Big Stories

Sri Krishnarjuna:శ్రీకృష్ణార్జున యుద్ధం చెప్పిన నీతి ఏంటి…

Sri Krishnarjuna:శ్రీకృష్ణుడంటే సాక్షాత్తూ మహా విష్ణువు స్వరూపమే. అలాగే మహాభారతంలో అర్జునుడు చాలా శక్తివంతమైన యోధుడు. ప్రపంచంలో బాణాలు వేసే అస్త్ర విద్యను ప్రదర్శించడంలో అర్జునుడికి మించిన వాడు లేడంటారు. అయితే మహాభారతంలో ఇద్దరూ మంచి స్నేహితులే కాదు, బావమరుదులు కూడా. అర్జునుడు ఇద్దరూ ఓ సారి యుద్ధం చేశారు. అతని పేరు గయుడు. ఓ గంధర్వుడు. ఆకాశ మార్గంలో ఓ రోజున ప్రయాణిస్తూ కిందకు ఉమ్ముతాడు. అయితే అదే సమయంలో కింద నదిలో శ్రీకృష్ణుడు సంధ్యా వందనం చేస్తుంటాడు. దోసిలిలో నీటిని పట్టి సూర్యున్ని ప్రార్థిస్తుంటాడు. అదే సమయంలో గయుడు ఉమ్మి వేసే సరికి అది నేరుగా వచ్చి కృష్ణుని దోసిలిలో పడుతుంది. దీంతో శ్రీకృష్ణుడు గయున్ని చంపేస్తానని ప్రతిన బూనుతాడు.

- Advertisement -

గయుడు వెంటనే నారదుని వద్దకు వెళ్లి సలహా అడుగుతాడు. అప్పుడు నారదుడు గయున్ని అర్జునుడి దగ్గరకు వెళ్లి మొదట శరణు కోరమని, తరువాతే కృష్ణుడి పేరు చెప్పమని అంటాడు. గయుడు అ ప్లాన్ ప్రకారం అర్జునుడి కలిసి ప్రాణరక్షణ కల్పించాలని కోరతాడు. దీంతో మొదట విస్తుపోయిన అర్జునుడు ఇచ్చిన మాటకు కట్టుబడి గయుడి తరఫున కృష్ణుడితో యుద్ధం చేసేందుకు సిద్ధమవుతాడు.

- Advertisement -

కృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ యుద్ధం చేయబోతున్నారని తెలిసి అటు రుక్మిణి, ఇటు సుభద్రతోపాటు మరోవైపు నారదుడు కూడా ఇద్దరికీ సర్ది చెప్పాలని చూస్తారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. కృష్ణుడు వేసే అస్త్రాలను అర్జునుడు నాశనం చేస్తుంటాడు. అలాగే అర్జునుడు వేసే అస్త్రాలను కృష్ణుడు నాశనం చేస్తుంటాడు. ఇలాగైతే లాభం లేదనుకుని కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని అర్జునుడిపైకి సంధిస్తాడు.అప్పుడు అర్జునుడు తనకు మహా శివుడు ఇచ్చిన పాశుపతాస్త్రాన్ని కృష్ణుడిపైకి పంపుతాడు.

ప్రపంచం నాశనం అవుతుందని గ్రహించిన బ్రహ్మ వెంటనే యుద్ధం జరిగే స్థలం వద్ద ప్రత్యక్షమై యుద్ధాన్ని ఆపాలని కోరగా.. కృష్ణుడు, అర్జునుడు తాము వేసిన అస్త్రాలను వెనక్కి తీసుకుంటారు. అనంతరం బ్రహ్మ గయున్ని కృష్ణుడికి ఇచ్చేయమని అర్జునుడికి చెప్పగా అర్జునుడు గయున్ని కృష్ణుని వద్దకు పంపుతాడు. అప్పుడు కృష్ణుడు గయున్ని చంపుతాడు. అనంతరం బ్రహ్మ మళ్లీ కమండలంలో ఉండే జలాన్ని చల్లి గయున్ని బతికిస్తాడు. దీంతో అటు కృష్ణుడు, ఇటు అర్జునుడు ఇద్దరి ప్రతిజ్ఞలు నెరవేరుతాయి

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News