BigTV English

Telangana High Court: మేడిగడ్డ ఘటన.. కేసీఆర్ పిటిషన్‌పై హైకోర్టు కీలక నిర్ణయం..

Telangana High Court: మేడిగడ్డ ఘటన.. కేసీఆర్ పిటిషన్‌పై హైకోర్టు కీలక నిర్ణయం..

Telangana High Court: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో జిల్లా కోర్టులో కేసులో నమోదైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో భూపాలపల్లి జిల్లా కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషన్ పై నేడు విచారణ జరిపిన హైకోర్టు కీలక నిర్ణయం వెల్లడిస్తూ తీర్పును ఇచ్చింది. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది.


ALSO READ: RRB Recruitment: గుడ్ న్యూస్.. రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. మరోసారి దరఖాస్తు గడువు పొడిగింపు..

అయితే, మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో రాజలింగమూర్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆయన జిల్లా కోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన భూపాలపల్లి జిల్లా కోర్టు కేసీఆర్, హరీష్ రావుకు నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.


ఈ నోటీసులపైనే కేసీఆర్, హరీష్ రావు ఇద్దరూ హైకోర్టుకు వెళ్లారు. జిల్లా కోర్టు తన పరిధికి సంబంధం లేని విషయాలపై తమకు నోటీసులు జారీ చేసిందని వారు పిటిషన్ లో తెలిపారు. కాగా, భూపాలపల్లి జిల్లా కోర్టులో పిటిషన్ వేసిన ఫిర్యాదు దారుడు రాజలింగమూర్తి మొన్న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఫిర్యాదు దారుడు మృతిచెందితే.. పిటిషన్ కు విచారణ అర్హత ఉండదని హైకోర్టు పేర్కొంది. ఫిర్యాదు దారుడు చనిపోయినా పిటిషన్ ను విచారించవచ్చు అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు.

ALSO READ: DCIL Recruitment: డిగ్రీ అర్హతతో సొంత రాష్ట్రంలో ఉద్యోగం భయ్యా.. మిస్ అవ్వకండి.. రేపే లాస్ట్ డేట్

ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు సంబంధించిన కొన్ని తీర్పులను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కోర్టు తన పరిధి లేకుండా ఉత్తర్వులు జారీ చేసిందని.. కేసీఆర్, హరీష్ రావు తరఫు న్యాయవాది వాదనులు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న ఉన్నత హైకోర్టు తీర్పు రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Related News

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Big Stories

×