BigTV English

Amaravati: అమరావతి వెళితే ఈ ఏడు అద్భుతమైన ప్రదేశాలు మిస్ అవ్వకుండా చూడండి

Amaravati: అమరావతి వెళితే ఈ ఏడు అద్భుతమైన ప్రదేశాలు మిస్ అవ్వకుండా చూడండి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 2,300 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ఇది ఒకప్పుడు శాతవాహన రాజవంశానికి రాజధానిగా పనిచేసింది. బౌద్ధ విద్యకు, సంస్కృతికి ప్రధాన కేంద్రంగా నిలిచింది. పూర్వం దీన్ని ధాన్యకటకంగా పిలిచేవారు. శక్తివంతమైన సామ్రాజ్యాలు, ఆధ్యాత్మిక ఉద్యమాలు, ఆధునిక రాజకీయ మార్పులకు ఈ నగరం మారింది. మీరు అమరావతిని చూడడానికి వెళితే కచ్చితంగా కొన్ని ప్రదేశాలను చూడాలి. అవేంటో తెలుసుకోండి.


అమరావతి చరిత్ర క్రీస్తుపూర్వం 225 ప్రాంతంలో శాతవాహనుల కాలంలో ప్రారంభమైంది. పశ్చిమ రాజధానిని ప్రతిష్టానం అని, తూర్పు రాజధాని అమరావతి అని ఏర్పాటు చేసుకున్నారు. అమరావతిలో చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.

అమరేశ్వరాలయం
కృష్ణానది ఒడ్డున ఉన్న పవిత్ర ఆలయం ఇది. శివుడికి అంకితం చేశారు. పదిహేను అడుగుల పొడవైన తెల్లని పాలరాయితో శివలింగాన్ని తయారుచేశారు. ద్రావిడ నిర్మాణ శైలిల్లో అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం.


అమరావతి స్థూపం
కృష్ణా నది ఒడ్డున ఉన్న మహాచైత్యం ఇది. క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుండి శాతవాహనులు తర్వాత ఇక్ష్వాకుల పోషణలో ఈ పురాతన బౌద్ధ స్తూపం నిర్మాణానికి నోచుకుంది. నేటికీ చెక్కుచెదరకుండా నిలిచి ఉన్న అందమైన అమరావతి మహాచైతన్యాన్ని జీవితంలో ఒక్కసారి అయినా దర్శించుకోవాలి.

అమరావతి హెరిటేజ్ సెంటర్ మ్యూజియం
గుంటూరు – అమరావతి రోడ్డులో రెండు అంతస్తుల భవనంలో మ్యూజియం ఉంటుంది. 2006లో కాలచక్ర మహాసమ్మేళనం సందర్భంగా దలైలామా దీన్ని ప్రారంభించారు. ఈ ప్రాంతంలో లోతైన బౌద్ధ వారసత్వానికి సంబంధించి ఎన్నో మూలాలు ఉన్నాయి. ఈ మ్యూజియంలో పురావస్తు తవ్వకాల్లో బయటపడిన శిల్పాలు, కుండలు, శాసనాలు, నాణాలు, మతప్రదమైన కళాఖండాలు అధికంగా ఉంటాయి. వాటిని చూసేందుకు ఒక్కసారి అయినా వెళ్లాల్సిందే.

ధ్యాన బుద్ధ విగ్రహం
అమరావతికి ఐకాన్ లా మారింది ధ్యాన బుద్ధ విగ్రహం. 125 అడుగుల ఎత్తులో ఉన్న భారీ బుద్ధ విగ్రహం ఇది. సరిగ్గా కృష్ణా నది పక్కనే నాలుగున్నర ఎకరాల ప్రదేశంలో ఇది ఉంటుంది. 2003లో దీని నిర్మాణాన్ని ప్రారంభిస్తే 2015లో పూర్తయింది.

ఉండవల్లి గుహలు
అమరావతి నుండి దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో ఈ ఉండవల్లి గుహలు ఉంటాయి. భారతీయ ఏకశిలా నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణలుగా ఈ ఉండవల్లి గుహలు నిలుస్తాయి. వీటిని జైన నివాసాలుగా ఒకప్పుడు చెప్పుకునేవారు. ఈ గుహలను గుప్తుల శైలిలో నిర్మించాలని చెబుతారు. గుహలలోని కొన్ని గదులలో విష్ణువు విగ్రహాలు శయనిస్తున్న భంగిమలో ఉంటాయి.

ప్రకాశం బ్యారేజీ
అమరావతి నుండి పల్లెటూరు కిలోమీటర్ల దూరంలో ప్రకాశం బ్యారేజీ ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన నీటిపారుదల నిర్మాణంగా చెప్పుకోవాలి. 1958లో ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పేరు మీద దీన్ని నిర్మించారు.

భవానీ ద్వీపం
అమరావతి నుండి కేవలం 17 కిలోమీటర్ల దూరంలోనే ఈ భవాని ద్వీపం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని అతి పెద్ద నదీ ద్వీపం ఇది. కృష్ణా నదిలో ఉన్న ఈ భవాని ద్వీపం ప్రకృతి ప్రేమికులకు, కుటుంబాలకు ప్రశాంతమైన విహార ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఈ ద్వీపంలో విభిన్నమైన పక్షి జాతులు కూడా కనిపిస్తాయి. నేచర్ వాకింగ్, బూటింగ్, ఫిషింగ్, వాటర్ స్పోర్ట్స్ వంటివి కూడా ఉంటాయి.

Related News

Metro news 2025: ఆ నగరానికి బూస్ట్.. రూ.15,906 కోట్ల భారీ మెట్రో ప్రాజెక్ట్.. ఇక జర్నీ చాలా సింపుల్!

Heartwarming Story: దుబాయ్ లో ఫోన్ పోగొట్టుకున్న ఇండియన్ యూట్యూబర్, సేఫ్ గా ఇంటికి పంపిన పోలీసులు!

Vande Bharat Trains: అందుబాటులోకి 20 కోచ్‌ ల వందేభారత్ రైళ్లు, తెలుగు రాష్ట్రాల్లోనూ పరుగులు!

Railway tunnels: సొరంగాల్లో సైరన్ ప్రతిధ్వని.. నంద్యాల రైల్వే టన్నెల్స్ రహస్యాలు ఇవే!

Women Assaulted: రైల్వే స్టేషన్‌ లో దారుణం, మహిళను తుపాకీతో బెదిరించి.. గదిలోకి లాక్కెళ్లి…

Railway Guidelines: ఆ టైమ్ లో రైల్లో రీల్స్ చూస్తున్నారా? ఇత్తడైపోద్ది జాగ్రత్త!

Big Stories

×