Big Stories

MLC Kavitha sent to Tihar Jail: ఓవర్ టు తీహార్ జైలు.. కవిత గారు.. కొన్ని ప్రశ్నలు!

Kavitha Delhi Liquor Case

- Advertisement -

MLC Kavitha Sent to Tihar Jail on Delhi Liquor Scam: కల్వకుంట్ల కవిత తీహార్‌ జైలుకు వెళ్లింది.. విక్టరీ సింబల్ చూపిస్తూ కోర్టు లోపలికి వెళ్లిన కవితకు.. అస్సలు ఊహించని షాక్ ఇచ్చింది న్యాయస్థానం.. ఇంతా జరిగినా కవిత చెబుతుందేంటి? మీరే వినండి. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు.. ఇది మనీలాండరింగ్‌ కేసు కానే కాదు.. పొలిటికల్ లాండరింగ్ కేసు.. ఇదీ కోర్టు నుంచి బయటికి వచ్చి తీహార్‌ జైలుకు వెళ్తున్నప్పుడు.. మీడియాతో కవిత మాట్లాడిన మాటలు.. అంతకుముందు కోర్టులో జరిగిన వాదనలు.. ఆమె వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ కోసం చెప్పిన కారణాలు.. ఇవీ కాదు డిస్కస్ చేయాల్సింది.. కవిత పదే పదే చెబుతున్న పొలిటికల్‌ ప్రొపగాండ కేసు అనే టాపిక్‌పై కాస్త ఫోకస్‌ చేస్తే.. అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి.

- Advertisement -

ఔను.. నిజంగానే రాజకీయ ప్రేరేపిత కేసే అనుకుందాం. అయితే ప్రజలు ఈ మాట నమ్మాలంటే కొన్ని ప్రశ్నలకు కవిత సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కవిత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాతో ఎందుకు భేటీ అయ్యారు? అరుణ్‌ పిళ్లైని తన మనిషిగా ఆప్‌ నేతలకు ఎందుకు పరిచయం చేశారు? ప్రాఫిట్ మార్జిన్‌ను 12 శాతానికి పెంచడంలో నిజంగా మీ హస్తం లేదా? మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఎందుకు కలిశారు? ఢిల్లీ లిక్కర్‌ పాలసీ గురించి ఎందుకు డిస్కస్ చేశారు? మీ టీమ్‌ ఢిల్లీలో ఇప్పటికే పనిచేస్తుందని ఎందుకు చెప్పారు? మీరిచ్చిన వంద కోట్ల లంచంలో.. మాగుంటను 50 కోట్లు ఇవ్వమని ఎందుకు అడిగారు? మీ సీఏ బుచ్చిబాబు, మాగుంట రాఘవ ఎందుకు భేటీ అయ్యారు? మాగుంట రాఘవ ఇచ్చిన 25 కోట్ల క్యాష్‌ను మీరు ఎక్కడికి పంపారు? ఇండో స్పిరిట్స్‌తో ఎందుకు పార్టనర్‌షిప్‌ తీసుకున్నారు?

డీల్ కుదిరినందుకు ఎందుకు తెగ ఆనందపడిపోయారు? ఇప్పటి వరకు నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్లలో ప్రతిసారి మీ పేరు ఎందుకు వచ్చింది? ఎందుకు మీ తోటి నిందితులతో భేటీ అయ్యారు? ఎందుకు ఆడియో, వీడియో కాల్స్‌ మాట్లాడారు? ఈడీ ఆధారాలుగా చూపిస్తున్న చాట్‌ ఇమేజేస్‌ కూడా అబద్ధమంటారా? ఎందుకు మీ ఫోన్లను ధ్వంసం చేశారు? ఎందుకు పదే పదే మీ ఫోన్లను మార్చారు? ఈ కేసులో అన్ని తానై వ్యవహరించిన అరుణ్‌ పిళ్లైకి బాస్‌ మీరు కాదా? చాలాసార్లు అవకాశమిచ్చినా సరైన స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదని ఈడీ చేసిన ఆరోపణ నిజం కాదా?ఇవన్నీ కవిత కస్టడీ పిటిషన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చెప్పిన విషయాలే.. కవిత ఎప్పుడు, ఎలా ఈ స్కామ్‌ను స్టార్ట్‌ చేశారు.. ఎవరెవరితో ఎప్పుడు భేటీ అయ్యారు. ఏం మాట్లాడారు.

Also Read: హస్తిన బాటలో సీఎం.. ఇవాళ దాదాపు ఫైనల్..!

ఎందుకు మాట్లాడారు. ఇలా ప్రతి అంశాన్ని ఈడీ తన చిట్టాబుక్కులో పొందుపరిచింది. విషయం ఇలా ఉంటే.. కవితేమో తనది రాజకీయ కేసు అని ఆరోపిస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనను ఈ కేసులో ఇరికించారంటున్నారు. మరి ఏది నిజం? కళ్ల ముందున్న ఈ సాక్ష్యాలను నమ్మాలా? కవిత చేస్తున్న ఆరోపణలను నమ్మాలా? మనం మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. ఈడీ కస్టడిలో జరిగేది ఒకటి.. కవిత బయటికి వచ్చి చెబుతున్నది మరోకటి అని.. ఆమె చూపించే విక్టరీ సింబల్స్‌ పైపై పూతే కాని.. అసలు సినిమా వేరే ఉందని.. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే మేం చెప్పిందే నిజమైంది.

హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ చేరిన కవితను.. ఏకంగా తీహార్‌ జైలుకు పంపింది ఈడీ.. ఇక్కడే ఈ కేసు నిందితులంతా ఉన్నారు. త్వరలో కేజ్రీవాల్‌ కూడా ఇక్కడికి చేరే అవకాశం ఉంది. ఏప్రిల్‌ 9 వరకు కవిత తిహార్‌లోనే ఉండనున్నారు కవిత.. నన్ను తాత్కాలికంగా జైలులో పెట్టవచ్చు. కానీ నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ఇదీ కవిత చెబుతున్న మాట.. కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయటికి వస్తా అంటున్నారు. మంచిదే.. కానీ కేసులో అసలు నిజాలు బయటికి వస్తే.. కవిత ఇదే మాట చెప్పగలరా?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News