Anasuya: బుల్లితెర నటి అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులర్ అయ్యారు. షో ప్రారంభం నుండి అనసూయ కొన్ని సంవత్సరాలు యాంకరింగ్ చేశారు. ఈ షోలో వచ్చిన క్రేజ్.. ఆమె సినీ రంగంలో అడుగు పెట్టేలా చేసింది. ప్రస్తుతం తెలుగులో బడా మూవీస్ లో నటిస్తుంది. మరోవైపు బుల్లితెరపై స్టార్ మా లో కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో లో పాల్గొంటున్నారు. ఈ షోలో బాయ్స్ తరఫున శేఖర్ మాస్టర్. గర్ల్స్ వైపు అనసూయ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షో ప్రోమోలో బిగ్ బాస్ పృద్వి అనసూయను షోలో అందరి ముందు ఎత్తుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
లక్ అంటే నీదే పృథ్వీ..
కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ స్టార్ మా లో ప్రతి శని ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. ఈ షోలో కంటెస్టెంట్స్ తో డాన్సులు స్కిట్స్ గేమ్స్ వాడిస్తూ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఈ షోలో శేఖర్ మాస్టర్ ఎప్పుడూ అనసూయతో డాన్స్ చేస్తూ, ఆమెని ఆట పట్టిస్తూ ఉంటారు. అనసూయ కూడా శేఖర్ మాస్టర్ తో ఓ రేంజ్ లో గొడవ పడుతూ డాన్స్లు చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా రేపు శని, ఆదివారాలు రాబోతున్న ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమోలో అనసూయ ఎంట్రీ సాంగ్ లోపృద్వి డాన్స్ చేస్తూ ఆమెకు తెలియకుండా ఆమెని వెనుక నుంచి ఎత్తుకుంటాడు. ఆశ్చర్యపోయిన అనసూయ పృద్వి తో కలిసి డాన్స్ చేస్తుంది. పృద్వి ఆమెని డాన్స్ చేస్తూ తిప్పుతాడు. తర్వాత ఆమె కిందకి దింపేస్తాడు. అక్కడే ఉన్న శ్రీముఖి, శేఖర్ మాస్టర్ తో ఇలాంటి సౌకర్యం మీరు మా అమ్మాయిలకు ఎప్పుడైనా ఇచ్చారా అని అడుగుతుంది. ఇలా మీరు ఎప్పుడైనా మా అమ్మాయిలతో డాన్స్ చేశారా కానీ అనసూయ చూడండి బాయ్స్ తో ఎలా డాన్స్ చేశారు అని అంటుంది. పృద్వి ఏం చేసావు నువ్వు అని రోహిణి అడుగుతుంది. నేనేం చేయలేదు అని అంటాడు ఏం అమాయకంగా చెప్తున్నావ్, చేసిందంతా చేసి అని రోహిణి అంటుంది. శేఖర్ మాస్టర్ పృద్వి ఇప్పటివరకు డాన్స్ చేశాడు కానీ అనసూయ టచ్ అవ్వగానే మూన్ వాక్ వచ్చేసింది పృద్వికి అని అంటారు. ఎగ్జాక్ట్లీ ఇదంతా అనసూయ వల్లే అని అక్కడున్న వారంతా అంటారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్నోసార్లు శేఖర్ మాస్టర్ అనసూయ కలిసి డాన్స్ చేశారు కానీ ఒకసారి కూడా అనసూయని శేఖర్ మాస్టర్ ఎత్తుకోలేదు. ఆయనకు దక్కని అదృష్టం పృథ్వీకి దక్కిందని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
రంగమ్మత్త గా పాపులర్ ..
అనసూయ జబర్దస్త్ తో ఎంతో పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. ఆమె నటించిన సినిమాల్లో రంగస్థలం సినిమా ఆమెకు ఎంతో పేరు తెచ్చింది. ఆ మూవీలో రంగమ్మత్త క్యారెక్టర్ లో అనసూయ ప్రశంసలు అందుకుంది. ఎఫ్2, యాత్ర, కిలాడి, దర్జా, వాంటెడ్ పండుగాడు, ఫ్లాష్ బ్యాక్, రంగమార్తాండ, విమానం వంటి సినిమాలలో ఆమె పాత్రలకు మంచి పేరు వచ్చాయి. తాజాగా పుష్ప సినిమాలో విలన్ క్యారెక్టర్ లో అనసూయ నటించి మెప్పించారు. పుష్ప సీక్వెల్ పుష్ప2 లోను దక్షయని గా ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. గత సంవత్సరం రజాకర్, పుష్ప 2 సింబ , సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్నా అనసూయ మరికొన్ని సినిమాలలో నటించనున్నారు. ఓవైపు షోస్ చేస్తూ మరోవైపు సినిమాలో నటిస్తూ తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానాన్ని అనసూయ సంపాదించుకోవడం విశేషం.
Roshan :పెద్ద డైరెక్టర్ తో మొదటి సినిమా ఫ్లాప్.. ఈసారైనా గట్టెక్కుతాడా.?
?igsh=ZjFkYzMzMDQzZg==