BigTV English

Surya Namaskar : ఈ రోజు చేసే సూర్య నమస్కారంతో లాభాలు ఎన్నో..!

Surya Namaskar : ఈ రోజు చేసే సూర్య నమస్కారంతో లాభాలు ఎన్నో..!
Surya Namaskar

Benefits of Surya Namaskar : ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానుడికి రోజూ నమస్కారం చేయటం వల్ల మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అయితే.. రథ సప్తమి నాడు చేసే సూర్య నమస్కారం వల్ల ఇతర రోజుల్లో చేసే సూర్య నమస్కారం కంటే పదిరెట్ల ఫలితం లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు.


నిజానికి సూర్య నమస్కారం ఒకటే అయినా.. అందులో 12 భంగిమలు ఉంటాయి. వీటిలో 5 నుంచి 8 భంగిమలు కుడి, ఎడమ అనే తేడాలు తప్ప ఒకేలా ఉంటాయి. వీటిలో ప్రతి ఆసనానికీ ఓ ప్రయోజనం సిద్ధిస్తుంది. సూర్య నమస్కారం చేసేటప్పుడు ఆ భంగిమకు ఉన్న సూర్య మంత్రాన్ని పెద్దగా పలకాలి.

Read more : వాగ్దేవి పండుగ.. వసంత పంచమి..!


సూర్యనమస్కారంలోని 12 భంగిమలు

  1. నమస్కారాసనం: ఓం మిత్రాయ నమ: అంటూ సూర్యునికి ఎదురుగా నిటారుగా నిలబడి రెండు చేతులూ జోడించి నమస్కారం చేయాలి. దీనివల్ల మనసు నిలకడ పెరుగుతుంది.
  2. ఉత్థిత హస్తాసనము: ఓం రవయే నమః అంటూ నిలబడిన స్థితి నుంచి కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి, తలను, నడుమును వెనక్కి విల్లులాగా వంచాలి. దీని వల్ల లంగ్స్ బలం పెరుగుతుంది.
  3. పాద హస్తాసనం: తర్వాత ఓం సూర్యాయ నమః అంటూ శ్వాస వదలి రెండు చేతులను కాళ్ళకు దగ్గరగా భూమిమీద ఆనించి, తలను మోకాలుకు ఆనించాలి. కానీ.. కాళ్ళు వంచకూడదు. బీపీ ఉన్నవారు ఈ భంగిమ చేయరాదు. దీని వలన కాళ్లు,చేతులు బలపడతాయి.
  4. అశ్వసంచాలసనము(కుడి) : ఓం భానవే నమ: అంటూ శ్వాస తీసుకుంటూ ఎడమకాలిని వెనకకు చాచవలెను.కుడికాలుకు రెండు పక్కల చేతులు అనించి తలను నేరుగా ఉంచవలెను. దీనివల్ల మల, మూత్ర కోశాలు శుభ్రపడతాయి.
  5. పర్వతాసనం: ఓం ఖగాయ నమః అంటూ కుడి కాలు వెనకకు చాచుతూ రెండు కాళ్ళు ఒకచొటకిచేర్చి ఉంచవలెను. శరీరం భూమి మీద అనకుండా తల నుండి కాలు వరకు నిటారుగా ఉండవలెను. తలను బొడ్డును చూసేలా వంచాలి. శ్వాస పొట్టలోనే అపుకోవాలి. వెన్నెముక, కాళ్లు చేతులు బలిష్టమవుతాయి
  6. సాష్టాంగ నమస్కారం: ఓం పూష్ణే నమః అంటూ శ్వాసను వదులుతూ చేతులు కదపకుండా నెమ్మదిగా శరీరాన్ని చాప మీదకు తీసుకుని వచ్చేటపుడు తల,ఛాతి,మోకాళ్ళు చాపకు తగిలేట్టుగా ఉందవలెను. పిరుదులు పైకెత్తి ఉంచాలి. ఈ భంగిమలో 8 అంగాలు అనగా.. 2 అర చేతులు, 2 పాదములు, 2 మోకాళ్ళు, ఛాతీ, నుదురు మాత్రమే నేలను తాకాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి. ఈ భంగిమతో శరీరంలోని విష, వ్యర్థ వాయువులు తొలగిపోతాయి.
  7. భుజంగాసనం: ఓం హిరణ్య గర్భాయ నమః అంటూ శ్వాస తీసుకుంటూ తల,ఛాతిని చాపమీద నుండి పైకి లేపవలెను. పొత్తి కడుపు చాప మీద ఉండవలెను. దీనివల్ల శ్వాసకోశాలు బలపడతాయి. కాళ్లు, చేతులు మెడ నరాలు చైతన్యవంతమవుతాయి.
  8. పర్వతాసనం: ఓం మరీచయే నమః అంటూ శ్వాస నెమ్మదిగా వదులుతూ పాదాలను సమముగా వెనుకకు జరిపి పిరుదులను పైకి ఎత్తి బొడ్డును చూచునట్లు తలను క్రిందకువంచి శరీరాన్ని పర్వతాకారంగా ఉండేలా చూసుకోవాలి. దృష్టిని కంఠం మీద నిలపాలి.
  9. అశ్వ సంచాలాసనము(ఎడమ): ఓ ఆదిత్యాయ నమః అంటూ శ్వాసను తీసుకుంటూ చేతులు కదపకుండా కుడి కాలును ముందుకు తీసుకునివచ్చి రెండు చేతుల మధ్యలో నుండి తల పైకెత్తవలెను.
  10. పాద హస్తాసనము: ఓం సవిత్రే నమః అంటూ శ్వాస వదులుతూ ఎడమకాలిని కుడి కాలి పక్కన రెండు చేతుల మధ్యన చేర్చాలి. నుదురు మోకాళ్ళకు తాకించాలి. రెండు చేతులు, రెండుకాళ్ళు నిటారుగా ఉంచాలి.
  11. హస్తతానాసనము: ఓం అర్కాయ నమః అంటూ శ్వాస తీసుకుంటూ చేతులు తల పైకెత్తి నిటారుగా నిలబడి వెనుకకు శరీరం సహకరించింత వరకు వంగవలెను.
  12. నమస్కారాసనం: ఓం భాస్కరాయ నమః అంటూ నిటారుగా నిలబడి రెండు చేతులు ఛాతీకెదురుగా నమస్కారముద్రలో ఉంచవలెను.

ఇదే విధంగా రెండవ సారి సూర్యనమస్కారం చేసేటప్పుడు ఎడమ కాలుకు బదులు కుడి కాలును ఉపయోగించవలెను.

Tags

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×