ఇంట్లోని గదుల్లో పడకగది ప్రధానమైనది. ఆకలి పరిశుభ్రంగా అందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. భార్యాభర్తలు వారిద్దరి ఆనందకరమైన క్షణాలు ఆ గదుల్లోనే ఉంటాయి. అందుకే చక్కటి పెయింటింగులు, కళ్ళకు ఇంపైన కర్టైన్లు పడకగదిలో దర్శనం ఇస్తాయి. ఆ గదిలోకి వెళ్ళగానే ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటారు. భార్యాభర్తలు అయితే కేవలం పెయింటింగ్స్ మాత్రమే కాదు నెమలి పింఛాలను కూడా పడకగదిలో ఉంచడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
వాస్తు రీత్యా కొన్ని వస్తువులను బెడ్ రూమ్ లో ఉంచితే భార్యాభర్తల బంధం మరింతగా బలపడుతుంది. వాటిలో ఒకటి నెమలి పించం మీ పడకగదిలోని గోడకి నెమలి పించం పెట్టడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. నెమలి పించం మీరు నిద్ర లేవగానే కనిపించేలా పెట్టుకోండి. ఉదయం లేవగానే నెమలిపించాన్ని చూడడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
నెమలి పించాన్ని పడకగదిలో ఉంచడం వల్ల రాహు గ్రహదోషాల నుంచి నివారణ కలుగుతుంది అని జ్యోతిష్య నిపుణులు చెబుతూ ఉంటారు. నెమలిపించాలే కాదు నెమలి పించం డ్రాయింగ్లు, పెయింటింగులను కూడా బెడ్ రూమ్ లో పెట్టుకున్న ఫలితాలు మంచిగా ఉంటాయి .
వాస్తు ప్రకారం పడకగదులకు లేత రంగులనే వేయాలి. ముదురు రంగులు వేయకూడదు. లేత గులాబీ లేదా లేత నీలం, లేత బూడిద రంగులు లేత క్రీమ్ కలర్ రంగులు గోడలకు వేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు మీరు ఆనందంగా జీవిస్తారు. ఇక పడకగది ఎప్పుడు నిశ్శబ్ద వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే దంపతుల మధ్య ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
శ్రీకృష్ణుడికి నెమలి పింఛమంటే ఎంతో ఇష్టం. ఆయన ఎప్పుడూ తలపైనే నెమలి పింఛాన్ని ధరించి ఉంటాడు. అందుకే నెమలి పింఛానికి ప్రత్యేకమైన స్థానం, గుర్తింపు ఉంది. మీరు పడక గదిలోనే కాదు ఇంట్లో లివింగ్ రూమ్ లో కూడా నెమలి పించాలను ఉంచుకోవడం వల్ల అంతా శుభకరంగా ఉంటుంది. మీ ఇంట్లో ఆనందం, సంపద, మనశాంతి కలుగుతుంది. నెమలి పింఛాలను లివింగ్ రూమ్ లో ఉంచాలనుకుంటే ఉత్తరం వైపు లేదా తూర్పు వైపు దిశలో ఉన్న మూలల్లో ఉంచండి. ముఖ్యంగా బయట నుంచి వచ్చే వ్యక్తులు చూసేలా దీన్ని పెట్టండి.
ఇంట్లో పూజ మందిరంలో కూడా నెమలి పింఛం ఉంచడం ఎంతో మంచిది. అప్పుడప్పుడు భగవంతుడికి నెమలి పింఛాలను గాలి విసరడం వల్ల ఆ దేవుని సేవ మీరు చేసుకున్న వారు అవుతారు. మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. మీ ఇంట్లోగానీ వ్యాపార స్థలాల్లో గాని ప్రధాన ముఖద్వారం వద్ద నెమలి పించాలు ఉంచడం కూడా ఎంతో మంచిది.
Also Read: ఈ నక్షత్ర దోషాలు ఉన్న పిల్లలు ఇంట్లో పుడితే – వారికి గండాలు తప్పవట
మీది కలహాల కాపురం అయితే మీ పడక గదిలో కచ్చితంగా నెమలి పింఛాలను పెట్టి చూడండి. కొన్ని రోజుల్లోనే మార్పు రావచ్చు. ఇంట్లో వాస్తు సమస్యలు ఉన్నా కూడా ఆ ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల మీకు సుఖశాంతులు కలిగే అవకాశం ఉంది.