Pawan Kalyan : పవన్ కల్యాణ్. ఎన్నో పుస్తకాలు చదివారు. జానపద సాహిత్యం నుంచి చేగువేరా ఉద్యమం వరకు అనేక విషయాల్లో పట్టు సాధించారు. తెలంగాణ సాయుధ పోరాటం గురించి అనర్గళంగా మాట్లాడుతారు. శ్రీకాకుళం నక్సల్‌బరీ ఉద్యమంపై గంటల తరబడి ఉపన్యాసం ఇవ్వగలరు. తనకు ఆసక్తి ఉన్న అనేక అంశాలపై లోతుగా పరిశోధన చేసే తత్వం పవన్ కల్యాణ్‌ది. ఇదే ఆయన్ను గుంపులో నుంచి వేరు చేసి ప్రత్యేకంగా నిలబెడుతుంది. లేటెస్ట్‌గా అలాంటిదే మరో విషయం వెల్లడైంది.
మోదీకి మరో పేరు..
ప్రధాని నరేంద్ర మోదీ. షార్ట్ కట్‌లో నమో అంటారు. మరి, ఆయన పూర్తి పేరు తెలుసా? అందరికీ కానీ పోయినా, చాలా మందికి తెలిసే ఉంటుంది. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని. మరి.. మోదీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? అంటే.. RSSలో చేశారు. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఛాయ్ అమ్మారు. హిమాలయాల్లో సన్యాసిగా కొన్నా్ళ్లు ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలో యాక్టివ్‌గా మారి గుజరాత్ సీఎం అయ్యారు. ఇప్పుడు ప్రధానిగా ఉన్నారు. ఇలా కొన్ని అంశాలు గడగడా చెప్పేస్తుంటారు చాలామంది. మరి, సన్యాసిగా ఉన్నప్పుడు మోదీకి మరోపేరు ఉండేది.. అదేంటో తెలుసా? ఈ ప్రశ్నకు మాత్రం ఎవరూ ఆన్సర్ చెప్పలేక పోవచ్చు. ఒక్క పవన్ కల్యాణ్ మినహా. ఇప్పుడా పేరును జనసేనాని రివీల్ చేయడంతో.. మోదీకి ఇంకో పేరు కూడా ఉండేదనే విషయం అందరికీ తెలిసిపోయింది. అదేంటంటే…
అనికేత్ ఎవరంటే..
పవన్‌కు ఎలా తెలిసిందో ఏమో. ఏ పుస్తకంలో చదివారో ఏమో. ఏ బీజేపీ లీడర్‌ను అడిగారో ఏమో. ఏ ఢిల్లీ పెద్దలు చెప్పారే ఏమో. తెలుగు వాళ్లు ఎప్పుడూ వినని ఆ పేరును అమరావతి వేదికగా చెప్పారు పవన్ కల్యాణ్. ఆది శంకరాచార్యుల 1237వ జయంతి నాడు అమరావతికి వచ్చిన ప్రధాని మోదీని స్వాగతిస్తూ మోదీ గురించి ఆసక్తికర మాటలు మాట్లాడారు. పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు మోదీకి ‘అనికేత్’ అనే పేరు పెట్టారని చెప్పారు. అంతే.. ఒక్కసారిగా ప్రధాని మోదీ షాక్ అయ్యారు. అప్పటి వరకూ తెలుగులో పవన్ ఏం చెబుతున్నారో అర్థంకాక.. యధాలాపంగా అలా కూర్చుని ఉన్న మోదీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పవన్ నోటి నుంచి అనికేత్ అనే పేరు వినబడగానే.. ఎవరో తనను పిలిచినట్టు వెంటనే స్పందించారు. చిరునవ్వు నవ్వుతూ పవన్ వైపు తిరిగి చూశారు. బహుషా మోదీ సైతం ఊహించి ఉండరు.. తనకున్న అనికేత్ అనే పేరు గురించి పవన్‌కు తెలిసి ఉంటుందని.
అనికేత్ అంటే అర్థం ఏంటంటే..
అనికేత్ అంటే పరమ శివుడు, ఇల్లు లేని వాడు అని అర్థమని పవన్ చెప్పారు. అలాంటి ఇల్లు, కుటుంబం లేని మోదీ.. 5 కోట్ల ఆంధ్రులకు ఇల్లులాంటి రాజధాని నగరం నిర్మించడానికి వచ్చారన్నారు. 140 కోట్ల భారతీయుల బాధ్యత తీసుకుని.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. కామాక్య నుంచి ద్వారక వరకు.. దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ.. భారతదేశమే తన ఇల్లుగా చేసుకున్న గౌరవ ప్రధాన మంత్రికి ఘనంగా వెల్‌కమ్ చెప్పారు పవన్ కల్యాణ్. అదీ జనసేనాని నాలెడ్జ్ అంటూ సోషల్ మీడియాలో ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.
Also Read : పవన్‌కు మోదీ ఏం ఇచ్చారంటే.. సభ మొత్తం నవ్వులే..
Also Read : చంద్రబాబును చూసే నేర్చుకున్నా.. బాబును తెగపొగిడేసిన మోదీ