BigTV English
Advertisement

Sravana Masam 2024: పరమ శివుడి ఆశీస్సుల కోసం శ్రావణ సోమవారం నివేదించాల్సినవి ఇవే..

Sravana Masam 2024: పరమ శివుడి ఆశీస్సుల కోసం శ్రావణ సోమవారం నివేదించాల్సినవి ఇవే..

Sravana Masam 2024: శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసంగా చెబుతారు. ఈ మాసంలో శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. ప్రతి సోమవారం ఉపవాసాలు ఆచరిస్తూ పరమేశ్వరుడి ఆశీర్వాదం కోసం అభిషకాలు కూడా నిర్వహిస్తారు. ఈ శ్రావణ మాసంలో శివుడి కొన్ని పదార్థాలను సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం పొందుతామని నమ్ముతారు.


పాలు:శివుడికి సమర్పించే అత్యంత సాధారణ నైవేద్యాలలో పాలు కూడా ఒకటి. పాలతో అభిషేకం చేయడం వల్ల శివుడు సందోషిస్తాడని చెబుతుంటారు. హిందూ విశ్వాసాల ప్రకారం క్షీర సాగర మథన సమయంలో వచ్చిన విషాన్ని శివుడు స్వీకరించాడు. దాని వల్ల కలిగిన వేడిని తగ్గించుకోవడానికి చల్లటి పాలు, నీరు మహాదేవుడికి అభిషేకిస్తారు.
పెరుగు: శ్రావణ మాసంలో శివుడికి సమర్పించే మరో పదార్థం పెరుగు. అయితే శివుడికి ఆవు పెరుగు మాత్రమే సమర్పించాలి. పాలు మాదిరిగానే పెరుగు కూడా శివుడి వేడిని తగ్గిస్తుందని చెబుతుంటారు.  పెరుగు సమర్పించడం వల్ల పరమేశ్వరుడికి తమ కోరికలు చేరుతాయని నమ్ముతారు. అంతే కాకుండా పెరుగు మంచి ఆరోగ్యానికి చిహ్నం. శివ లింగానికి పెరుగు సమర్పించడం వల్ల మెరుగైన ఆరోగ్యం లభిస్తుంది.
పంచామృతం: ఐదు పదార్థాలతో తయారు చేసే పంచామృతం ప్రకృతిలో చాలా స్వచ్ఛమైంది. పాలు పెరుగు, నెయ్యి, తేనె, బెల్లంతో దీనిని తయారు చేస్తారు. ఈ పదార్థాల్లో ప్రతి దానికి ప్రాముఖ్యత ఉంది. పాలు స్వచ్ఛతకు, ఆరోగ్యానికి పెరుగు, మంచి సంబంధాలకు తేనె, మంచి పోషణకు నెయ్యి, జీవితంలో ఆనందానికి తీపి ప్రతీకగా నిలుస్తాయి. పంచామృతాన్ని హిందూ మతంలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. శివుడికి పంచామృతం సమర్పించడం వల్ల సంపూర్ణ శ్రేయస్సు లభిస్తుంది.
తేనె: తేనె కూడా పవిత్రమైనదిగా భావిస్తారు. శివుడికి తేనెను సమర్పించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. బంధాలు మరింత మధురంగా తయారవుతాయి. అందుకే శివుడికి తేనెను సమర్పించాలని చెబుతుంటారు.
నెయ్యి:
నెయ్యి స్వచ్ఛత, పోషణకు చిహ్నంగా చెబుతారు. శివలింగానికి నెయ్యి సమర్పించడం వల్ల వారి ప్రార్థనలు మరింత బలంగా మారుతాయని నమ్ముతారు. నెయ్యి సానుకూల శక్తులను ఆకర్షిస్తుంది.

Also Read:ఈ వాస్తు నియమాలు పాటిస్తే ఇంట్లో డబ్బుకు ఏ లోటూ ఉండదు


బిల్వ పత్రం:శివుడికి అత్యంత ప్రీతికరమైంది బిల్వపత్రం. విష్ణుమూర్తికి తులసి ఆకులు ఏ విధంగానో శివుడికి బిల్వ పత్రాలు ఆ విధంగా.. శివుడికి పొరపాటున కూడా తులసి ఆకులు సమర్పించకూడదు. ఇది అశుభంగా భావిస్తారు. బిల్వ పత్రం శివుడి మూడు కన్నులకు చిహ్నంగా భావిస్తారు. అందుకే ఈ పత్రాన్ని సమర్పించి పూజ చేయడం వల్ల శివుడు ప్రసన్నం అవుతారని నమ్ముతారు. శ్రావణమాసంలో శివుడికి 3 నుంచి 11 బిల్వ పత్రాలు సమర్పించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×