Kaantha Teaser: దుల్కర్ సల్మాన్(Dulquer Salman) మలయాళ నటుడు అయినప్పటికీ ఈయన తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకొని ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున తెలుగు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దుల్కర్ సల్మాన్, కీర్తి సురేష్ హీరోగా నటించిన మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా ఈ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన అనంతరం సీతారామం(Sitaramam) అనే పూర్తిస్థాయి తెలుగు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ద్వారా ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో పెద్ద ఎత్తున తెలుగు సినిమాలపై ఫోకస్ చేస్తూ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
పుట్టినరోజు ప్రత్యేకం..
ఇక ఇటీవల లక్కీ భాస్కర్(Lucky Bhaskar) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దుల్కర్ సల్మాన్ త్వరలోనే కాంత(Kaantha) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీ విడుదల కాబోతోంది. నేడు దుల్కర్ పుట్టినరోజు కావడంతో తాజాగా సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ టీజర్ వీడియో కనుక చూస్తే .. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరోగా, సముద్రఖని (Samuthirakani)దర్శకుడుగా కనిపించబోతున్నారని తెలుస్తోంది.
హర్రర్ సినిమాగా..
వీరిద్దరూ కెరియర్ మొదట్లో ఎంతో మంచి స్నేహితులుగా ఉండేవారని అయితే కొన్ని కారణాలవల్ల బద్ధ శత్రువులుగా మారారని ఈ టీజర్ చూస్తేనే స్పష్టమవుతుంది. ఇక సముద్రఖని దర్శకుడిగా దుల్కర్ హీరోగా శాంత అనే హర్రర్ సినిమా షూటింగ్ జరుగుతుంటుంది. అయితే ఇందులో దర్శకుడు చెప్పిన విధంగా కాకుండా హీరో దుల్కర్ సల్మాన్ చెప్పిన విధంగా షూటింగ్ జరుగుతుందని ఈ టీజర్ వీడియో ద్వారా చూపించారు. ఇక ఈ శాంత అనే సినిమాలో హీరో హీరోయిన్లుగా దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ నటించబోతున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇక చివరిలో దుల్కర్ ఇది మీరు అనుకుంటున్న శాంతా కాదు…కాంత ప్రేక్షకులకు ఇలాగే నచ్చుతుంది అంటూ ఈయన చెప్పుకు వచ్చారు.
ప్రస్తుతం ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ టీజర్ చూస్తుంటే మాత్రం చాలా విభిన్నంగా సినిమా ఉండబోతుందని స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ (Selvamani Selvaraj) దర్శకత్వం వహించగా రానా దగ్గుబాటి(Rana Daggubati), దుల్కర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా ఈ సినిమా టీజర్ చూస్తే మాత్రం దుల్కర్ సల్మాన్ ఖాతాలో మరో హిట్టు పడటం గ్యారెంటీ అని అభిమానులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 12వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తి చేసుకుందని త్వరలోనే వరుస అప్డేట్లతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.
Also Read: Durga Rao:యూట్యూబ్ సంపాదనతో రెండు ఇల్లు కొన్న దుర్గారావు..నెల ఆదాయం ఎంతంటే?