BigTV English

YSRCP : విమానం నడిపిన కేతిరెడ్డి.. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..

YSRCP : విమానం నడిపిన కేతిరెడ్డి.. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..

YSRCP : ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చాపర్ నడిపారు. హైదరాబాద్ హైటెక్‌ సిటీ మీద చక్కర్లు కొట్టారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కల నిజమైంది.. అధికారికంగా పైలట్ అయ్యానని కేతిరెడ్డి కామెంట్ చేశారు. ఇది ప్రారంభం మాత్రమేనని.. రాబోయే రోజుల్లో ఇలాంటి సాహసాలు మరెన్నో ఉంటాయని చెప్పారు.


తెలుగు తమ్ముళ్లు టీజింగ్

కేతిరెడ్డి రిలీజ్ చేసిన వీడియోలో ఆయనే స్వయంగా ఓ ప్రైవేట్ చాపర్ నడుపుతున్నారు. విమానం నుంచి చూస్తే.. అప్పట్లో చంద్రబాబునాయుడు కట్టించిన సైబర్ టవర్స్ బిల్డింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. హైటెక్ సిటీలోని అనేక ఐటీ కంపెనీల భవనాల మీదుగా ఫ్లైయింగ్ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు కేతిరెడ్డి. హైదరాబాద్‌లో మా బాబు గారు చేసిన అభివృద్ధిని కళ్లారా చూట్టానికి ఇలా విమానాం నడిపావా బ్రో అంటూ సోషల్ మీడియాలో కేతిరెడ్డి వీడియోను ట్రోల్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. మీ జగన్‌కు, మా చంద్రబాబుకు ఎంత తేడా ఉందో ఇప్పటికైనా తెలుసుకున్నావా? అంటూ టీజ్ చేస్తున్నారు.


కేతిరెడ్డి ఫుల్ ఖాళీ?

అధికారికంగా పైలట్ అయ్యానని కేతిరెడ్డి చెప్పడం ఆసక్తికరం. అంటే, ధర్మవరం ఎమ్మెల్యేగా ఓడిపోయాక.. కేతిరెడ్డి బాగా ఖాళీగా ఉంటున్నారు. అప్పట్లో గడ్డం పెంచి.. జగనన్నా.. మారాలన్నా.. అంటూ ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. చేతిలో పవర్ లేదు. పెద్దగా పని కూడా లేనట్టుంది. అందుకే, ఖాళీగా కూర్చోవడం ఎందుకనుకుని.. ఈ గ్యాప్‌లో పైలట్ ట్రైనింగ్ తీసుకున్నట్టున్నారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. ఇప్పుడు ఇలా చాపర్ నడిపి.. అఫీషియల్ లైసెన్స్ పొందారని అంటున్నారు.

సాహసం చేయరా డింభకా!!

అయితే, ఇది ప్రారంభం మాత్రమేనని.. ముందుముందు ఇలాంటి సాహసాలు మరెన్నో ఉంటాయని చెప్పడం ఇంట్రెస్టింగ్ పాయింట్. సాహసాలు అంటే.. విమానాలు నడపడం, కారు రేసులు, బంగీ జంప్ లాంటివి చేస్తారా? లేదంటే, పొలిటికల్‌గా ఏదైనా సాహసం చేస్తారా? అంటూ సోషల్ మీడియా ఆరా తీస్తోంది. ఇప్పటికే ఇటీవల జగనన్నకు పలు సలహాలు, సూచనలు ఇస్తూ ఆయన వదిలిన వీడియో బాణం.. అధినేతకు గుండెల్లో గట్టిగానే గుచ్చుకుందని అంటున్నారు. ఓడిపోయాక ఆయన వైసీపీకి, ధర్మవరంకు దాదాపు దూరంగానే ఉంటూ వస్తున్నారు. మరి, పార్టీ మారే అవకాశం ఏదైనా ఉందా కేతిరెడ్డి? రాబోవో రోజుల్లో చేసే సాహసం అదేనా?

Also Read : కొడాలి నానికి సీరియస్!.. ముంబై తరలింపు!

కేతిరెడ్డి పోస్ట్ చేసిన వీడియోపై అప్పుడే విమర్శలు మొదలైపోయాయి. ప్రతిపక్షంలో ఉన్నా.. యాక్టివ్‌గా పని చేయాల్సింది పోయి.. పార్టీ కేడర్‌కు ధైర్యంగా ఉండాల్సింది పోయి.. ఎమ్మెల్యే పదవి పోతే హైదరాబాద్‌కు పారిపోవడం ఏంటని.. ఇలా చాపర్‌లు నడుపుతూ టైంపాస్ చేయడం ఏంటని తప్పుపడుతున్నారు పార్టీ శ్రేణులు. పవర్‌లో ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ నియోజకవర్గం మొత్తం కలియదిరిగిన నాయకుడు.. ఆ పవర్ పోగానే పత్తా లేకుండా పోతారా? అని మండిపడుతున్నారు.

యూకే టు ధర్మవరం, వయా హైదరాబాద్

ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండేవారు. వీధుల్లో పర్యటిస్తూ.. ప్రజలతో మాట్లాడుతూ.. ఆ వీడియోలను పోస్ట్ చేస్తూ.. తెగ వైరల్ అయ్యేవారు. కూటమి ప్రభంజనంలో మిగతా వారితో పాటూ కేతిరెడ్డి కూడా కొట్టుకుపోయారు. అందుకే, బాగా ఫీల్ అయినట్టున్నారు. రాజకీయాలకు కాస్త రెస్ట్ ఇచ్చి.. పైలట్ ట్రైనింగ్ తీసుకున్నట్టున్నారు. 46 ఏళ్ల కేతిరెడ్డి.. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివారు. యూకేలో పీజీ చేశారు. చదువు కంప్లీట్ అయ్యాక.. హైదరాబాద్ వచ్చి రిలయన్స్ కంపెనీలో నెట్‌వర్క్ ఇంజినీర్‌గా కొన్నాళ్లు పని చేశారు. ఆ తర్వాత వైసీపీతో పాలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అదే వైసీపీకి కాస్త దూరం దూరంగా ఉంటున్నారు.

Tags

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×