BigTV English

Railway Tracks: రైలు పట్టాల మధ్య రాళ్లు ఎందుకు వేస్తారు? వేయకపోతే ఏం జరుగుతుంది?

Railway Tracks: రైలు పట్టాల మధ్య రాళ్లు ఎందుకు వేస్తారు? వేయకపోతే ఏం జరుగుతుంది?

రైలు పట్టాలను చూడండి. రెండు రైల్వే ట్రాక్‌ల మధ్య రాళ్లు వేసి ఉంటాయి. అలాగే రైల్వే ట్రాక్ పక్కన కొంతమేర రాళ్లు కనిపిస్తాయి. రాళ్లు లేని రైల్వే ట్రాక్ ఎక్కడా ఉండదు. ఇలా రైలు పట్టాల మధ్య రాళ్ళను ఎందుకు ఉంచుతారో ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ ఆ రాళ్లు వేయకపోతే ఏం జరుగుతుంది? ఎవరైనా రైల్వే ట్రాక్ నుండి ఆ రాళ్ళను తొలగిస్తే ప్రమాదమా? దీనికి సమాధానాలు తెలుసుకుందాం.


పట్టాల మధ్య రాళ్లు ఎందుకు?
రైల్వే పట్టాల మధ్య రాళ్లు వేయడం సాధారణ విషయం కాదు. దానికి సైన్స్ తో సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని బ్యాలెస్ట్ అని పిలుస్తారు. రైల్వే ట్రాక్ స్థిరత్వం, భద్రత, దీర్ఘాయువు కోసం ఇలా పట్టాల మధ్య రాళ్లను వేస్తారు.

గట్టి పునాది కోసం
రైలు చాలా బరువు ఉంటుంది. అది కదులుతున్నప్పుడు పట్టాలు విపరీతమైన ఒత్తిడికి లోనవుతాయి. అయితే ఈ రాళ్లు వేయడం వల్ల అవి పట్టాలను గట్టిగా నిలిపి ఉంచుతాయి. ఈ రాళ్లు ఒకదానితో ఒకటి ముడిపడి దృఢమైన పునాదిగా మారతాయి. ఇది పట్టాలు కదలకుండా అడ్డుకుంటాయి. ఈ రాళ్లు అక్కడ లేకపోతే పట్టాలు పక్కకి జరిగిపోవచ్చు లేదా వంకరగా మారవచ్చు. దీనివల్ల రైల్వే ప్రమాదానికి గురవుతుంది.


రైలు పట్టాలపై వెళ్తున్నప్పుడు ఆ రైలు బరువు నేరుగా పట్టాల పైన పడుతుంది. ఎప్పుడైతే ఈ రాళ్లు అక్కడ ఉన్నాయో ఆ రాళ్ళు ఆ బరువును తాము కూడా పంచుకుంటాయి. ఆ బరువును తమ నుంచి నేలవైపు వ్యాపించేలా చేస్తాయి. దీనివల్ల పట్టాలు తీవ్ర ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి. అవి ఎక్కువ కాలం పని చేస్తాయి. అదే ఈ రాళ్లు వేయకపోతే పట్టాలు భూమిలోకి కుంగిపోయే అవకాశం ఉంది, లేదా విరిగిపోవచ్చు కూడా.

వర్షాకాలంలో రైల్వే పట్టాల చుట్టూ నీరు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల పట్టాలు తుప్పు పట్టి బలహీనపడతాయి. అయితే ఎప్పుడైతే రాళ్లు అక్కడ వేస్తామో… నీరు అక్కడ నిలబడడానికి వీలుండదు. అది బయటికి పోయే అవకాశం ఉంటుంది. రైల్వే ట్రాక్ పై నీరు నిలవకుండా, కోతకు గురవకుండా ఈ రాళ్లు కాపాడతాయి.

శబ్ధాన్ని తగ్గిస్తుంది
రైలు పట్టాలపై నుంచి ప్రయాణిస్తున్నప్పుడు ఆ పట్టాలు కనిపిస్తాయి. దీనివల్ల శబ్దం వినబడుతుంది. ఆ శబ్దం విపరీతంగా పెరిగిపోకుండా ఈ రాళ్లు ఆ కంపనాలను గ్రహించి శబ్దాన్ని తగ్గిస్తాయి. ఈ రాళ్లే లేకపోతే రైలు కదిలేటప్పుడు వచ్చే శబ్దానికి చుట్టుపక్కల ప్రాంతాలలో విపరీతమైన శబ్ద కాలుష్యం పెరుగుతుంది.

వేసవి, శీతాకాలంలో ట్రాకులు వ్యాకోచించడం, కుచించుకపోవడం వంటికి జరుగుతూ ఉంటాయి. ఉష్ణోగ్రత మార్పులు ఇనుముతో తయారైన ఈ రైలు పట్టాలపై విపరీతమైన ప్రభావాన్ని సూచిస్తాయి. అప్పుడు ఈ రాళ్లు ఆ సంకోచ వ్యాకోచాలను సమతుల్యం చేస్తాయి. ట్రాక్ లలో పగుళ్లు రాకుండా అడ్డుకుంటాయి. ఎక్కువ కాలం పాటు ట్రాక్ సురక్షితంగా ఉండేలా చూస్తాయి.

పట్టాల మధ్య మట్టి ఉంటే అక్కడ మొక్కలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది పట్టాలను బలహీనపరుస్తుంది. రైలుకు కూడా అడ్డంకిగా మారుతాయి. ఎప్పుడైతే మధ్యలో రాళ్లు వేసామో అక్కడ మొక్కలు పెరగవు. ఎందుకంటే వాటికి పోషకాలు లభించవు. మొక్కల వేర్లు పెరగడానికి అక్కడ సరైన వాతావరణం ఉండదు. అందుకే ఇలా మనము రైల్వే ట్రాక్ల మధ్య రాళ్లను వేస్తూ ఉంటాము.

Related News

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Big Stories

×