Watch Video: రైలు పట్టాలపై తల్లీ కొడుకులు. ఒక కేసులో ప్రొద్దుటూరు వన్ టౌన్ సిఐ కొట్టాడంటూ మహిళ తీవ్ర నిర్ణయం తీసుకుంది. మహిళ అని కూడా చూడకుండా తిట్టాడని, వేధించాడని.. తన కుమారుడితో పాటు రైలు పట్టాలపై పడుకొని చనిపోతున్నాం అంటూ వీడియో తీసుకొంది. మా చావుకు వన్ టౌన్ సిఐ కారణమంటూ తెలిపింది.
పోలీసు వేధింపులు తట్టుకోలేక, చావుకు సిద్ధపడి తల్లీకొడుకులు రైలు పట్టాలపై తలపెట్టి పడుకోవడం కడప జిల్లాలో సంచలనంగా మారింది. ఒక కేసులో రెండువైపులా విచారణ చేయకుండా, తమను దోషులుగా తేల్చి కొట్టడం ఏంటని ఆ మహిళ ప్రశ్నించింది. తన కుమారుడిని కూడా కొట్టారని ఆరోపించిందామె.
అసలు, పోలీస్ స్టేషన్ దగ్గరే ఆత్మహత్యాయత్నం చేసినట్టు కొందరు చెప్తున్నారు. విషం తాగడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారని, దీంతో రైలు పట్టాలపై పడుకుని వీడియో తీసుకుందని అంటున్నారు.