BigTV English

Surya Bhagavan Pooja : ఆదివారం సూర్యభగవానుడ్ని పూజిస్తే కలిగే ఫలితమిదే!

Surya Bhagavan Pooja : ఆదివారం సూర్యభగవానుడ్ని పూజిస్తే కలిగే ఫలితమిదే!

Surya Bhagavan Pooja హిందూ పురాణాల ప్రకారం వారంలోని ప్రతి రోజుకూ ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా ఆదివారాన్ని పెద్దగా పట్టించుకోం. వారమంతా కష్టపడ్డాం కాబట్టి వీకెండ్ అంటూ సరదాగా గడపాలని కొందరు అనుకుంటూ ఉంటారు.


కాని తెలుగులో ఆదివారం అంటే వారం మొదలయ్యే రోజు. బ్రిటీష్ వాళ్లు వచ్చిన తర్వాతే ఆదివారాన్ని వీకెండ్ చేశారు. మన సంప్రదాయ ప్రకారం వారం మొదలయ్యే రోజును భానువారం ఆదివారం అవుతుంది. ఆదివారం నాడు భానుడి సంచారం ఎక్కువగా ఉండే రోజు. సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత అన్న సంగతి మర్చిపోకూడదు. శ్రీకృష్ణుడు కుమారుడు తన అనారోగ్యాన్ని ఆదివారం నాడు సూర్యభగవనాడుకి పూజ చేసి పోగొట్టుకున్నాడని భాగవతం చెబుతోంది..సమస్త మానవాళికి వెలుగులు ప్రసరిస్తున్న దేవుడు.

సూర్యభగవానుడి లేలేత కిరణాలు తగిలితే ఒంటికి ఆరోగ్యం. అలాగే ఆదివారం నాడు చేసే పూజల్లో ధన ప్రవాహ రహస్యం ఉంది. రావిచెట్టు ముందు దీపం వెలిగించి ఏడు ప్రదక్షణలు చేసి మీ కోరికలు చెప్పుకోవాలి. అవి కచ్చితంగా తీరతాయని పురాణాల్లో ఉంది. రావిచెట్టుకు విష్ణుమూర్తి ప్రతీరూపంగా భావిస్తుంటారు.


ఆదివారం నాడు సూర్య భగవానుణ్ని కూడా మీరు పూజించాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడే మీకు ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇలా నాలుగు వారాలు రావిచెట్టుకి, సూర్యభగవానుడికి పూజలు చేస్తే అసలైన ఫలితాలు కనిపిస్తాయి. ఇలా పూజ చేస్తే ఇంట్లో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. డబ్బుకి కొరత ఉండదు అని పండితులు చెబుతున్నారు. సూర్య దేవుడికి పూజలు చేయడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ బయటకు పోతుందట.

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×