శ్రావణమాసంలో శివ భక్తులు ఆ పరమేశ్వరుని పూజలో మునిగిపోతారు. శ్రావణమాసం శివుడికి ఎంతో ఇష్టమైనది. శివుడిని ఎప్పుడు చూసినా మీకు చేతిలో కచ్చితంగా త్రిశూలం కనిపిస్తుంది. శివుడు ఆ త్రిశూలాన్ని పుట్టుకతోనే పొందలేదు కదా.. మరి మధ్యలో ఎవరు ఇచ్చారు? ఆ త్రిశూలాన్ని ఎలా తయారు చేశారు? ఈ విషయాలు విష్ణు పురాణంలో ఉన్నాయి.
సూర్య భగవానుడి కథ
విష్ణు పురాణం ప్రకారం శివుడికి త్రిశూలాన్ని ఎవరు ఇచ్చారని చెప్పడానికి ఒక కథ ప్రచారంలో ఉంది. విశ్వకర్మ కూతురు సూర్య భగవానుడిని వివాహం చేసుకుంది. వారి వివాహం కొన్ని సంవత్సరాల పాటు సవ్యంగానే జరిగింది. కానీ సూర్యుని వేడిని విశ్వకర్మ కూతురు భరించలేకపోయింది. ఆమె తన తండ్రితో ఆ బాధ గురించి చెప్పుకుంది. అప్పుడు విశ్వకర్మ సూర్య భగవానుడుని వేడిని కాస్త తగ్గించుకోమని ప్రార్థించాడు.
శివుడికి త్రిశులం ఇచ్చింది ఇతడే
దానికి సూర్య భగవానుడు అంగీకరించి తన భాగాలలో కొన్నింటిని భూమిపై పడేశాడు విశ్వకర్మ. సూర్య భగవానుడు నుండి వెలువడే కాంతి నుండి శివుని త్రిశూలాన్ని తయారు చేశాడు విశ్వకర్మ. ఆ త్రిశూలాన్ని శివునికి అందించాడు. శక్తి, న్యాయం, సమతుల్యతకు చిహ్నంగా ఆ త్రిశూలాన్ని చెప్పుకుంటారు.
ఇంట్లో పెంచుకోవచ్చా?
ఇంట్లో చిన్న త్రిశూలాన్ని ఉంచుకుంటే ఎంతో మంచిదని అంటారు. అది ఇంటికి శుభప్రదం అని కూడా చెబుతారు. అందుకే ఎన్నో తెలుగు ఇళ్లల్లో త్రిశూలం పూజ గదిలో కనిపిస్తుంది. మీరు కొన్న త్రిశూలం పెద్దగా ఉంటే దానిని ఇంటి పైకప్పు పై ఉంచుకోవచ్చు. లేదా చిన్నగా ఉంటే పూజ గదిలో ఉంచుకోవచ్చు. ఇంటి ఈశాన్య దశలో త్రిశూలాన్ని ఉంచితే ఎంతో మంచిది. ఇంట్లో త్రిశూలం ఉంచడం వల్ల శివుని ఆశీస్సులు దొరుకుతాయని అంటారు.
శివుడు తన త్రిశూలంతోనే ఎంతోమంది రాక్షసులను, లోకాన్ని ఇబ్బంది పెట్టిన వారిని సంహరించాడు. కేవలం శివుడు చేతిలోనే కాదు.. దుర్గామాత చేతిలో కూడా ఒక త్రిశూలం కనిపిస్తుంది.
త్రిశూలంలోని మూడు భాగాలు భూమి, అంతరిక్షం, స్వర్గంలను సూచిస్తాయని అంటారు. అలాగే సత్వ, రజస, తామస గుణాలను కూడా సూచిస్తాయని చెబుతారు. శివుని చేతిలో ఉన్నటువంటి త్రిశూలం… అజ్ఞానం, కోరికలు, బ్రాహ్మణలను నాశనం చేసే సాధనంగా అంటారు.
శివుని త్రిశూలం… సృష్టి, స్థితి, లయలకు ప్రతీకగా భావిస్తారు. ఎందుకంటే శివుడు ఈ మూడు ప్రక్రియలకు అధిపతి. అందుకే త్రిశూలం ఈ మూడు శక్తులను సూచిస్తుందని ఎంతోమందిని నమ్మకం.