Kayadu Lohar : టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన స్టైల్ కి డాన్స్ కి ఫిదా అవ్వని వాళ్ళు ఉండరు. కేవలం అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలు కూడా అల్లు అర్జున్ అంటే పిచ్చని పడి చచ్చిపోతుంటారు. ఇక హీరోయిన్లు సైతం అల్లు అర్జున్ తో ఒక్కసారైనా సినిమా చేయాలని ఆశ పడుతున్నారు. ఇటీవల చాలామంది హీరోయిన్లు ఇంటర్వ్యూల్లో తమ క్రష్ అల్లు అర్జున్ అంటూ బయట పెట్టేస్తున్నారు. కొందరు హీరోయిన్ లేకుండా అల్లు అర్జున్ తో రొమాన్స్ చేయాలని పబ్లిక్ గానే చెప్పేస్తున్నారు.. నిన్న హీరోయిన్ ప్రియా భవాని బన్నీతో రొమాంటిక్ సీన్లలో నటించాలని ఉందని ఇంటర్వ్యూ లో తన కోరికను బయటపెట్టింది. ఇప్పుడు మరో హీరోయిన్ తన క్రష్ అల్లు అర్జున్ అంటూ మనసులోని మాటని బయట పెట్టింది.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
అల్లు అర్జున్ రీసెంట్ గా నటించిన పుష్ప 2 సినిమా తర్వాత హీరోయిన్స్లలో ఫీలింగ్స్ మొదలయ్యే అని సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతుంది. రోజుకు ఒక హీరోయిన్ను అల్లు అర్జున్తో సినిమా చేయాలని ఉందని ముందుకు వస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ కాయదు లోహర్ కూడా బన్నీ అంటే ఇష్టం అని బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అర్జున్ అంటే నాకు తెలుగు ఇండస్ట్రీలో చాలా ఇష్టం. ఆయనతో సినిమా చేయాలని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా ఆర్య 2 సినిమాలతో నేను పిచ్చ ఫ్యాన్ అయిపోయాను అని తన మనసులోని మాటను బయటపెట్టింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. బన్నీ రేంజ్ అది అందుకే హీరోయిన్లందరూ పడి చచ్చిపోతున్నారు అని ఆ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు.
ఈ హీరోయిన్ రీసెంట్ గా డ్రాగన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈమె గతంలో పలు భాషల్లో సినిమాలు చేసింది కానీ డ్రాగన్ ఇచ్చినంత మంచి క్రేజ్ ను ఏ సినిమా ఇవ్వలేదు. ఈ సినిమా తర్వాత యూత్ క్రష్ గా మారిపోయింది కాయదు.. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో పాటు ఇందులో కాయదు లుక్, నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు నిర్మాతల దృష్టి ఆమెపై పడింది. దీంతో వెంటనే విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ఫంకీ ‘ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ లో నటించే అవకాశం వచ్చిందని తెలుస్తుంది. త్వరలోనే ఆ ప్రాజెక్టు గురించి అనౌన్స్ చెయ్యనున్నారు..
అల్లు అర్జున్ సినిమాలు విషయానికొస్తే.. గతతేడాది చివర్లో పుష్ప 2 మూవీ తో బ్లాక్ బస్టర్ హీట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.. దాదాపు 1900 కోట్ల వరకు ఆ సినిమా కలెక్షన్స్ని రాబట్టింది. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత అట్లీ తో మూవీ చేస్తున్నాడు.