BigTV English

Solar Eclipse: మరో నాలుగు రోజుల్లో సూర్యగ్రహణం, ఇది మన దేశంలో కనిపిస్తుందా? ఏ సమయంలో కనిపిస్తుంది?

Solar Eclipse: మరో నాలుగు రోజుల్లో సూర్యగ్రహణం, ఇది మన దేశంలో కనిపిస్తుందా? ఏ సమయంలో కనిపిస్తుంది?

హోలీ రోజు చంద్రగ్రహణం ముగిసిపోయింది. ఇక మరి కొన్ని రోజుల్లో సూర్యగ్రహణం రాబోతుంది. సూర్యగ్రహణానికి జ్యోతిష్యంలో, సైన్స్ లో, మతపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆధ్యాత్మికంగా చూస్తే రాహుకేతువులే సూర్యగ్రహణానికి కారణమని భావిస్తారు. రాహుకేతువులు సూర్యుడు మింగడం వల్లే గ్రహణం వస్తుందని అంటారు. అదే సైన్స్ పరంగా చెప్పాలంటే చంద్రుడు… భూమికి సూర్యుడికి మధ్య వెళ్లినప్పుడు ఆ పరిస్థితుల్లో సూర్యకాంతి భూమిని చేరుకోలేకపోతుంది. దీన్నే సూర్యగ్రహణం అంటారు.


సూర్యగ్రహణం ఎప్పుడు?

2025వ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం చైత్ర అమావాస్యనాడు సంభవిస్తుంది. అంటే మార్చి 29న సూర్యగ్రహణం ఏర్పడబోతుంది.


సమయం

భారతీయ ప్రామాణిక సమయం ప్రకారం సూర్యగ్రహణం మార్చి 29న మధ్యాహ్నం 2:21 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:14 గంటలకు ముగుస్తుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణంగానే చెప్పుకోవాలి.

మనకు కనిపిస్తుందా?

చైత్ర అమావాస్యనాడు ఏర్పడే ఈ సూర్యగ్రహణం మనదేశంలో కనిపించదు. ఆ సమయంలో సూర్యుడు మీనరాశిలో ఉంటాడు. మనకు సూర్యగ్రహణం కనిపించకపోయినా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, యూరోప్, ఆసియాలోని కొన్ని దేశాల్లో మాత్రం సూర్యగ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రంలో నుంచి చూసినా కూడా సూర్యగ్రహణం స్పష్టంగా ఉంటుంది.

సూతక కాలం ఉంటుందా?

సూర్య గ్రహణానికి 12 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. కానీ మార్చి 29న ఏర్పడి సూర్యగ్రహణం భారత దేశంలో కనిపించదు. కాబట్టి సూతక కాలం మనకు చెల్లదు.

పూజలు చేయొచ్చు

దేశంలో ఏర్పడే సూర్యగ్రహణం పాక్షికంగా ఉంటుంది. ఇది భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఈ గ్రహణం రోజు ఎలాంటి మతపరమైన కార్యకలాపాలు చేయాల్సిన అవసరం లేదు. గ్రహణం సమయంలో కూడా విరాళాలు, నైవేద్యాలు, పూజలు వంటివి చేసుకోవచ్చు.

భోజనం వద్దు

సూర్యగ్రహణం రోజు హిందూ మతం తరంగా కొన్ని పనులు చేయకూడదని చెబుతారు. అలాగే కొన్ని పనులు చేయడం వల్ల మేలు జరుగుతుందని కూడా అంటారు. గ్రహణం సమయంలో ఎవరూ భోజనం చేయకూడదని, శుభకార్యాలు తలపెట్టకూడదని చెబుతారు. ఆ గ్రహణం ముగిశాక స్నానం చేసి దానధర్మాలు వంటివి చేయాలని అంటారు. అలాగే గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయకూడదని, దేవాలయాలకు వెళ్ళకూడదని కూడా చెబుతారు. సూర్య గ్రహణం సమయంలో కేవలం ఇంట్లో మాత్రమే ఉండాలని… వ్యాయామం, నడకా వంటివి కూడా చేయకూడదని చెబుతారు.

గ్రహణం విడిచాకే తలస్నానం

గ్రహణం విడిచిన తర్వాత తలకు స్నానం చేయాలని, దేవుని పూజించాలని, ఇంటిని శుభ్రం చేసుకోవాలని, అవసరమైన వారికి సహాయం చేయాలని కూడా చెబుతారు. అయితే ఈసారి సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి మనము పైన చెప్పినవన్నీ పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సూతక కాలం ఉంటేనే మనం పైన చెప్పిన గ్రహణ నియమాలను పాటించాలి. సూతక కాలం లేదు కాబట్టి సాధారణ రోజులాగే సూర్యగ్రహణం సమయంలో కూడా గడపవచ్చు.

మార్చి లోనే సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడ్డాయి. ఇది చాలా అరుదైన సందర్భంలోనే జరుగుతుంది. సరిగ్గా చంద్రగ్రహణం ఏర్పడిన 15 రోజులకే సూర్యగ్రహణం వచ్చింది. అయితే ఈ గ్రహణాలు నేరుగా భారతదేశంలోని ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించవు. కానీ మత నమ్మకాల ప్రకారం వారి రాశి చక్రాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

Also Read: వైఎస్‌ జగన్‌ మళ్లీ జైలుకు వెళ్తారా? కొత్త  సంవత్సరంలో ఆయన జాతకం ఎలా ఉందో తెలుసా?

జ్యోతిష్యులు చెబుతున్న ప్రకారం సూర్యగ్రహణం సమయంలో సూర్యుడు మీనరాశిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అయితే అదే సమయంలో మీనరాశిలోనే బుధుడు, శని దేవుడు, శుక్రుడు, రాహువు కూడా ఉంటారు. కాబట్టి ఈ సమయంలో ఎన్నో రాశులపై శుభ శుభ ఫలితాలు అధికంగానే ఉంటాయి.

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×