BigTV English

Health: జ్వరం వస్తే ఊహించని ప్రయోజనాలు ఉంటాయని తెలుసా..

Health: జ్వరం వస్తే ఊహించని ప్రయోజనాలు ఉంటాయని తెలుసా..

Health: వర్షాకాలం వచ్చింది అంటే చాలా రకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. ముఖ్యంగా జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలు ఎదురైనపుడు చాలా జాగ్రత్తలు పాటిస్తుంటాం. వర్షంలో తడవడం లేదా దోమలు వంటి వాటి వల్ల డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి అనేక రకాల ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధులు వంటివి సోకుతుంటాయి. అయితే ఇవన్నీ కొంచెం ప్రమాదకరమైన కూడా సాధారణంగా తరచూ వచ్చే జ్వరానికి కూడా చాలా మంది భయపడుతుంటారు. కానీ ఇతర ఏ రోగాలు వచ్చినా కూడా భయాందోళనకు గురికావచ్చు కానీ జ్వరం వంటివి వస్తే మాత్రం దీని వల్ల శరీరానికి ప్రయోజనాలే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


సాధారణంగా వచ్చే జ్వరం వల్ల శరారంలోని రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. అంతేకాదు ముఖ్యంగా ఇతర ప్రాణాంతకర వ్యాధుల బారి నుంచి కూడా బయటపడవచ్చని ఓ అధ్యయనంలో తేలింది. జ్వరం రావడం వల్ల రోగనిరోధక వ్యవస్థను ఎలా ఎదుర్కోవాలో దానికి ప్రిపేర్ చేస్తుంది. ఈ మేరకు ఎక్స్‎పరిమెంటల్ మెడిసిన్ అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా చెడు బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు వంటి వాటి వల్ల కోల్పోయిన శక్తిని కూడా అందిస్తుంది. దీంతో రోగ నిధోక శక్తి ఉత్తేజితం అవుతుంది.

అంతేకాదు శరీరంలో పేరుకుపోయిన చెడు, విష పదార్థిలు కూడా బయటకు తొలగిస్తుంది. జ్వరం కారణంగా శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల ఇమ్యూన్ సెల్స్ యాక్టివిటీని పెంపొదిస్తుంది. శరీరంలో యాంటీ వైరల్, బ్యాక్టీరియల్ వంటి వాటిని పెంచుతుంది. మరోవైపు హీట్ షాక్ ప్రోటీన్స్ కూడా పెరుగుతాయి. జ్వరం వల్ల ముఖ్యంగా ఆరు లాభాలు ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థకు కవచంలా ఉండే తెల్ల రక్తకణాలు అప్రమత్తంగా ఉంటాయి. ఎముకలను బలోపేతం చేసేందుకు తెల్ల రక్తకణాలు పెరుగుదల కూడా సహాయపడుతుంది. అయితే ఈ ప్రయోజనాలు అన్నీ కలగాలంటే కూడా శరీర ఉష్ణోగ్రత కూడా 37°cగా ఉండాలని నిపుణులు అంటున్నారు.


Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×