Train Tickets Booking: భారత్ లో పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. UPI వ్యవస్థ అందుబాటులోకి రావడంతో సులభంగా పేమెంట్స్ చేస్తున్నారు. ఇంకా ఈజీగా చెల్లింపులు చేసేలా కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేర్పులు చేస్తోంది. అందులో భాగంగానే వాయిస్ కమాండ్ తో చెల్లింపులు చేసేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. తాజాగా ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ 2024లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC), CoRover సంయుక్తంగా వాయిస్ ఎనేబుల్ UPI చెల్లింపు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చాయి. ఈ కొత్త ఫీచర్ ద్వారా కేవలం వాయిస్ కమాండ్ తో ఈజీగా పేమెంట్స్ చేసే అవకాశం ఉంటుంది. మనం చెప్పే మొబైల్ నంబర్ కు లింక్ చేయబడిన UPI ID ద్వారా ఆటో మేటిక్ గా పేమెంట్స్ చేసే వెసులుబాటు కలుగుతుంది. గతంతో పోల్చితే మరింత ఈజీగా పెమెంట్స్ చెయ్యొచ్చు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పేమెంట్స్
ఈ వాయిస్ కమాండ్ ఫీచర్ AskDISHA, IRCTCకు సంబంధించిన AI- పవర్డ్ వర్చువల్ అసిస్టెంట్ తో లింక్ చేస్తారు. CoRoverకు సంబంధించిన BharatGPT, సావరిన్ AI- పవర్డ్ వర్చువల్ అసిస్టెంట్‌తో అనుసంధానించబడి పని చేస్తుంది. ఈ సిస్టమ్ ఇంగ్లీష్, హిందీ, గుజరాతీతో పాటు ఇతర భాషలలో వాయిస్ ఇన్ ఫుట్స్ తీసుకుని పేమెంట్స్ చేస్తుంది. క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, వాలెట్ల వంటి ఆల్టర్నేటివ్ పేమెంట్స్ కు కూడా సపోర్టు చేస్తుంది. వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని కలిగిస్తుంది. దీని ద్వారా ప్రయాణీకులు టికెట్లను బుక్ చేయడంతో పాటు పేమెంట్స్ చెయ్యొచ్చు. డిజిటల్ చెల్లింపుల విధానంలో AI-ఆధారిత డిజిటల్ చెల్లింపులు ఓ మైల్ స్టోన్ గా నిలువబోతున్నాయి. అంతేకాదు, ఈజీగా టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు పేమెంట్స్ చేసే అవకాశం ఉంటుంది. డిజిటల్ లావాదేవీలను మరింత వేగవంతం చేస్తుంది.
డిజిటల్ పేమెంట్స్ లో మరో మైలురాయి
వాయిస్ కమాండ్ పేమెంట్స్ విధానం అమల్లోకి రావడం పట్ల NPCI చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ విశాల్ ఆనంద్ కన్వాటి సంతోషం వ్యక్తం చేశారు. డిజిటల్ పేమెంట్స్ మరింత సులభతరం చేయడానికి ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు వెల్లడించారు. దేశ పౌరులు అందరూ ఈ విధానం ద్వారా ఈజీగా పేమెంట్స్ చేసుకునే అవకాశం ఉందన్నారు. వాయిస్ కమాండ్ ఫీచర్ ద్వారా ఈజీగా రైల్వే టికెట్లు బుర్ చేసుకునే అవకాశం ఉందని IRCTC ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ తెలిపారు. వాయిస్ కమాండ్ సిస్టమ్ ద్వారా ఈజీగా పేమెంట్స్ చేసుకోవచ్చన్నారు. ఈ విధానాన్ని ఇతరులు మిస్ యూజ్ చేసే అవకాశం లేదన్నారు. వాయిస్ కమాండ్ పేమెంట్స్ డిజిటల్ చెల్లింపులలో కీలక మలుపుకాబోతుందని CoRover CEO అంకుష్ సబర్వాల్ తెలిపారు. ఈ విధానం ద్వారా అత్యంత వేగంగా, సురక్షితంగా పేమెంట్స్ చేసుకునే అవకాశం ఉందన్నారు.
Read Also: ఇక ట్రైన్ టికెట్ పై పేరు, డేట్ మార్చుకోవచ్చు, కొత్త రూల్ తెచ్చిన ఇండియన్ రైల్వే