BigTV English

Sri Rama Navami: శ్రీరాముడు ఏమయ్యారో తెలుసా.. ఆయన అంతిమ సమయంలో లక్ష్మణుడు ఏమైనట్లు?

Sri Rama Navami: శ్రీరాముడు ఏమయ్యారో తెలుసా.. ఆయన అంతిమ సమయంలో లక్ష్మణుడు ఏమైనట్లు?

Sri Rama Navami: రాముడెలా మరణిచారో తెలుసా..? ఆయన మరణానికి లక్ష్మణుడు ఎలా కారణం అయ్యాడో తెలుసా..? అసలు రాముడు చనిపోతుంటే లక్ష్మణుడు ఏం చేస్తున్నట్లు..? హనుమంతుడు ఎక్కడికి వెళ్లినట్టు..? రామరావణ యుద్దం ముగిశాక జరిగిన పొరపాటు ఏంటి..? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.


రామ, రావణ యుద్దం ముగిసింది. రావణుడు చనిపోయాడు. ఇక త్రేతాయుగం ముగిసే సమయం వచ్చింది. అప్పుడు పరమ శివుడు, బ్రహ్మ దేవుడు కలిసి యమధర్మరాజును పిలిచి నువ్వు ఇక రాముడి దగ్గరకు వెళ్లాల్సిన సమయం వచ్చిందని చెప్తారు. వారి ఆజ్ఞ మేరకు యముడు భూలోకంలోని రాముడి దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కానీ వెళ్లలేకపోతాడు. దీంతో ఒక రోజు పరమశివుడు రాముడి కలలోకి వచ్చి నీ అవతారం చాలించే సమయం ఆసన్నమైంది రామ. యముడు నీ రాజ్యం బయట నీకోసం ఎదురు చూస్తున్నాడు. కానీ రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు నీ చెంతన ఉండగా.. యముడు నీ మందిరంలోకి కాదు కదా కనీసం నీ రాజ్యంలోకి కూడా అడుగుపెట్టలేకపోతున్నాడు అని చెప్తాడు.

వెంటనే రామునికి మెలుకువ వస్తుంది. దైశాంశ సంభూతుడైన రాముడికి అంతా అర్థం అవుతుంది. ఇక హనుమంతుడిని ఎలాగైనా అయోధ్య నుంచి పంపిచాలని ఆలోచించి తన దగ్గర ఉన్న సీతామాత ఇచ్చిన ఉంగరాన్ని ఒక చిన్న రంద్రంలోకి వేస్తాడు. వెంటనే హతుమంతుడిని పిలిచి హనుమా.. నా ఉంగరం ఈ రంద్రంలో పడిపోయింది. నువ్వు ఆ రంధ్రంలోకి వెళ్లి నా ఉంగరాన్ని తీసుకురాగలవా..? అని అడుగుతాడు. వెంటనే హనుమంతుడు తీసుకురాగలను ప్రభూ అంటూ తన శరీరాన్ని చీమ కన్నా చిన్నగా చేసకుని ఆ రంద్రంలోకి వెళ్లిపోతాడు హనుమంతుడు.


రంద్రంలోకి వెళ్లిన హనుమంతుడు ఎంత దూరం వెళ్లిన ఉంగరం కనిపించదు. ఆఖరికి హనుమంతుడు ఆ రంధ్రం గుండా నాగలోకం చేరుకుంటాడు. ఆ లోకంలో ఉన్న నాగరాజును కలిసి తాను భూలోకం నుంచి వచ్చానని.. మా శ్రీరామ ప్రభువుల వారు తన ఉంగరాన్ని ఈ రంద్రంలో పోగొట్టుకున్నారిన అందుకోసం అన్వేషిస్తూ నేను ఇక్కడి దాకా వచ్చానని చెప్తాడు. దానికా నాగరాజు, హనుమంతుడిని సాదరంగా ఆహ్వానించి కొద్దిదూరం తీసుకెళ్లి అక్కడ శ్రీరాముల వారి ఉంగరం ఉంటుంది తీసుకోమని చెప్తాడు. అక్కడికి వెళ్లి చూసిన హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. అక్కడ వేల కొలది ఉంగారు ఉంటాయి. అవన్నీ కూడా  రాముడి ఉంగరాలాగే ఉంటాయి. అయినా సరే అందులోంచి రాముడి ఉంగరాన్ని వెతకాలని హనుమంతుడు నిర్ణయించుకుంటాడు.

ఇక భూలోకంలో అయోధ్యలో హనుమంతుడు లేడన్న విషయం తెలుసుకున్న యమధర్మరాజు మారు వేషంలో వచ్చి రాముడిని కలుస్తాడు. ఎవ్వరికీ తెలియకుండా తాను యముడినని మీతో ఏకాంతంగా మాట్లాడాలని అడుగుతాడు. రాముడు సరే అనగానే రామా మనం ఇద్దరం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా వస్తే వాళ్లకు మీరు మరణదండన విధించాలని చెప్తాడు. రాముడు సరే అని లక్ష్మణుడిని పిలిచి విషయం మొత్తం చెప్పి స్వయంగా నువ్వే గుమ్మం దగ్గర కాపలా ఉండమని చెప్తాడు. లక్ష్మణుడు సరే అంటాడు. లోపల యముడు, రాముడితో రామా మీ అవతారం ముగించే సమయం వచ్చింది. పరమశివుడు, బ్రహ్మదేవుడి ఆజ్ఞానుసారం నేను మీ దగ్గరకు వచ్చాను అని చెప్తుంటాడు.

