Sitara: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ కు చిన్నప్పటి నుంచే ఫాలోయింగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ స్టార్ ఇమేజ్ ను కాకుండా సొంతంగా తమకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. అలాంటి స్టార్ కిడ్స్ లలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార కూడా ఉంది. సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసి మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇక ఇటీవల ప్రముఖ జ్యువెలర్స్ పి ఎం జె కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తాజాగా మరో కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ లో సందడి చేసింది. ఆ కార్యకమానికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నేడు పంజాగుట్టలో PMJ జ్యువెలర్స్ ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. మహేష్ బాబు కూతురు సితారా చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. 60 సంవత్సరాల క్రితం, 1964లో ప్రారంభం అయిన ఈ ప్రయాణం నేటికి ప్రజల మన్ననలతో విజయవంతగా దూసుకెళ్తుంది. గత 6 దశాబ్దాలుగా అత్యంత విశ్వసనీయ ఆభరణ వ్యాపార సంస్థగా ప్రజల ఆదరాభిమానాలను పొందిన సంస్థగా కొనసాగుతుంది..
కేవలం ఆభరణాలు మాత్రమే ప్రజల నమ్మకం ఉంది.. ఈ జ్యుయలర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సితార PMJ ఆభరణాలను ప్రారంభించడం సంతోషంగా ఉందని యాజమాన్యం తెలిపింది. 1964 నుంచి మేము అత్యంత ఆదరణీయ స్వర్ణకారులుగా ఉంటూ వినియోగదారుల సంతోషంలో భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉంది అని అన్నారు. ఈ రోజు 40వ స్టోర్‌ను పంజాగుట్టాలో ప్రారంభిస్తున్నామని వారు అంటున్నారు. ఎలాంటి ఈవెంట్ కు అయిన సరిపోయేవిస్తృత శ్రేణి ఆభరణాలను ఈ షాప్ లో అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు యాజమాన్యం.
సరికొత్త డిజైన్‌లతో మీ అభిరుచికి తగ్గట్టుగా ఇక్కడ అన్ని ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి. 40 స్టోర్‌లలోనూ సొంత డిజైన్ లు, తయారీ యూనిట్ కలిగిన ఏకైక ప్రాంఛైస్ PMJ సంస్థ అని చెప్పారు. సహజ వజ్రాలతో పొందుబారిచిన ఆభరణాలు ప్రత్యేకం అని యాజమాన్యం చెప్తున్నారు. ఇక పంజాగుట్టలో ఈ 40వ అతిపెద్ద PMJ స్టోర్, 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, విశాలమైన పార్కింగ్ స్థలంతో నిర్మించామని, మా కస్టమర్‌లను కుటుంబంగా భావిస్తాము అని, అయితే ఇక్కడ ప్రతి ఒక్కరి మనసుకు నచ్చే డిజైన్ లలో ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా పంజాగుట్ట బ్రాంచ్ కు విచ్చేసి మంచి ఎక్స్పీరియన్స్ పొందాలని ఆశిస్తున్నట్లు యాజమాన్యం ఆకాక్షిస్తుంది..
ఇక సితార విషయానికొస్తే.. ఒకవైపు తన స్టడీస్ ని కొనసాగిస్తూనే మరోవైపు మోడలింగ్ కూడా చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల తన తండ్రితో కలిసి ట్రెండ్స్ యాడ్ చేసింది.. ఆ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకుధీరుడు రాజమౌళి కాంబినేషన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో జక్కన్న ఉన్నారు