BigTV English

Idols for Money: కోటీశ్వరుల ఇంట్లో కచ్చితంగా ఉండే విగ్రహాలు ఇవే, అందుకే వారికి డబ్బుకు లోటుండదు

Idols for Money: కోటీశ్వరుల ఇంట్లో కచ్చితంగా ఉండే విగ్రహాలు ఇవే,  అందుకే వారికి డబ్బుకు లోటుండదు

లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ఆ వ్యక్తి ఆనందంగా జీవించగలడు. డబ్బుకు లోటు లేకుండా ఉండగలడు. లక్ష్మీదేవి ఆశీస్సులు దొరకాలంటే అంత సులువు కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇంట్లో ఏడు రకాల విగ్రహాలు ఉండడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుందని చెప్పుకుంటారు. ఈ విగ్రహాలు సానుకూల శక్తిని ప్రసారం చేస్తాయని, ఆ ఇంట్లోని వారికి ఉద్యోగం వ్యాపారంలో పురోగతికి అనుమతిస్తాయని అంటారు. కోటీశ్వరుల ఇంట్లో లక్ష్మీదేవి ప్రసన్నం చేసే ఈ విగ్రహాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు కూడా డబ్బుకు లోటు లేకుండా ఆనందంగా జీవించాలనుకుంటే ఈ విగ్రహాలను ఇప్పుడే కొని ఇంట్లో పెట్టుకోండి.


ఏనుగు
ఏనుగు విగ్రహం రాగితో చేసినదైనా, ఇత్తడిదైనా, వెండిదైనా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఏనుగును శక్తికి, గొప్పతనానికి, శ్రేయసుకు చిహ్నంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఏనుగు విగ్రహం ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఏనుగు పై ఉంటాయని నమ్ముతారు. కాబట్టి ఏనుగు బొమ్మ ఉన్న ఇంట్లో డబ్బుకు లోటుండదు.

తాబేలు బొమ్మ
తాబేలు బొమ్మ ఏ లోహంతో చేసినదైనా ఫర్వాలేదు… ఇంట్లో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే తాబేలును విష్ణువు అవతారంగా చెప్పుకుంటారు. విష్ణువు కూర్మావతారం తాబేలు. విష్ణువు ఎక్కడ ఉంటారో అతని పక్కన లక్ష్మి కూడా నివసిస్తుంది. తాబేలు విగ్రహం వ్యాపారంలో వృద్ధిని, స్థిరత్వాన్ని, శ్రేయస్సును తెస్తుంది. కాబట్టి మీ ఇంట్లో లేదా కార్యాలయంలో తాబేలు బొమ్మ ఉండేలా చూసుకోండి.


కామధేనువు
పౌరాణికి నమ్మకాల ప్రకారం కామధేనువు కోరికలను తీర్చే ఆవు. కామధేనువును ఇంట్లో ఉంచుకోవడం సంపద, శ్రేయస్సును పెంచేలా చేస్తుంది. భౌతిక ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఈ విగ్రహం ఎన్నో రకాలుగా శాంతిని ఇంటికి అందిస్తుంది.

పిరమిడ్
పిరమిడ్ ను శక్తి కేంద్రంగా చెప్పుకుంటారు. దీన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఆస్తి సంబంధిత గొడవలు కూడా రావు. అలాగే ఆస్తి సంబంధిత పనుల్లో తప్పకుండా విజయం దక్కుతుంది. క్రిస్టల్ పిరమిడ్ లక్ష్మీదేవి ఆశీస్సులను అందిస్తుందని చెప్పుకుంటారు. కాబట్టి పిరమిడ్లు స్పటికం లేదా లోహంతో చేసినవి కొని ఇంట్లో పెట్టుకోవడం ఉత్తమం.

గుడ్లగూబ
గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు. తెలివితేటలకు ఆకస్మిక ధన ప్రవాహానికి గుడ్లగూబను చిహ్నంగా చెప్పుకుంటారు. కోటీశ్వరుల ఇంట్లో గుడ్లగూబ బొమ్మలు కచ్చితంగా ఉంటాయి. మీ ఇంట్లో లేదా కార్యాలయంలో గుడ్లగూబ విగ్రహాన్ని ఉంచుకునేందుకు ప్రయత్నించండి. ఇది పెట్టుబడుల నుండి లాభాలు తెచ్చేలా చేస్తుంది. మీ ఆదాయాన్ని పెంచుతుంది.

గణేశుడు విగ్రహం
గణేశుడిని అడ్డంకులను నాశనం చేసే వ్యక్తిగా చెప్పుకుంటారు. ఏదైనా పని ప్రారంభించేముందు మొదటిగా గణేషుడినే పూజించమని అంటారు. కోటీశ్వరుల ఇంట్లో కచ్చితంగా గణేష్ విగ్రహం ఉంటుంది. దీనివల్ల ఏ పనుల్లోని ఆటంకాలు ఏర్పడవు. విజయం ఖచ్చితంగా దక్కుతుంది.

లక్ష్మీదేవి విగ్రహం
సంపదకు అధి దేవత లక్ష్మీదేవి. కోటీశ్వరుల ఇంట్లో లక్ష్మీదేవికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈమెను విష్ణువుతో కలిపి ఉంచితేనే మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రార్థన స్థలంలో లేదా మీరు డబ్బులు దాచే చోట, బంగారాన్ని పెట్టే చోట లక్ష్మీదేవిని ఉంచితే అన్ని రకాలుగా మంచిది. క్యాష్ కౌంటర్ దగ్గర లక్ష్మీదేవిని ఉంచడం కూడా ఉత్తమం. ఇది సంపద శ్రేయస్సును రెట్టింపు చేస్తుంది.

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×