Big Stories

Kondagattu Hanuman Jayanti: కొండగట్టు అంజన్న చరిత్ర గురించి తెలుసా..?

Kondagattu Hanuman Temple History: ఆంజనేయుడు భక్త సులభుడు. ప్రతి గ్రామం లోని వెలసి భక్తులందరిని కాపాడుతూ ఉండే దేవుడు. అలాంటి అంజన్న కొండ గట్టులో చాలా ప్రత్యేకంగా చాలా మహిమాన్వితమైన రూపంలో కొలువైయున్నాడు. ఎక్కడ లేని విదంగా చాలా ప్రత్యేకరూపంలో దర్శనమిచ్చే ద్విముఖ ఆంజనేయుడు ఈయన. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో 15 కీలో మీటర్ల దూరంలో మలయాళ మండలం ముత్యంపేట గ్రామానికి దగ్గర్లోని కొండగట్టు మీద కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ ఆంజనేయుని రూపం చాలా మహిమాన్వితమైంది. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. చాలా అరుదైన రూపం కూడా.. చాలా ప్రాంతాలలో ఏక రూపంలో కనిపించే హనుమంతుడు కొన్ని చోట్ల త్రిముఖాలు, మరికొన్ని చోట్ల పంచ ముఖాలతో దర్శనమిస్తాడు.
ఎక్కడ లేని విధంగా ఇక్కడ మాత్రం చాలా ప్రత్యేకంగా ద్విముఖాలతో దర్శనమిస్తాడు. ఒకటి ఆంజనేయ స్వామి ముఖం కాగా మరొకటి నారసింహ స్వామి ముఖం. రెండు ముఖాలతో నారసింహ శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు, సీతామాతలతో కూడిన రూపం ఇక్కడి ఆండనేయుడి ప్రత్యేకత. అందుకే కొండ అంజన్న అంటే అందరికి అంత భక్తి. మరింత నమ్మకం, ఎంతో దైర్యం.ఆయన ఆశీర్వాదం లభించిందంటే చాలు కొండంత ధైర్యం వచ్చింనట్లేనని నమ్ముతుంటారు. ఆంజనేయుడి మూల మూర్తి దర్శనంతో భూతప్రేత పిశాచాల పీడల నుంచి కూడా విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. నిత్య అభిషేకాలు, వార్షిక ఆరాధన ఉత్సవాలు,శ్రీరామ నవమి, ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.

Also Read: మేషరాశిలో బుధుడు, శుక్రుడు కలయిక.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..!

- Advertisement -

ప్రతిరోజు ప్రాతఃకాల అర్చన, బాలభోగం, నీరాజనం, మంత్ర పుష్పం వంటి అర్చనలతో పాటు సింధూర, తమలపాకు అర్చనలు, నిత్య, పక్ష, మాసోత్సవాలు జరుగుతాయి. ప్రతి రోజు ప్రత్యేకంగా రెండు సార్లు ఆరాధన ఉంటుంది. ఉదయం, సాయంత్రం నివేదన చేస్తారు. ఆతర్వాత భజన కార్యక్రమం ఉంటాయి. ముఖ్యంగా మంగళ, శని, ఆది వారాల్లో భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. పండుగలు ప్రత్యేక దినాలలో భక్తులతో కిటకిటలాడుతుంది కొండగట్టు.

- Advertisement -

చైత్ర, వైశాఖ మాసాల్లో హనుమజయంతి రెండుసార్లు చేయడం ఆలయ ప్రత్యేకత. వైశాఖ మాసంలో ఐదు రోజులు, చైత్ర పౌర్ణమి రోజున హునుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. వీటిని చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి అని పిలుస్తారు. దేలవాలయాల ప్రాంగణంలో మరో రెండు ఉపాలయాలు కూడా ఉన్నాయి. గుడిలో కుడి వైపు వెంకటేశ్వర స్వామి ఆండాల అమ్మ వారితో కూడి భక్తుల మొర ఆలకిస్తూ ఉంటారు. ఎడమ వైపు ఉపాలయంలో శివ పంచాయతన ఆలయం ఉంటుంది. ఆలయంలో అడుగు పెట్టిన భక్తులు ఆగ్నేయంలోని కోనేరులోని స్నానాలు చేస్తారు. ఇక్కడి నుంచి ముందుకు వెళ్తుంటే ఓ చోట పాదుకలు, పసుపు, కుంకుమ, అక్షింతలు ఉన్న ప్రదేశం కనిపిస్తుంది. ఇక్కడ దండాలు పెట్టుకొని ముందుకు కదులుతారు. ఇది సీతమ్మ వారి కన్నీటి ధార ప్రదేశం.

వనవాస సమయంలో రాములవారి కష్టాలు చూసిన సీతమ్మకు కన్నీరు ధారగా వచ్చిందట. అలా ప్రవహించిన కన్నీటి ధార గుర్తులే ఇవి అని చెబుతారు. కొండగట్టులో మరో ముఖ్య విశేషం బేతాళ స్వామి గుడి. ఇక్కడి బేతాళ స్వామి గుడిలో కోళ్లు మేకలు కోసి కల్లు శాక పోసి మొక్కులు సమర్పుస్తుంటారు. కొండగట్టు ఆంజనేయ మాల వేసుకునే వారికి మహాపుణ్య క్షేత్రం. ప్రత్యేకించి మాల విరమణకు ప్రతి ఏడు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఆంజనేయ జయంతి సందర్భంగా భక్తులు అంజన్న మాల ధరిస్తుంటారు. 41, 21, 11 రోజుల దీక్షలు తీసుకుంటారు.

Also Read: ఆఫీస్​లో వాస్తు నియమాలు పాటిస్తే.. మీ గెలుపుకు తిరుగే లేదు

కొండగట్టు అంజన్నకు సంవత్సరాల చరిత్ర ఉంది. సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు మీద పశువుల్ని మేపుతూ ఉండగా ఓ ఆవు తప్పిపోయిందట. దాన్ని వెతుకుతూ అలసిపోయి ఓ చెట్టుక్రింద పడుకున్నాడట. ఆంజనేయ స్వామి ఆయన కలలో కనిపించి కోరందపొదల్లో ఉన్నాని చెప్పి తప్పిపోయిన తన ఆవు జాడ కూడా తెలిపాడట. సంజీవుడు ఆశ్చర్యంతో కళ్లు తెరిచి చూసే సరికి ఆవు కనిపించగా దగ్గర్లోని కోరందపొదల్లో వెదకగా హనుమంతుడు దర్శనమిచ్చాడట. దాంతో అక్కడే చిన్న గుడు కట్టి పూజలు చేయడం ప్రారంభించాడట. 160 ఏళ్ల క్రితం కృష్ణారావు దేశ్ ముఖ్ అనే జాగీర్దార్ దేవాలయాన్ని పుణరుద్ధించాడని చెప్తారు.

కాగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో చిన్న హనుమాన్‌ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజులపాటు జరుగనున్న ఈ వేడుకలకు హనుమాన్‌ దీక్షాపరులు పోటెత్తారు. మాల విరమణకు భక్తులు పోటెత్తున్నారు. 900 వందల మంది పోలీసులుతో భద్రత ఏర్పాటుచేశారు. సుమారు 3నుంచి 4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయ అర్చకులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News