BigTV English

Mars Transit 2024: కుజుడి సంచారం.. ఆగస్టు 6 లోపు ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం

Mars Transit 2024: కుజుడి సంచారం.. ఆగస్టు 6 లోపు ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం

Mars Transit in July 2024: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు తమ రాశులను నిర్ణీత సమయంలో మార్చుకుంటాయి. గ్రహాల రాశి చక్రంలో మార్పు అన్ని రాశులపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. నవగ్రహాలకు అధిపతిగా పరిగణించబడే కుజుడు జూలైలో వృషభ రాశిలోకి ప్రవేశించాడు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. 18 నెలల తర్వాత కుజుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. అనంతరం జూలై 12 శుక్రవారం రాత్రి 7:12 గంటలకు కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు.


కుజుడు దాదాపు 40 రోజుల పాటు వృషభ రాశిలో ఉంటాడు. అంగారకుడిని భూమికి అధిపతిగా భావిస్తారు. కుజుడి రాశి మార్పు ఏ రాశులను ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:
కుజుడి రాశి మార్పుతో మీరు డబ్బు ఆదా చేయడంలో ముందుంటారు. గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భూమి ఆస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. సరైన ప్రయత్నాలు చేయడం వల్ల ఆదాయంలో ఊహించని పెరుగుదల కనిపిస్తుంది. ధనం పెరగడం వల్ల మీ జీవితం కూడా బాగుంటుంది. పెట్టుబడికి తగ్గ మంచి రాబడులు కూడా వస్తాయి. ఈ సమయంలో మీరు కొత్త పెట్టుబడులు కూడా పెట్టవచ్చు. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఉంది. మీ భాగస్వామితో సమయం ఆనందంగా గడుపుతారు.


కర్కాటక రాశి:
దైర్యసాహసాలు, ఎనర్జీ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. అంతే కాకుండా ఆర్థిక బలం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ సంపద కూడా పెరుగుతుంది. అన్ని రకాల అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారం విస్తరించేందుకు అవకాశం ఉంది. ప్రైవేట్ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయి.

Also Read: Shani Vakri 2024: శని ప్రభావం..122 రోజులు 3 రాశుల వారికి శుభ యోగం

తులా రాశి:
అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు సంపాదించడానికి కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పెండింగ్ లో పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగుల జీవితాలు కూడా పెరిగుతాయి. వృత్తి నిపుణుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడులు వస్తాయి. విద్యార్థులు పరీక్షల్లో మంచి ర్యాంకులను పొందుతారు.

ధనస్సు రాశి:
తోబుట్టువుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ఉద్యోగస్తులు మంచి శుభవార్తలు వింటారు. పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. మీ స్థానం కూడా పెరుగుతుంది. నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. వృత్తి నిపుణులు మంచి లాభాలు, పురోగతిని పొందే అవకాశం ఉంది.

కుంభ రాశి:
ఉద్యోగస్తులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు కొత్త పనిని కూడా పొందే అవకాశం ఉంది. వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేస్తారు. మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ , ఆస్తి సంబంధిత వ్యాపారం చేసే వారు మంచి లాభాలు పొందుతారు.

Also Read: శని ప్రభావం.. వీరి తలరాతలు మారిపోయే టైం వచ్చేసింది.

మీన రాశి:
సొంత ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త కారు కూడా కొంటారు. ప్రైవేట్ ఉద్యోగం మారాలనుకునేవారికి ఇది మంచి సమయం. కొత్త వ్యాపారం కూడా ప్రారంభించేందుకు అవకాశం ఉంది. పెట్టుబడుల వల్ల మంచి లాభాలు వస్తాయి. ఇది మీ ఆదాయాన్ని కూడా పెంచుతుంది. విద్యార్థులు విద్యా పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో భాగస్వామితో ఉన్న గొడవలు సర్దుమనిగే అవకాశం ఉంది.

Related News

Atla Taddi 2025: ఆడపడుచుల పండుగ అట్లతద్ది.. రాకుమారి కథ తెలుసా?

Vastu Tips: ఇంట్లో డబ్బు, బంగారం ఈ దిశలో ఉంచితే.. సంపద రెట్టింపు !

Karthika Masam 2025: కార్తీక మాసంలో.. తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఇవే !

Vastu For Staircase: ఇంటి లోపల.. మెట్లు ఏ దిశలో ఉండాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసం, ఏ రోజు నుంచి ప్రారంభం ? పూర్తి వివరాలివిగో..

Bed Room Vastu: పొరపాటున కూడా.. ఇలాంటి వస్తువులు బెడ్ రూంలో పెట్టొద్దు !

Bullet Baba temple: ఈ గుడిలో ప్రసాదంగా మద్యం.. మిస్టరీగా బుల్లెట్ బాబా రహస్య ఆలయం!

Srivari Chakrasnanam: శ్రీవారి చక్రస్నానంలో అద్భుతం.. రెండు కళ్లూ సరిపోవు

Big Stories

×