Good Luck Signs: జీవితంలో అష్టకష్టాలు పడుతున్నారా..? మీకు మంచి రోజులు ఎప్పుడొస్తాయోనని ఎదురుచూస్తున్నారా..? అయితే ఈ సంకేతాలు మీకు కనిపిస్తే ఇక మీ జీవితంలో అతి త్వరలోనే ధనవంతులు అవుతారట. కోట్ల సంపదలకు అధిపతులు అవుతారట. ఇంతకీ ఆ శకునాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం.
లక్ష్మీ దేవిని, ధన లక్ష్మీ అని కూడా అంటారు. ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీ దేవి నివాసం ఉంటుందో వారి ఇంట్లో ధనానికి ధాన్యానికి ఎప్పుడు కొరత ఉండదనేది పెద్దల నానుడి. అలాగే వారి జీవితంలో సుఖశాంతులను ఎప్పుడు కలిగి ఉంటారు. ప్రతిరోజు లక్ష్మీ నారాయణులకు ఎవరైతే పూజలు చేస్తారో అలాంటి వారికి కూడా అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని చెప్తుంటారు. అలాంటి వారికి సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదని పండితులు చెప్తుంటారు. వారి కీర్తి ప్రతిష్టలు నలుదిక్కులా వ్యాపిస్తాయి. జ్యోతిష్యశాస్త్రంలో చెప్పబడిన విధంగా ఏ వ్యక్తి మీద అయితే లక్ష్మీదేవి కృపా ఎక్కువగా ఉంటుందో ఆ వ్యక్తికి ధనం కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. దానికి ముందు శుభసంకేతాలు కనిపిస్తాయి. మీకు కూడా అలాంటి సంకేతాలు కనిపిస్తే మంచి జరుగుతుంది.
మొదటి సంకేతం: అనుకోకుండా మీ ఇంటికి నల్లటి చీమలు వచ్చి వరస కట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మీకు అపారమైన ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం. మీ జీవితంలో ఏదో ఒక లాభదాయకమైన మార్పు ఏర్పడుతుందని అర్థం. అలా ఇంట్లోకి బారులు తీరిన నల్లచీమలకు మీరు ఆహారం వేయడం ఇంకా మంచిది.
రెండవ సంకేతం: రెండు పక్షులు మీ ఇంటి ముందున్న చెట్టు మీద గూడు కట్టుకోవడం. శుభసంకేతంగా చెప్తారు. అలాగే ఊర పిచ్చుకులు ఇంట్లోకి వచ్చి గూడు కట్టుకోవడం కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతంగా భావించాలి.
మూడవ సంకేతం: ఇంట్లోకి బల్లులు వస్తే బయటకు వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ అలా బల్లులు ఇంట్లోకి రావడం కూడా శుభసూచకం అంటున్నారు పండితులు. హిందూ శాస్త్రాలలో బల్లి లక్ష్మీదేవి స్వరూపంగా బావిస్తారు. అలాగే మీ పూజగదిలో బల్లి కనిపిస్తే మీరు కొలిచే దైవం అక్కడ ఉన్నాడని సంకేతం. ఇక ఇంట్లో ఓకేసారి మూడు బల్లలు కనబడటం కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతం అంటారు. ఇక దీపావళి రోజు బల్లిని తులసి చెట్టు దగ్గర చూస్తే అత్యంత శుభదాయకం అని అర్థం.
నాలుగవ సంకేతం: మన అరికాళ్లు లేదా అర చేతులలో దురద పెట్టడం కూడా లక్ష్మీ దేవి రాకకు సంకేతంగా భావించాలి. అయితే ఎడమ చేతిలో దురద పెడితే ధనప్రాప్తి కలుగుతుంది. తొందర్లోనే ఎక్కడి నుంచైనా ధనం వస్తుందని తెలుసుకోవాలి.
ఐదవ సంకేతం: కలలో చీపురు, గుడ్లగూడ, పిల్లనగ్రోవి, ఏనుగు, ముంగిస,శంఖము, బల్లి, నక్షత్రము, పాము కనబడితే ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం. అలాగే ఉదయం సాయంత్రం శంఖంరావం వినిబడినచో అది లక్ష్మీ దేవి ఆగమానికి సంకేతంగా బావించాలి. ఎప్పుడైనా మీరు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు చెరుకు కనబడితే ఇది కూడా ధన ప్రాప్తికి సంకేతం. ఇక బయటకు వెళ్తున్నప్పుడు కుక్క తన నోటితో ఆహారం తీసుకుని వెళ్తూ ఎదురొస్తే అది అకస్మిక ధనప్రాప్తికి సూచకంగా బావించాలి. ఇక ఉదయమే మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఊడ్చే వాళ్లు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు అవుతారని బావించాలి.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలుఒక్కటి కాదా? కళ్ళుబైర్లుకమ్మేనిజాలు