ఇంతలో బయట రాముడిని కలవాలని దుర్వాస మహర్షి వస్తాడు. ఆయనక కోపం ఎక్కువ. లక్ష్మణుడు కొద్దిసేపు ఆగండి అని చెప్పినా వినకుండా నన్నే అడ్డుకుంటావా..? నాకు కోపం వస్తే రాముడికే కాదు అయోధ్యకు శాపం పెడతానని రగిలిపోతుంటాడు. దాంతో లక్ష్మణుడు తన వల్ల రాముడికి అయోధ్య ప్రజలకు కష్టాలు రాకూడదని తనకు మరణ దండన పడినా పర్వాలేదనుకుని తలుపులు తెరుచుకుని లోపలికి వెల్లి దుర్వాస మహర్షి వచ్చిన విషయం చెప్తాడు. అయితే అనుకున్న మాట ప్రకారం మధ్యలో వచ్చిన లక్ష్మణుడికి మరణదండన విధించమని యముడు చెప్పి వెళ్లిపోతాడు.

రాముడు బాధతో లక్ష్మణా ఎంత పని చేశావు. ఇప్పుడు నీకు నేను మరణదండన విధించాలి అంటూ ఎమోషనల్ అవుతాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో రాముడు తమ గురువైన వశిష్ట మహర్షిని పరిష్కారం అడుగుతాడు. దీంతో వశిష్టుడు మరణదండనకు పరిష్కారం రాజ్య బహిష్కరణ చేయడం అని చెప్తాడు. అదంతా విన్న లక్ష్మణుడు తాను రాముడిని వదిలి ఉండటం కన్నా మరణించడమే మేలు కదా అనుకుని సరయూ నదిలోకి వెళ్లి జలసమాధి అవుతాడు. లక్ష్మణుడి మరణవార్త విన్న ఆయన భార్య ఊర్మిళాదేవి  కూడా సరయూ నదిలోకే వెళ్లి జలసమాధి అవుతుంది. వారిద్దరి మరణించడంతో శ్రీరాముడు బాధతో కుంగిపోతూ తాను కూడా జలసమాధి అయిపోవాలని నిశ్చయించుకుని సరయూ నది ఒడ్డున నిల్చుని ఉంటాడు.

అదే సమయంలో పాతాళలోకంలో ఉన్న హనుమంతుడు అక్కడున్న ఉంగరాల్లో రాముడి ఉంగరం ఏదో కనిపెట్టలేక నిరుత్సాహంతో ఇక్కడ ఏ ఉంగరం చూసిన నా రాముడి ఉంగరం లాగే ఉంది. అసలు ఇన్ని ఉంగరాలు ఇక్కడకి ఎలా వచ్చాయని నాగరాజు అడుగుతాడు. అప్పుడు ఆ నాగరాజు.. ఇక్కడ ఎన్ని ఉంగరాలు ఉంటే అన్ని త్రేతాయుగాలు ముగిసినట్టు లెక్క. ఇప్పుడు కూడా భూలోకం నుంచి ఉంగరం వచ్చి పడిందంటే ఇక రాముడి నిర్యాణానికి సమయం వచ్చినట్టు.. త్రేతాయుగం ముగుస్తున్నట్టు అని చెప్తాడు. ఆ నాగరాజు మాటలకు హనుమంతుడు వెంటనే భూలోకం వెళ్లిపోతాడు. అయోధ్యలో రాముడి కోసం వెతుకుతాడు. అప్పటికే శ్రీరాముడు సరయూ నదిలో జలసమాధి అవుతాడు.

అలా శ్రీరాముడు తన అవతారాన్ని ముగిస్తాడు. ఇక రాముడి కంటే ముందే లక్ష్మణుడు కూడా జలసమాధి అవుతాడు. ఆంజనేయుడు మాత్రం చిరంజీవుడు కాబట్టి ఆయన భూలోకంలోనే ఉండిపోతాడు. ఇప్పటికీ ఎక్కడ రామ నామ జపం నిష్కల్మషంగా జరుగుతుందో అక్కడకు హనుమంతుడు వస్తాడని భక్తులు నమ్ముతారు.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

Temple mystery: గుడి తలుపులు మూసేసిన వెంటనే వింత శబ్దాలు..! దేవతల మాటలా? అర్థం కాని మాయాజాలం!

Karthika Masam 2025: కార్తీక మాసంలో.. నదీ స్నానం చేయడం వెనక ఆంతర్యం ఏమిటి ?

Diwali 2025: దీపావళికి ముందు ఈ సంకేతాలు కనిపిస్తే.. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థం !

Hasanamba temple: దీపావళి రోజు మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఏడాది పాటు ఆరని దీపం!

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఇలా దీపారాధన చేస్తే.. అష్టకష్టాలు తొలగిపోతాయ్

Dhantrayodashi 2025: ధన త్రయోదశి రోజు ఈ ఒక్కటి ఇంటికి తెచ్చుకుంటే.. సంపద వర్షం

Karthika Masam 2025: కార్తీక మాసంలో చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటి ?

Bhagavad Gita Shlok: కోపం గురించి భగవద్గీతలో ఏం చెప్పారు ? 5 ముఖ్యమైన శ్లోకాలు..

Big Stories

×