BigTV English

Kangana Ranaut: మాధవన్ తో రొమాన్స్ కి సిద్ధమైన కంగనా.. ఈసారి అలాంటి సబ్జెక్టుతో!

Kangana Ranaut: మాధవన్ తో రొమాన్స్ కి సిద్ధమైన కంగనా.. ఈసారి అలాంటి సబ్జెక్టుతో!

Kangana Ranaut: కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కంగనా రనౌత్ (Kangana Ranaut) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె.. తెలుగులో ప్రభాస్ (Prabhas) సరసన ‘బుజ్జిగాడు’ సినిమాతో మరింత పేరు సొంతం చేసుకుంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఏదో ఒక విషయంపై స్పందిస్తూ.. రూమర్స్ ఎదుర్కొంటున్న ఈమె.. అటు రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసింద. బిజెపి తరఫున మండి నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచింది. ఒకవైపు ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరొకవైపు సినిమాలలో నటిస్తూ తన ప్యాషన్ నిరూపించుకుంటుంది.


మళ్లీ మాధవన్ తో రొమాన్స్ కి సిద్ధమైన కంగనా..

ఇక చివరిగా ‘ఎమర్జెన్సీ’ సినిమాలో నటించిన ఈమె.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ (Madhavan) తో మళ్ళీ రొమాన్స్ చేయడానికి సిద్ధమయింది. అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఫిక్స్ అయిందని.. అటు షూటింగ్ కూడా కంప్లీట్ అయిందని.. త్వరలోనే పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రముఖ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్(AL Vijay) దర్శకత్వంలో సైకాలజికల్ థ్రిల్లర్ మూవీగా ఒక చిత్రం రూపుదిద్దుకుంటుంది. మాధవన్, కంగన రనౌత్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా బుధవారం రోజు హైదరాబాదులో చిత్ర బృందం ఘనంగా ఒక పార్టీని కూడా చేసుకుంది. ఇక ఈ చిత్రానికి ‘సర్కిల్’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.


తను వెడ్స్ మను 3 పై క్లారిటీ..

ఇకపోతే మాధవన్ , కంగనా రనౌత్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా మొదటిది ఏం కాదు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ‘తను వెడ్స్ మను’ అనే సినిమా వచ్చింది. ఆ తర్వాత ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ చిత్రాలలో కూడా వీళ్ళిద్దరూ జంటగా నటించారు. ఇక వీరిద్దరూ మళ్లీ జతకట్టబోతున్నట్లు వార్తలు రావడంతో.. ‘తను వెడ్స్ మను 3’ సినిమా కోసం జతకట్టబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ ఈ విషయంపై వీరిద్దరూ క్లారిటీ ఇస్తూ.. మేమిద్దరం తను వెడ్స్ మను 3 కోసం కలిసిన నటించడం లేదు. మేమిద్దరం కలిసి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ కోసం పనిచేస్తున్నాము అంటూ గతంలో అటు కంగనా.. ఇటు మాధవన్ ఇద్దరు క్లారిటీ ఇచ్చారు.

సర్కిల్ అంటూ త్వరలో రాబోతున్న కంగనా..

ఇక మొత్తానికైతే ‘సర్కిల్’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రానికి జీ. వీ. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు..హిందీ, తమిళంలో ద్విభాష చిత్రంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. మరొకవైపు మాధవన్ దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ తో కలిసి ‘ఆప్ జైసా కోయి’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఇటీవలే బాలీవుడ్లో విడుదలయ్యింది. మొత్తానికి అయితే మాధవన్ వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తూ అభిమానులను కూడా ఫుల్ ఖుషి చేస్తున్నారని చెప్పవచ్చు.

ALSO READ:Bhagya Sri borse: బంపర్ ఆఫర్ కొట్టేసిన భాగ్యశ్రీ.. ఇక తిరుగులేదండోయ్!

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×