Astrology Nakshatra Dosha: హిందూ సాంప్రదాయంలో జ్యోతిష్యశాస్త్రానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. హిందువులు ఏ పనులు చేయాలన్నా మొదటగా జ్యోతిష్యులనో, పండితులనో సంప్రదించి మంచి తిథి వార నక్షత్రాలను చూసుకుని పని మొదలు పెడతారు. అలాగే పిల్లలు పుట్టిన్నప్పుడు కూడా వారి పుట్టిన తిథి, నక్షత్రం ప్రకారం శాంతులు హోమాలు చేయిస్తారు. అయితే 27 నక్షత్రాలలో ఏ నక్షత్రంలో పిల్లలు పుడితే ఎలాంటి దోషాలు ఉంటాయి. ఎలాంటి పరిహారాలు చేయించుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
అశ్విని నక్షత్రం: ఈ నక్షత్రం ఒకటవ పాదంలో పుట్టిన పిల్లల వల్ల తండ్రికి దోషం ఉంటుంది. ఈ దోషం 3 నెలలు మాత్రమే ఉంటుంది. రెండు, మూడు, నాలుగు పాదములలో జన్మించిన వారికి దోషము లేదు.
భరణి నక్షత్రం: ఈ నక్షత్రంలోని ఒకటి, రెండు, నాలుగు పాదములలో జన్మించిన వారికి దోషము లేదు. మూడవ పాదంలో ఆడపిల్ల పుడితే తల్లికి, మగ పిల్లాడు పుడితే తండ్రి దోషం ఉంటుది. ఈ దోషం 23 రోజుల వరకు ఉంటుంది.
కృత్తిక నక్షత్రం: ఈ నక్షత్రం మూడవ పాదంలో ఆడపిల్ల పుడితే తల్లికి, మగపిల్లాడు పుడితే తండ్రికి సామాన్య దోషం ఉంటుంది. ఇక ఒకటి, రెండు, నాలుగు పాదాలలో జన్మించిన శిశువులకు స్వల్ప దోషమును ఉంటుంది.
రోహిణి నక్షత్రం: ఈ నక్షత్రము 1 వ పాదములో జన్మించిన మేనమామకు, 2 వ పాదములో పుడితే తండ్రికి, ౩వ పాదములో జన్మిస్తే తల్లికి దోషము. 4 వ పాదములో పుడితే ఎలాంటి దోషం ఉండదు. శ్రీ కృష్ణుడు కూడా ఈ నక్షత్రంలోనే పుట్టాడట. అందుకే కంసుడికి గండం ఉన్నది.
మృగశిర నక్షత్రం: ఈ నక్షత్రం 1 2 3 4 పాదములలో జన్మించిన వారికి ఏ విధమైన దోషములు ఉండవట.
ఆరుద్ర నక్షత్రం: ఈ నక్షత్రం 1 2 3 పాదములలో జన్మంచిన వారికి ఎలాంటి దోషము ఉండదట. 4 వ పాదములో జన్మించిన శిశువుకు సామాన్య శాంతి జరిపించాలట.
పునర్వసు నక్షత్రం: ఈ నక్షత్రం 1 2 3 4 పాదములు అన్నీ మంచివేనట. ఏ పాదంలో జన్మించినా దోషం ఉండదట అందుకే ఏ విధమైన శాంతి చేయించాల్సిన అవసరం రాదట.
పుష్యమి నక్షత్రం: ఈ నక్షత్రంలో కర్కాటక లగ్నములో డే టైంలో మగపిల్లాడు పుడితే తండ్రికి గండమట. రాత్రి టైంలో ఆడ శిశువు పుడితే తల్లికి గండమట. ఇక 1 వ పాదములో జన్మించిన వారి వల్ల మేనమామలకు, 2 పాదములలో పుట్టిన వారి వల్ల తల్లి తండ్రులకు దోషమట. మూడు, నాలగవ పాదములలో పుట్టిన వారికి సామాన్య దోషము కలుగుతుందట. విధివిధానంగా శాంతిని చేయించాలట.
ఆశ్లేష నక్షత్రం: ఈ నక్షత్రం 1 వ పాదములో పుట్టినవారికి దోషము లేదు. 2 వ పాదము శిశువునకు 3 వ పాదము తల్లికి 4 వ పాదము తండ్రికి దోషము .
ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు
మఖ నక్షత్రం: ఈ నక్షత్రం 1 వ పాదములో పుట్టిన శిశువు వల్ల తండ్రికి 5 నెలల వరకు దోషం ఉంటుందట. రెండు, నాలుగు పాదములలో జన్మించినా దోషం లేదట. మూడవ పాదంలో పుడితే తల్లిదండ్రులకు దోషం ఉంటుందట.
పుబ్బ నక్షత్రం: ఈ నక్షత్రం అన్ని పాదములలో జన్మించిన వారికి దోషము లేదు.
