BigTV English

Rahu Venus Conjunction 2024: మార్చి 31న మీనంలో రాహు – శుక్రులు.. ఈ 4 రాశుల వారికి సిరిసంపదలు

Rahu Venus Conjunction 2024: మార్చి 31న మీనంలో రాహు – శుక్రులు.. ఈ 4 రాశుల వారికి సిరిసంపదలు
Rahu Venus Conjunction
Rahu Venus Conjunction

Rahu Venus Conjunction on March 31st 2024: జ్యోతిషశాస్త్రంలో ప్రతి గ్రహం కదలిక చాలా ముఖ్యమైందిగా పరిగణిస్తారు. ప్రతి గ్రహానికి ఒక నిర్ణీత కాలం ఉంటుంది. దాని తర్వాత అది తన కదలికను మారుస్తుంది. కొందరికి ఈ గ్రహాల గమనం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. మరికొందరు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. మార్చి 31న శుక్ర గ్రహం తన కదలికను మార్చబోతోంది. దాని కారణంగా రెండు గ్రహాలు కలుస్తాయి. ఈ సంచారం 4 రాశులవారికి శుభాలు కలిగిస్తుంది.


మీనరాశిలో రాహు-శుక్రుల కలయిక..
జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం సంపద, శ్రేయస్సు, అందం, విలాసానికి కారణమైన గ్రహం శుక్రుడు మీన రాశిలో సంచరించబోతున్నాడు. రాహువు ఇప్పటికే మీనరాశిలో ఉన్నాడు. రాహువు, శుక్రుని కలయిక వల్ల రాజయోగం కలుగుతుంది. ఈ సంయోగం ఏప్రిల్ 24 వరకు మీనరాశిలో ఉంటుంది. ఈ గ్రహాల కలయిక వల్ల నాలుగు రాశుల వారు ఎంతో ప్రయోజనం పొందుతారు. ఈ 4 రాశుల గురించి తెలుసుకుందాం.

కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారికి శుక్ర సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పనిలో అదృష్టం కలిసి వస్తుంది. ఆటంకాలు తొలగి విజయం సాధిస్తారు. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు శుభవార్త వింటారు. ఆర్థికంగా లాభపడే అవకాశాలున్నాయి. ఆర్థిక సమస్యలు తీరుతాయి.


సింహ రాశి..
సింహ రాశి వారికి రాహు-శుక్ర సంయోగం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వారు అదృష్టం కలిసి వస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు కూడా మంచి సమయం. పెద్ద ఒప్పందాలు కుదురుతాయి.

Also Read: చైత్ర నవరాత్రులకు ఒకరోజు ముందు సూర్యగ్రహణం.. పూజలపై ప్రభావం ఉంటుందా?

కన్య రాశి..
మీనంలో శుక్రుని సంచారం కన్య రాశి వారికి లాభాలను కలిగిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు శుభకాలం ప్రారంభం కానుంది. మీ పని తీరుతో పైఅధికారుల మెప్పు పొందుతారు. మీ పనిని పరిగణనలోకి తీసుకుని ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది. దీనితోపాటు జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి. కుటుంబంతో సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది.

కుంభ రాశి..
కుంభ రాశి వారికి శుక్ర సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. వ్యాపారులు వ్యాపారం విస్తరించే అవకాశాలున్నాయి. బకాయిలను తిరిగి పొందుతారు. ఉద్యోగులయితే మీ పని తీరుపై బాస్ సంతృప్తిగా ఉంటారు. పదోన్నతి పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం సామాజిక, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. bigtvlive.com దీనిని ధృవీకరించలేదు. దీని కోసం నిపుణుల సలహా తీసుకోండి.

Tags

Related News

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఇలా దీపారాధన చేస్తే.. అష్టకష్టాలు తొలగిపోతాయ్

Dhantrayodashi 2025: ధన త్రయోదశి రోజు ఈ ఒక్కటి ఇంటికి తెచ్చుకుంటే.. సంపద వర్షం

Karthika Masam 2025: కార్తీక మాసంలో చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటి ?

Bhagavad Gita Shlok: కోపం గురించి భగవద్గీతలో ఏం చెప్పారు ? 5 ముఖ్యమైన శ్లోకాలు..

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఈ పరిహారాలు చేస్తే.. డబ్బే డబ్బు !

Atla Taddi 2025: ఆడపడుచుల పండుగ అట్లతద్ది.. రాకుమారి కథ తెలుసా?

Vastu Tips: ఇంట్లో డబ్బు, బంగారం ఈ దిశలో ఉంచితే.. సంపద రెట్టింపు !

Karthika Masam 2025: కార్తీక మాసంలో.. తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఇవే !

Big Stories

×