Vastu Tips: వాస్తు శాస్త్రం అనేది ఒక పురాతన జ్ఞానం. ఇది సైన్స్, కళల మిశ్రమంగా చెప్పబడుతుంది. వాస్తు శాస్త్రంలో భవన నిర్మాణం నుండి దానిలో నివసించే నియమాల వరకు ప్రతిదాని గురించి ప్రస్తావిస్తుంది. సాధారణంగా.. ఏదైనా కొత్త వస్తువు కొనడానికి, ఇల్లు కట్టడానికి లేదా వస్తువులను అమర్చడానికి ముందు, ఈ నియమాలను పాటిస్తారు. ఇది మాత్రమే కాదు.. ఏదైనా నిర్దిష్ట వ్యక్తికి బహుమతి ఇచ్చే ముందు వాస్తు శాస్త్ర నియమాలను కూడా దృష్టిలో ఉంచుకుంటారు.
నిజానికి ప్రత్యేక సందర్భాలలో ప్రియమైనవారికి బహుమతులు ఇచ్చే సంప్రదాయం శతాబ్దాల నాటిది. ఇది సంబంధాలలో ప్రేమ,నమ్మకాన్ని వ్యాపింపజేస్తుంది. ఒక వ్యక్తికి బహుమతుల ద్వారా కూడా తన భావాలను వ్యక్తపరుస్తాడు. కానీ కొన్నిసార్లు.. తెలిసి లేదా తెలియకుండా..ఇచ్చే బహుమతులు సంబంధాలపై నేరుగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.అందుకే ఎలాంటి బహుమతులను ఇతరులకు ఇవ్వకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
బహుమతుల కోసం వాస్తు చిట్కాలు:
సాధారణంగా నలుపు రంగు వస్తువులు చాలా ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తాయి. కానీ ఈ రంగు వస్తువులను బహుమతిగా ఇవ్వడం అంత మంచిది కాదు.
వాస్తు శాస్త్రం ప్రకారం.. నల్ల రంగు బట్టలు, గడియారాలు, బూట్లు, చెప్పులు ఎవ్వరికీ బహుమతిగా ఇవ్వకూడదు. ఇది సంబంధాలలో దూరాన్ని సృష్టిస్తుంది.
అందరికీ మంచి వాసన వచ్చేలా చేసే పెర్ఫ్యూమ్. అందరూ వాడటానికి ఇష్టపడతారు. కానీ పెర్ఫ్యూమ్ ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు.
Also Read: మీ ఇంట్లో నల్లటి వస్తువులు ఉన్నాయా ? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే ?
వాస్తు ప్రకారం.. ఎవరికీ పర్ కూడా బహుమతిగా ఇవ్వకూడదు. ఇది ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
ముత్యం చూడటానికి ఎంత అందంగా ఉన్నా, దానిని ధరించిన తర్వాత దాని అందం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. కానీ దానిని కన్నీళ్లకు చిహ్నంగా భావిస్తారు. కాబట్టి మీరు ఎవరికీ ముత్యాలను బహుమతిగా ఇవ్వకూడదు.
వాస్తు ప్రకారం.. హ్యాండ్ కర్చిఫ్ ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. జ్యోతిష్యశాస్త్రంలో దీనిని అశుభంగా భావిస్తారు. ఇది సంబంధాలను దెబ్బతీస్తుందని నమ్ముతారు.