BigTV English
Advertisement

Horror Thriller OTT : వెన్నులో వణుకు పుట్టించే హారర్ సీన్స్.. ఒక్క రాత్రి గడవటం కష్టం..

Horror Thriller OTT : వెన్నులో వణుకు పుట్టించే హారర్ సీన్స్.. ఒక్క రాత్రి గడవటం కష్టం..

Horror Thriller OTT : ఇటీవల చిన్న స్టోరీతో వచ్చే ప్రతి సినిమా థియేటర్లతో పాటుగా ఓటీటీ లో కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంటున్నాయి. థియేటర్లలో స్టార్ హీరోల సినిమాలైనా సరే ఒక్కొక్కసారి స్టోరీ సరిగ్గా లేనప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిస్తున్నాయి కానీ ఓటిటిలో మాత్రం ఎలాంటి కంటెంట్ గా వచ్చిన సినిమా అయినా సరే మంచి వ్యూస్ ని రాబట్టి సక్సెస్ అవుతున్నాయి. ఇకపోతే ఈమధ్య ఓటీటీలోకి వచ్చే హారర్ సినిమాలు మంచి రెస్పాన్స్ ని అందుకోవడంతో కొన్ని సినిమాలు డైరెక్టుగా ఓటీటీ లోనే రిలీజ్ అవుతుంటాయి. తాజాగా మరో హారర్ మూవీ స్ట్రీమింగ్ కి రాబోతుంది. అయితే ఈ మూవీ నేరుగా ఓటిటిలో రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉంది. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.. అంతేకాధు సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. మరి ఆలస్యం ఎందుకు ఆ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


మూవీ & ఓటీటీ.. 

హారర్ సినిమాలను ఎక్కువగా చూసేవారి కోసం అదిరిపోయే గుడ్ న్యూస్.. గత నాలుగేళ్ల క్రితం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఓ మూవీకి సీక్వెల్ గా మరో మూవీ రాబోతుంది. ఆ మూవీ పేరు మరేంటో కాదు చోరీ.. నాలుగేళ్ల క్రితం ఈ మూవీ నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. మొదటి షో నుంచి భారీ వ్యూస్ ని రాబడుతూ వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు మరో మూవీ రాబోతుంది అదే చోరీ 2.. ఈ మూవీ గురించి అధికారకంగా ప్రకటిస్తూ తాజాగా టీజర్ ని రిలీజ్ చేశారు ఆమెజాన్ ప్రైమ్.. మరి ఆ టీజర్ ఎలా ఉంది ఈ మూవీ స్టోరీ ఏంటి అనేది ఒకసారి మనం చూసేద్దాం..


స్టోరీ విషయానికొస్తే.. 

ప్రముఖ ఓటీపీ సంస్థ అమెజాన్ ప్రైమ్ 2021 లో రిలీజ్ చేసిన మూవీ చోరీ.. ఈ మూవీ టైటిల్ కి తగ్గట్లే సినిమా అంతా గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది అయితే వణుకు పుట్టించే హారర్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో ఈ సినిమా ఓటిటిలో భారీ సక్సెస్ ని అందుకుంది. బాలీవుడ్ నటి నుష్రత్ బరూచా నటించిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను వణికించింది. ఇందులోని ట్విస్టులు, నటీనటుల నటన ఆకట్టుకున్నాయి. ఓ మారుమూల గ్రామంలోని ఓ పొలంలోనే సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేస్తారు. ఈ సినిమాకు పెద్దగా బడ్జెట్ కూడా ఖర్చు చేస్తున్నట్టు లేదు ఎందుకంటే ఈ సినిమాలో దెయ్యాలుగా కనిపించిన వాళ్ళు కూడా అంత ఎఫెక్ట్ మేకప్ లైతే లేదు కానీ దగ్గర్నుంచి చూస్తే మాత్రం ఖచ్చితంగా గుండెల్లో గుబులు కొట్టేస్తుంది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు దానికి సీక్వెల్ గా చోరీ 2 మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

అమెజాన్ ప్రైమ్ వీడియోలో తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో ఈ చిత్ర టీజర్ ని రిలీజ్ చేశారు. ఒక గర్భవతికి ఓ మహిళ ఆశ్రయమిస్తుంది ఆమె ఒక బేబీకి జన్మనిస్తుంది. ఆ తర్వాత తల్లి కూతుర్లు అక్కడే ఉంటారు అయితే ఓ రోజు ఏమైందో తెలియదు కానీ చుట్టూ భయంకరమైన సన్నివేశాలు ఎదుర్కోవాల్సి పరిస్థితి వస్తుంది. ఎటు చూసినా ఆత్మలు ఆ ఇంట్లో తిరిగినట్లు కనిపిస్తాయి. మరి చివరికి తన బిడ్డను ఆ తల్లి వెతుక్కునిందా లేదా దెయ్యాలకి ఆమె బలి అయిపోయిందా అన్నది ఈ సినిమా స్టోరీలో చూడాల్సిందే.. ఈ మూవీ ని ఏప్రిల్ 11న అమెజాన్ ప్రైమ్ తమ వినియోగదారులకి అందుబాటులోకి తీసుకురానుంది..

Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×