కాశీని వారణాసి, బనారస్ అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని పురాతన నగరంలో నగరాలలో ఇది కూడా ఒక్కటి. ఇక్కడ గంగమ్మ ప్రతి ఒక్కరికి స్వర్గ ద్వారాన్ని తెరుస్తుందని నమ్ముతారు. అందుకే ఇదే ప్రాంతాల్లో మోక్షాన్ని పొందాలని కోరుకుంటారు. ఈ పవిత్ర భూమి గురించి ‘కాశ్యాన్లు మరణాన్ ముక్తి’ అని చెప్పుకుంటారు. అంటే కాశీలో మరణించడం అంటే మోక్షం లభించడమేనని అర్థం. భారతదేశం అంతటా ఉన్న హిందువులు వారణాసిలోనే మరణించాలని కోరుకుంటారు.
పవిత్ర భూమిలో తమ చివరి శ్వాసను వదలాలని కోరుకునే వారంతా… తమ చివరి రోజుల్లో వారణాసి వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘట్ లోనే వారిని దహనం చేయాలని కూడా కోరుకుంటారు. ఇక్కడ మరణిస్తే శివుడు స్వయంగా తారకమంత్రాన్ని చనిపోయిన వారి చెవిలో చెబుతాడని, జనన మరణ చక్రం నుండి మోక్షం లభిస్తుందని అంటారు.
పదిహేను రోజులు వసతి
అందుకే ఈ పవిత్ర నగరంలో మరణించాలని, చివరి నిమిషంలో వచ్చే వారికి ఒక కాశీలోనే ఒక ఇల్లు ఆశ్రయం కల్పిస్తుంది. ఏ ప్రజలైతే మరణానికి దగ్గరగా ఉంటారో వారు ముక్తిభవన్ అని పిలిచే ఇంట్లో వసతిని పొందుతారు. కేవలం 15 రోజులు మాత్రమే ఇక్కడ వసతి అందిస్తారు. అంటే చాలా తక్కువ రోజులు మాత్రమే జీవించే వారికి ఇక్కడ వసతి కల్పిస్తారు. చివరి రోజుల్లో కాశీలో గడిపేందుకు ఈ అవకాశాన్ని ఇస్తారు. దహన సంస్కారాలు ఆ ఇంట్లో ఉండేందుకు డబ్బును చెల్లించవచ్చు లేదా చెల్లించక పోయినా పర్వాలేదు.
ముక్తి భవన్ అనేది కాశీలో ఉన్న 12 గదుల గెస్ట్ హౌస్. ఎవరైతే తాను చివర రోజుల్లో ఉన్నామని నమ్ముతారో… వారు ఇక్కడికి వస్తారు. వృధాప్యంలో ఉన్న వారిని తమ బంధువులు ప్రత్యేకంగా తీసుకొచ్చి ఈ ముక్తి భవన్లో ఉంచుతారు. దశాబ్దాలుగా వేలాది మంది ఇక్కడికి వచ్చి ఆశ్రయం పొందారు. ఇక్కడే మరణించి మోక్షమార్గాలను పొందాలని ఆశిస్తారు.
చాలామంది వృద్ధులు, తమ కుటుంబ సభ్యులతో ముక్తిభవన్ కు వచ్చి ఇక్కడే తమ చివరి రోజుల్లో గడుపుతూ ఉంటారు. 14 రోజుల వరకు వారు మరణిస్తారో లేదో చూస్తారు. 14 రోజుల తర్వాత కూడా వారు ఆరోగ్యంగా ఉంటే ముక్తిభవన్ వారు తిరిగి వారిని ఇంటికి పంపిస్తారు.
కావీ ఎంతోమందికి ముక్తిని ప్రసాదిస్తుందని అంటారు. అందుకే ముక్తి భవన్లో చేరేందుకు వృద్ధులు ఇక్కడ క్యూలో నిలిచి ఉంటారు. ఆ రద్దీని తట్టుకోవడం చాలా కష్టం. కానీ ముక్తి భవన్ లో ఉండడానికి మరణం అంచున ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారు. మిగతా వారిని వెనక్కి పంపిస్తారు. ఈ గెస్ట్ హౌస్ లోనే మరణించిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికి అంత్యక్రియలు హిందూ ఆచారాల ప్రకారం మణికర్ణిక ఘాట్ లేదా హరిచంద్ర ఘాట్ లో నిర్వహిస్తారు.
Also Read: చాణక్యుడు చెప్పినట్లు ఈ పనులు చేస్తే.. డబ్బులకు కొరతే ఉండదు