ఉత్తర నక్షత్రం: ఈ నక్షత్రం 1, 4 వ పాదములలో పుడితే తల్లి, తండ్రి, అన్నలకు దోషము. మిగతా 2, 3 పాదములలో పుట్టిన వారికి దోషము లేదు.
హస్తా నక్షత్రం: ఈ నక్షత్రం 3 వ పాదంలో పుట్టిన మగశిశువు వలన తండ్రికి, ఆడ శిశువు వలన తల్లికి దోషము. మిగతా 1 2 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు.
చిత్త నక్షత్రం: ఈ నక్షత్రం 1 వ పాదము తండ్రికి, 2 వ పాదము తల్లికి 3 వ పాదము తోడ పుట్టిన వారికి దోషము. నాల్గవ పాదములో జన్మించిన వారికి సామాన్య దోషము.
స్వాతి నక్షత్రం: ఈ నక్షత్రం 1 2 3 4 పాదములలో ఏ పాదములో జన్మించినా.. దోషము లేదు.
విశాఖ నక్షత్రం: ఈ నక్షత్రంలోని 1 2 3 4 ఏ పాదములో పుట్టిననూ బంధువులకు గండము.
అనూరాధ నక్షత్రం: ఈ నక్షత్రం 1 2 3 4 పాదముల లో జన్మించుట వలన ఎలాంటి దోషము ఉండదట.
జ్యేష్ట నక్షత్రం: ఈ నక్షత్రం 1 2 3 4 ఏ పాదములో జన్మించినా దోషమే. ఈ నక్షత్ర సమయాన్ని మొత్తం పది భాగాలుగా చేస్తారు. 1 వ భాగంలో పుడితే తాతయ్యకు 2 భాగంలో పుడితే అమ్మమ్మ కు మూడవ భాగంలో మేనమామలకు, నాలుగవ భాగంలో అన్నలకు, అక్కలకు 5వ భాగంలో శిశువునకు, 6వ భాగలో ఎవ్వరికి దోషము ఉండదు. 7వ భాగంలో వివాహ సమయములో అత్త వారి బంధు వర్గమునకు, 8వ భాగంలో జాతకునకు, 9వ భాగంలో తల్లికి, 10వ భాగంలో తండ్రికి దోషము ఉంటుందట.
ALSO READ: జన్మజన్మల్లో వెంటాడే కర్మలు అవేనట – మీరు ఏ కర్మలు చేశారో తెలుసా..?
మూల నక్షత్రం: ఈ నక్షత్రం 1 వ పాదం తండ్రికి, 2 వ పాదం తల్లికి, 3 వ పాదం ధన నాశనం. 4 వ పాదంలో పుడితే దోషం లేదు. అయితే ఈ మూలా నక్షత్ర సమయాన్ని మొత్తం 12 భాగాలుగా విభజించి దోషాలను తెలుసుకోవాలి. 1 వ భాగము తండ్రికి, 2 తల్లికి, 3 అన్నలకు, 4 భాగస్వాములకు, 5 పిల్లనిచ్చిన మామకు, 6 చిన్నాన్న, పెద్ద నాన్నలకు, 7 పిన్నమ్మ , పెద్దమ్మ లకు మరియు మేనమామలకు, 8 ధనమునకు, 9 జీవన నాశనము, 10 దరిద్రమును కల్గిస్తుంది. 11 బంధువులుకు, 12 జాతకునికి చెడు చేస్తుంది.
పూర్వాషాడ నక్షత్రం: ఈ నక్షత్రం1వ పాదంలో పగటి వేళ కొడుకు జన్మిస్తే తండ్రికి ఆపదలు, 2,3 వ పాదములలో స్త్రీ గానీ పురుషుడు గానీ ఎవరు పుట్టినా.. తల్లి తండ్రి ఇద్దరికీ గండము . 4 వ పాదంలో పుడితే దోషం లేదు.
ఉత్తరాషాడ, శ్రవణం, ధనిష్ట, శతభిష నక్షత్రాలలో జన్మించిన వారికి ఎలాంటి దోషాలు ఉండవు.
పూర్వాభాద్ర నక్షత్రం: ఈ నక్షత్రం మొదటి మూడు పాదములలో జన్మించినా దోషము లేదు. 4వ పాదంలో జన్మిస్తే సామాన్య దోషం ఉంటుంది.
ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదములలో జన్మించినా ఎటువటి దోషము ఉండదు. రేవతి నక్షత్రం మొదటి మూడు పాదములలో జన్మించినా ఎలాంటి దోషము ఉండదు. నాలుగవ పాదంలో జన్మించినా వారికి శాంతి తప్పని సరిగా చేయించాలి. ఇవే కాక దుష్ట తిధి దోషము, వర్జ్యము, దుర్ముహూర్తం, గ్రహణ టైంలో పుట్టిన కూడా శాంతి చేయించాలి.
ALSO READ: 2025 లో విపరీతమైన ధనయోగం పట్టబోయే ఐదు రాశులు ఇవే – అందులో మీ రాశి ఉందో లేదో చూసుకోండి