సనాతన ధర్మంలో సాంప్రదాయం ప్రకారం ఆడవాళ్లు తలలో పువ్వులు పెట్టుకొని కనిపిస్తేనే శుభదాయకం. సాంస్కృతికంగా కూడా ఇది ఎంతో ఆమోదయోగ్యమైనది. వివాహాలు, పండగలు వంటి శుభకార్యాలలో కచ్చితంగా ప్రతి మహిళ పొడవాటి జడలో పువ్వులతో కనిపిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం పువ్వులు పెట్టుకోకూడదని చెబుతారు.
కొన్ని సంప్రదాయాల ప్రకారం అమ్మాయిలు పువ్వులు పెట్టుకుని బయటకు వెళ్ళకూడదు అని కూడా అంటారు. అది వారి ప్రాంతీయ ఆచారాలు, కుటుంబ నియమాలపై ఆధారపడి ఉంటుంది. కానీ మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం చూస్తే మాత్రం తలలో పువ్వులు పెట్టుకోవడం అనేది అమ్మాయికు యోగధాయకం అయినది.
పూలకు నియమాలు
ఆధునిక ప్రపంచంలో అమ్మాయిలు ఎంతో అప్డేట్ అయిపోయారు. తలలో పువ్వులు పెట్టుకోవడం అనేది మరిచిపోయారు. కానీ ఇంట్లో పండుగలు, వివాహాల సమయంలో మాత్రం కొంతమంది వాళ్ళు జడతో పువ్వులు పెట్టుకునేందుకు ఇష్టపడుతున్నారు. అయితే పూలు పెట్టుకునే విషయంలో కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి. వాటిని కచ్చితంగా అనుసరించాలి.
ఎప్పుడు పువ్వులు పెట్టుకోకూడదు?
అశుభ సందర్భాల్లో పువ్వులు పెట్టుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా అంత్యక్రియలు, శ్రాద్ధ కర్మలకు వెళుతున్నప్పుడు ఎవరూ కూడా తలలో ఒక్క పువ్వు కూడా పెట్టుకోకూడదు. అలాగే కొన్ని ప్రాంతాల్లో అమ్మాయిలు పువ్వులు పెట్టుకోవచ్చు. కానీ వివాహమైన స్త్రీలు మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే పువ్వులకు శృంగార భావనలతో సంబంధం ఉంటుందని నమ్ముతారు. అలాంటప్పుడు పెళ్లి కానీ అమ్మాయిలు పువ్వులు పెట్టుకొనే అవకాశం వుండదు.
కుటుంబాలపరంగా కూడా కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. కొందరు కుటుంబాల్లో అమ్మాయిలు నిండుగా పువ్వులు పెట్టుకొని బయటకు వెళ్లడం నిషిద్ధం. అలాంటి ఆచారాలు మీ కుటుంబంలో ఉంటే మీరు కూడా పువ్వులను పెట్టుకొని బయటికి వెళ్ళకూడదు. అలాంటి ఆచారాలు లేనివారు ఎప్పుడైనా సరే నచ్చిన పూలను పెట్టుకొని బయటకు వెళ్ళవచ్చు. ఏదైనా కూడా మీరు నివసించే ప్రాంతం కుటుంబ ఆచారాలపై ఆధారపడి ఉంటుంది.
అదే సంప్రదాయబద్ధంగా చూస్తే మాత్రం అమ్మాయిలు తలలో పువ్వులు పెట్టుకొని బయటికి వెళ్లడం అనేది ఆమోదయోగ్యమే. ఇలా పువ్వులు పెట్టుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యం కూడా వారికి దక్కుతుంది.
పూలతో ఎంతో ఆరోగ్యం
పువ్వులు నుంచి వచ్చే వాసన మన మెదడుకు ఉత్సాహాన్ని అందిస్తుంది. ఉల్లాసంగా అనిపిస్తుంది. పూలు మనకు తెలియకుండానే రక్తపోటును, గుండె కొట్టుకునే రేటును అదుపులో ఉంచుతాయి. దీనివల్ల ఏ నొప్పి అయినా అలసటైన తగ్గినట్టు అనిపిస్తుంది. అంతెందుకు మల్లెపూలను వాసన చూసి చూడండి.. ఎంతో హాయిగా అనిపిస్తుంది. తలనొప్పి కూడా తగ్గుతుంది. అలసట కూడా చాలా వరకు తీరినట్టు అనిపిస్తుంది. చాలా అధ్యయనాల్లో ఈ విషయాన్ని తేలింది. కొన్ని ఆసుపత్రుల్లో చికిత్స అందించేందుకు పూల వాసనలు కూడా చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
మానసిక ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు కూడా పూల నుంచి వచ్చే వాసన ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక ఇంట్లో ఇల్లాలు పువ్వులు పెట్టుకొని తిరగడం వల్ల ఆ ఇంట్లో నివసిస్తున్న ఇతర కుటుంబ సభ్యులకు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఒత్తిడి, యాంగ్సైటి వంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. పూల నుంచి వచ్చే సువాసనలు మన నాడీ వ్యవస్థను యాక్టివ్ చేస్తాయి. శరీరమంతా ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా అనిపిస్తుంది.
ఆస్తమా ఉన్నవారు
అయితే ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పూలు తమ చుట్టూ ఉన్న గాలిని తేమవంతంగా మారుస్తాయి. దీని వల్ల అలాగే పూలల్లో ఉండే పుప్పొడి కూడా గాలిలో చేరుతుంది. దీనివల్ల ఆస్తమా రోగులకు పొడి దగ్గు, గొంతు దురద, ఆయాసం వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి పూలను పెట్టుకోవడం మంచిది.
మెదడు పరంగా చూస్తే మాత్రం పూలు పెట్టుకోవడం ఎంతో ముఖ్యం. మీ మెదడుకు శక్తిని ఇవ్వడంలో పువ్వులు ఎంతో ఉపయోగపడతాయి. ఏకాగ్రతను పెంచుతాయి. జ్ఞాపకశక్తి కూడా పెరిగేలా చేస్తాయి. మెదడు ఆరోగ్యంగా ఉండాలి. అంటే ప్రతిరోజు పువ్వులు పెట్టుకునేందుకు ప్రయత్నించండి.
అయితే కొంతమందిలో పూల అలెర్జీ ఉంటుంది. అలాంటివారు మాత్రం పోలిక దూరంగా ఉంటేనే మంచిది. మీకు పూల అలెర్జీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాతే పూలు పెట్టుకునేందుకు ట్రై చేయండి.
పురాతన కాలం నుంచి ఒక నమ్మకం మాత్రం అలా ఉండిపోయింది. పువ్వులు పెట్టుకున్న స్త్రీ.. బియ్యం చాటలో వేసుకుని చెరగకూడదు అని చెబుతారు. బియ్యంలో రాళ్లను కూడా ఏరకూడదని అంటారు. దానికి కారణాన్ని మాత్రం ఇప్పటివరకు తెలియదు.