రత్న శాస్త్రంలో అనేక రత్నాల గురించి చెబుతారు. కొన్ని రత్నాలను ధరించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని, గ్రహాల స్థానాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చని అంటారు. కొన్ని రత్నాలను ధరిస్తే కెరీర్, వ్యాపారపరంగా, శుభప్రదంగా సాగుతుందని చెబుతారు. సరైన రత్నాన్ని ధరిస్తే ఖచ్చితంగా జీవితం సరైన మార్గంలో నడుస్తుందని రత్నశాస్త్రం చెబుతోంది. జీవితంలో సానుకూల మార్పులకు ఇవి కారణాల కారణమవుతుందని వివరిస్తుంది. అయితే కెరీర్లో ఉద్యోగంలో విజయం సాధించడానికి ఎలాంటి రత్నాలను ధరించాలో కూడా వివరిస్తుంది.
టైగర్ రత్నం
ఉద్యోగంలో విజయం సాధించడానికి టైగర్ రత్నాన్ని ధరించాలి. ఈ రత్నము.. పసుపు, నలుపు రంగులతో చారల్లాగా కనిపిస్తుంది. ఈ రత్నాన్ని ధరించడం వల్ల కెరీర్ శుభప్రదంగా సాగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది.
పచ్చ
ఆకుపచ్చలో ఉండే పచ్చలు ఎంతో మేలు చేస్తాయి. ఉద్యోగంలో విజయం సాధించడానికి పచ్చరత్నాన్ని ధరించవచ్చు. మీరు దీన్ని ఉంగరంలో పెట్టుకొని చేయించుకుంటే మంచిది. ఈ రత్నం ఆకుపచ్చగా ఉంటుంది. అదృష్టాన్ని తెస్తుంది. గౌరవాన్ని కూడా పెంచుతుంది. ఈ రత్నాన్ని ధరించడం వల్ల మనసు ఏకాగ్రత పెరుగుతాయి.
నీలమణి
ఉద్యోగంలో విజయం సాధించడానికి కెరీర్ పరంగా దూసుకెళ్లడానికి నీలిరంగులో ఉండే నీలమణిని ధరించవచ్చు. నీలమణి శనికి చెందిన రత్నంగా పరిగణిస్తారు. ప్రతి ఒక్కరూ నీలమణిని నిద్రించడం మంచిది. నీలమణికి ధరించిన వ్యక్తికి జీవితంలో సమస్యలు తక్కువగా ఉంటాయి. నీలమణిని ధరించడం వల్ల శనిదేవుడి అశుభ ప్రభావాలు చాలా వరకు తగ్గుతాయి. వారి జీవితం అందంగా ఉంటుంది.
చేతికి ఒకటి కంటే ఎక్కువ రత్నాలను ధరించే ముందు నిపుణులను సంప్రదించాకే పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కో రత్నం ఒక్కో రాశికి లేదా గ్రహానికి చెందుతుంది. కొన్ని రాశులు శత్రువులుగా ఉంటాయి. అలాగే గ్రహాలు కూడా శత్రువులుగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి రత్నాలను ఒకే చేతికి కలిపి పెట్టుకోవడం వల్ల కష్టాలు చెడు పరిణామాలు రావచ్చు. కాబట్టి ఒకే జాతికి రెండు మూడు రకాల రత్నాలు పెట్టుకునే ముందు రత్న శాస్త్ర నిపుణులను కలిసి తగిన సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
పీడకలలు వస్తే
రత్నం శుభప్రదమైనదో కాదో తెలుసుకోవడానికి ముందుగా ఆ రత్నాన్ని మీ దిండు కింద మూడు రోజులు పాటు ఉంచండి. ఆ దిండుపైన తలపెట్టి నిద్రపోండి. మీకు ఎలాంటి పీడ కలలు రాకపోయినా లేదా ఎలాంటి చెడు సంఘటనలు ఎదురు కాకపోయినా ఆ రత్నాన్ని మీరు ధరించవచ్చని అర్థం. పీడకలలు లాంటివి వస్తే ఆ రత్నాన్ని ధరించడం మంచిది కాదు. ఏదైనా రత్నాలను ధరించే ముందు ఆ రంగంలోనే నిపుణులను సంప్రదించాకే ధరించడం అన్ని విధాలా ముఖ్యమైనది.