కథనంలో తెలుసుకుందాం.
బ్రహ్మణుడిని చూడటం: ఎవరైతే నిద్ర లేవగానే వేదం చెప్పే ఉత్తముడైన బ్రహ్మాణుడిని చూస్తారో వారికి ఆ రోజంతా శుభం జరుగుతుందట. రోజు మొత్తం ఎలాంటి సమస్య లేకుండా హ్యాపీగా జీవితం సాగిపోతుందట. ఎటువంటి కష్టం వారి దరి చేరదట.
అదృష్టవంతుడు: ఉదయం నిద్ర లేవగానే అదృష్టవంతుడని చూడటం వల్ల కూడా మంచి జరుగుతుందట. సావాస దోషం అంటుకుంది అన్నట్టు.. ఉదయమే అదృష్టవంతుడిని చూస్తే ఆయనలోని కొంత అదృష్టం ఆ రోజు మీకు అంటుంకుంది అని పండితులు చెప్తున్నారు.
ఆవును చూడటం: సకల లోకాలను తనలో ఇముడ్చుకున్న గోమాతను ఉదయం నిద్ర లేవగానే చూస్తే కలిగే అదృష్టం అంతా ఇంతా కాదట. కొన్ని కోట్ల పుణ్యఫలం ఉంటేనే అలా చూడగలం అంటున్నారు పండితులు. ఇంకా మీరు ఉదయం నిద్రలేవగానే ఆవు మీ ఇంటి ముందుకు వచ్చి మీకు కనబడితే మీ అంత అదృష్ట వంతుడు ఎవ్వరూ ఉండరట.
అగ్నిహోత్రం చూడటం: ఎవరైతే ఉదయం నిద్ర లేవగానే అగ్నిహోత్రాన్ని చూస్తారో ఆలాంటి వారికి ఆ రోజంతా మంచే జరుగుతుందట. ఎలాంటి సమస్యలు కానీ కష్టాలు కానీ ఆరోజు వారిని బాధించవట. ఎంతో ప్రశాంతంగా ఆ రోజును పూర్తి చేస్తారట.
హోమం చూడటం: ఉదయం నిద్రలేవగానే హోమం లేదా యజ్ఞం లేదా యాగం లాంటివి జరుగుతుంటే చూసిన వాళ్ల జన్మధన్యం అయినట్టేనట. ఆ రోజంతా వారిని ఎటువంటి నెగెటివ్ ఎనర్జీ బాధించదట. రాత్రి మళ్లీ పుడుకునే వరకు వారికి ప్రశాంతమైన జీవితం లభిస్తుందట.
అద్దాన్ని చూడటం: ఎవరైతే పొద్దున్నే నిద్ర లేవగానే అద్దం చూస్తారో వారికి ఆరోజంతా శుభప్రదంగా ఉంటుందట. ఎటువంటి సమస్యలు వారిని బాధించవట. అద్దంలో తనను తాను చూసుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందట.
అరచేతులు చూసుకోవడం: నిద్ర లేవగానే ఎవరి అర చేతులు వాళ్లు చూసుకోవాలట. అలా చేస్తే కూడా ఆ రోజంతా శుభమే జరుగుతుందట. మన అర చేతుల్లో సమస్య దేవతలు ఉంటారట. అరచేతి చూసుకుంటే ముఫ్పై మూడు కోట్ల దేవీదేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలం దక్కుంతుందట.
తులసి మొక్కను చూడటం: ఎవరైతే ఉదయం నిద్రలేవగానే తులసి మొక్కను చూస్తారో వారి జన్మధన్యం అయినట్టేనట. పొద్దున్నే తులసిని చూడటమంటే ముల్లోకాలలో ఉన్న పవిత్ర తీర్థాలు అన్నింటినీ చూసిన పుణ్యం వస్తుందట. అందుకే పూర్వం పెద్దలు పెరడులో కానీ ఇంటి ఎదురుగాకానీ తులసి కోట కట్టుకునే వారు. ఉదయం లేవగానే తులసి మొక్కకు పూజలు చేసేవారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం – అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు.