BigTV English

Prakasam Crime: అన్నా నువ్వే దిక్కని వస్తే.. పక్కా ప్లానేసి మరీ చంపేశాడు

Prakasam Crime: అన్నా నువ్వే దిక్కని వస్తే.. పక్కా ప్లానేసి మరీ చంపేశాడు

Prakasam Crime: పిల్లలు పుట్టలేదని భర్త విడాకులు ఇచ్చాడు. అన్నయ్య ఉన్నాడని అండగా ఉంటాడని అక్కున చేరింది. చివరికి ఆ అన్నయ్యే కాల యముడయ్యాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయి సోదరి అనే అనుబంధాన్ని మరచిన అన్న, ఏకంగా అప్పుల నుండి బయట పడేందుకు చెల్లి పేరున ఇన్సూరెన్స్ చేశాడు. ఆ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చెల్లినే హత్య చేశాడు ఆ క్రూరుడు. అంతేకాదు.. చెల్లిని హత్య చేసిన విషయం తెలియకుండా, సినిమా ట్రిక్ ఉపయోగించాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.. కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పొదిలిలో జరిగింది.


పొదిలి సీఐ టీ.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. కనిగిరి మండలం పునుగోడుకు చెందిన మాలపాటి సంధ్య, అశోక్ కుమార్ లు అన్నా చెల్లెలు. సంధ్య కు వివాహమైంది. అయితే గర్భ సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. పిల్లలు పుట్టరన్న విషయం తెలిసిన భర్త ఆమెకు విడాకులిచ్చారు. దీనితో సంధ్య మళ్లీ పుట్టింటికి చేరింది. అశోక్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తూ జీవనం సాగించేవాడు. ఆ వ్యాపారంలో నష్టాలు రాగా అప్పులను కూరుకుపోయాడు. ఎలాగైనా అప్పుల నుండి బయటపడాలని ఆలోచించిన అశోక్ కుమార్ కు ఓ ఆలోచన తట్టింది.

తన చెల్లెలు పేరుమీద వేరువేరు కంపెనీలలో సుమారు కోటి రూపాయలు వరకు ఇన్సూరెన్స్ చేయించాడు. ఇక భీమా పొందే అవకాశం ఉందని తెలుసుకున్న అశోక్ కుమార్ గత ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన తన చెల్లెలు సంధ్యను తీసుకొని కారులో ఒంగోలుకు వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో ఆమెకు నిద్ర మాత్రలు ఇచ్చి స్పృహ లేకుండా చేశాడు. ఆ తర్వాత పొదిలి పట్టణంలోని హెచ్.పీ పెట్రోల్ బంకు వద్దగల నిర్మానుష్య ప్రదేశానికి తన చెల్లెల్ని తీసుకువెళ్లాడు. అక్కడ గుండెల పై కూర్చుని దిండుతో గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేయడంతో సంధ్య మృతి చెందింది.


అలా గొంతు నులిమి చంపిన అనంతరం అసలు విషయం బయటకు రాకుండా, కారు ప్రమాదం జరిగినట్లు చిత్రీకరించాడు. అయితే పోస్టుమార్టంకు సంధ్య మృతదేహాన్ని తరలించిన అనంతరం పోస్టుమార్టం చేసిన వ్యక్తికి రూ. 3,50,000 ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ మేరకు రూ. 3 లక్షల నగదును సైతం చెల్లించాడు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read: AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.15 వేలు అందించేందుకు నిర్ణయం

జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు సాగించి, అసలు నిజాన్ని తెలుసుకున్నారు. నిందితుడు నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. అలాగే నేరానికి సహకరించిన మరో ఇద్దరిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. తన చెల్లెలు పేరుమీద చేసిన కోటి రూపాయల ఇన్సూరెన్స్ కోసం అన్న చేసిన ఘాతుకాన్ని తెలుసుకున్న స్థానిక ప్రజలు విస్మయం చెందారు.

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×